Smart TV : ప్రస్తుతం అందరూ టీవీల్లోని స్మార్ట్ ఫీచర్స్, పెద్ద డిస్ప్లే ఉన్న వాటిని కావాలనుకుంటున్నారు. అయితే మార్కెట్లో 35 వేల లోపు ధరలో మంచి Smart TV 50 అంగుళాల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. 1) కోడాక్ మ్యాట్రిక్స్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ :- ఈ 50 ఇంచుల కోడాక్ మ్యాట్రిక్స్ సిరీస్ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ 60రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్ తో 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ను అందిస్తుంది. అద్భుతమైన 4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్ ను అందిస్తుంది. బహుముఖ కనెక్టివిటీ కోసం 3 హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, వైఫై ఆప్షన్ ఉంటుంది. 104వాట్ల డీజే సౌండ్ తో కూడిన అంతర్నిర్మిత సబ్ వూఫర్, డాల్బీ అట్మోస్ ఆడియో కోసం నాలుగు స్పీకర్లు ఉన్నాయి. అంతేకాక వాట్రిస్ట్, కిడ్స్ మోడ్, గూగుల్ ప్లే స్టోర్ వంటి ఫీచర్లతో గూగుల్ టీవీ రన్ అవుతుంది. టీవీలో హ్యాండ్స్-ఫ్రీ మైక్, హాట్ కీలతో కూడిన యాక్టివ్ వాయిస్ రిమోట్ కంట్రోల్, అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 29,999గా ఉంది. దీనిలో 16జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ ఉంటుంది.
2) గ్లోఎల్ఈడీ సిరీస్ 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ :- ఈ 50 ఇంచుల స్మార్ట్ టీవీ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ను అందిస్తుంది. 4కే అల్ట్రా హెచ్డీ రిజల్యూషన్ తో వస్తుంది. ఇది వైఫై, బ్లూటూత్ 5.1తో సహా బహుముఖ కనెక్టివిటీ కోసం 3 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులను అందిస్తోంది. ఈ టీవీలో గూగుల్ టీవీ, కిడ్స్ మోడ్, గూగుల్ ప్లే స్టోర్ వంటి పీచర్లు ఉంటాయి. యాక్టివ్ వాయిస్ రిమోట్ కంట్రోల్, బిల్ట్-ఇన్ క్రోమ్ కాస్ట్ యూజర్ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి. డాల్బీ అట్మోస్, అంతర్నిర్మిత సబ్ వూఫర్, నాలుగు స్పీకర్లతో కూడిన శక్తివంతమైన 104 వాట్ డీజే సౌండ్ సిస్టమ్ అందించబడుతుంది. డాల్బీ విజన్, హెచ్డీఆర్10 ప్లస్, హెచ్ఎల్జీ సపోర్టుతో కూడిన 4కే గ్లో ప్యానెల్ శక్తివంతమైన విజువల్స్ ను అందిస్తుంది. డైనమిక్ బ్యాక్లైట్ కంట్రోల్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఎంఈఎంసీ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ.32,999 గా ఉంది. యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి యాప్స్ కు సపోర్టు చేస్తుంది.
3) వీడబ్ల్యూ క్యూఎల్ ఫ్రేమ్స్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ టీవీ :- ఈ 50 ఇంచుల క్యూఎల్ ఫ్రేమ్స్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో అద్భుతమైన 4కే రిజల్యూషన్ ను అందిస్తుంది. దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్ట్లు, రెండు యూఎస్బీ పోర్ట్లు, అలెక్సా, డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి ఫీచర్లతో వస్తుంది. డాల్బీ ఆడియోతో 30 వాట్ల శక్తివంతమైన సౌండింగ్ ను అందిస్తుంది. మేజిక్ రిమోట్, థిన్ క్యూ ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉంటాయి. నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ యాప్లకు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 28,999గా ఉంది.4) క్వాంటం సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ టీవీ :- ఈ 50 ఇంచుల క్వాంటం సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ ఎల్ఈడీ గూగుల్ టీవీ 4కే రిజల్యూషన్, 60హెర్జ్ రిఫ్రెష్ రేట్తో అద్భుతమైన విజువల్స్ ను అందిస్తుంది. డ్యూయల్-బ్యాండ్ వైఫై, 3 హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, టీవీ డాల్బీ అట్మోస్ డీటీఎస్ హెచ్డీతో శక్తివంతమైన 48-వాట్ సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఇది గూగుల్ టీవీ ఓఎస్ పై రన్ అవుతుంది. స్క్రీన్ మిర్రరింగ్ ఆప్షన్ ఉంది. 2జీబీ ర్యామ్, 16జీబీ రోమ్ ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూ ట్యూబ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 25,999గా ఉంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.