
Whatsapp : వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్స్ .. ఒక వ్యక్తిని నాలుగు రకాలుగా బ్లాక్ చేయవచ్చు..!
Whatsapp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే యాప్ లలో ఒకటి వాట్సాప్. ఈ యాప్ లో మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు పంపించేందుకు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇవి మెరుగ్గా మరింత ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్, ఎమోజీలు, స్టిక్కర్ ఫోటోలు లేదా వీడియోలు అప్లోడ్ చేయడం వంటి ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ఎవరినైనా బ్లాక్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఒకరిని బ్లాక్ చేస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఒకసారి వారిని బ్లాక్ చేశారంటే మన కార్యకలాపాలను చూడడానికి అనుమతించడం లేదని అర్థం.
కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలను ఇతర సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు అనిస్తుంటుంది. అలాంటి వ్యక్తులకు మెరుగైన అనుభవం కోసం బ్లాకింగ్ సామర్థ్యాలను వాట్సాప్ డెవలప్ చేసింది. వాట్సాప్ లో ఒక వ్యక్తిని బ్లాక్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి స్టేటస్ లో నుంచి బ్లూ టిక్స్ చాటింగ్ పూర్తిగా ముగించడం ప్రొఫైల్ ఎవరు చూడకుండా ఉండడం ఉండడానికి అనేకమార్గాలు ఉన్నాయి. ఇప్పటికే వాట్సాప్ తన యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు చాలా ఫ్యూచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరి కొన్ని లేటెస్ట్ ఫీచర్లను తమ వినియోగదారులకు అందించినట్లుగా తెలుస్తుంది.
1) అందులో ఒకటి నెంబర్ ను బ్లాక్ చేయడం. ఒక వ్యక్తి నెంబర్ ని బ్లాక్ చేస్తే వారికి లాంటి మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు వెళ్లవు. వాళ్ల నుంచి కూడా ఎలాంటి కాల్స్, వీడియోలు రాకుండా ఆగిపోతాయి.
2) ఒక వ్యక్తిని బ్లాక్ చేయాలంటే మరొక మార్గం ప్రొఫైల్ ఫోటోను బ్లాక్ చేయడం : ఒక యూజర్ మిమ్మల్ని ప్రొఫైల్ ఫోటో సెట్టింగ్ లో నుంచి బ్లాక్ చేస్తే వారి ప్రొఫైల్ ఫోటోని చూడలేరు. యూసర్లు తమ డీపీ కొందరికి కనిపించేలా కొందరికి కనిపించకుండా చేసే ఆప్షన్ కూడా ఉంది.
3) లాస్ట్ వ్యూ బ్లాక్ చేయడం : వాట్సాప్ లో లాస్ట్ వ్యూను బ్లాక్ చేయడం వలన ఆ సమయంలో మనం ఆన్లైన్ లో ఉన్న సమయాన్ని చూడకుండా ఆపేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
4) వాట్సాప్ స్టేటస్ ను బ్లాక్ చేయడం : ఎవరైనా వాట్సాప్ స్టేటస్ నుంచి బ్లాక్ చేసినట్లయితే వారి షేర్ చేసిన ఫోటోలు, వీడియోలను ఎవరు చూడలేరు. ఇలా వాట్సాప్ లో ఉన్న ఈ నాలుగు ఫీచర్ల ద్వారా ఒక వ్యక్తిని ఈజీగా బ్లాక్ చేయవచ్చు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.