Phone Tapping : ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక మలుపు.... మనుగోడు ఉప ఎన్నికల్లోను ఫోన్ టాపింగ్...!
Phone Tapping : తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువస్తుంది. ఇక ఈ ఫోన్ టాపింగ్ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు గవర్నమెంట్ అధికారులు సైతం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్ఐబి వేదికగా జరుగుతున్న ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తూ దర్యాప్తు చేపడుతున్నారు. ఫోన్ టాపింగ్ కేసులో భాగంగా ఇప్పటికే హార్డ్ డిస్క్ ధ్వంసం నుండి మొదలైన ఈ కేస్ , విపక్ష నేతల ఫోన్ టాపింగ్ , ఎన్నికల సమయంలో అధికారులు డబ్బులు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెయినాబాధ్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యే కొనుగోలు కుట్ర కేసుతో ఉన్న లింకులు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం మరి కొంతమంది పోలీస్ అధికారుల మెడకు ఉచ్చుతాడు బిగించినట్లు అయింది.
అయితే 2022 నవంబర్ లో మీనాబాద్ ఫామ్ హౌస్ లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు ,రేగ కాంతారావు ,హర్షవర్ధన్ రెడ్డి హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఈ నలుగురు ఫోన్ లను ఎస్ఐబి డిఎస్పి హోదాలో ఉన్న ప్రణీత్ అండ్ కో టాపింగ్ చేయడం వలనే పట్టుబడినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని ముందుగా బీఆర్ఎస్ సర్కార్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. దీంతో పక్క ప్రణాళికతో ఆ నలుగురు ఎమ్మెల్యేతోనే ప్రధాన నిందితుడు ,నందకుమార్ ,సింహ యాజి ,రామచంద్ర భారతి లను పట్టినట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు అది కొద్దిమంది అధికారులతో ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి.
అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నాయకుల ఫోన్ టాప్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ విన్నట్లుగా అభియోగాలు వచ్చాయి. నల్లగొండకు చెందిన ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేసినట్లు సమాచారం. అయితే జిల్లాలో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే సంభాషణలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లుగా సమాచారం. అంతేకాక హైదరాబాద్ రోడ్ లో ఫోన్ ట్యాప్ చేసి వినడానికి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోన్ టాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. వారిపై కూడా స్పెషల్ పోలీస్ అధికారులు నిఘా ఉంచినట్లు సమాచారం. అయితే స్పెషల్ పోలీస్ అధికారులు లిఫ్ట్ చేసిన ఆ ఇద్దరు కానిస్టేబుల్ని మాత్రం ప్రస్తుతం హైదరాబాద్ తీసుకొచ్చినట్లుగా సమాచారం
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
This website uses cookies.