
Crop Loan Waive : గుడ్‌న్యూస్ .. రైతు రుణమాఫీ పై క్లారిటీ... ఎప్పుడంటే...!
Crop Loan Waive : తెలంగాణ రైతు రుణమాఫీ పై తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో 2 లక్షలు రైతు రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఆగస్టు కంటే ముందుగానే రైతు రుణమాఫీ చేస్తామని దానిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రజాభిప్రాయం సేకరించి విధివిధానాలు రూపొందించిన తర్వాత అసెంబ్లీలో రైతు భరోసా పై చర్చలు అమలు చేస్తామని బట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు గా రైతు భరోసా ఇవ్వమని చెప్పరు. రైతులతో మాట్లాడి విధివిధానాలను రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కోమాటిరెడ్డి , వెంకటరెడ్డి పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిపారు. అదే విధంగా గత ప్రభుత్వ పాలనలో మిషన్ భగీరథ పేరుతో 42 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క ఆరోపించడం జరిగింది. అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి మంచినీళ్లు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం కొత్తగూడెంలో 125 కోట్లతో పనులు ఎందుకు చేపడతామని బట్టి విక్రమార్క ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తామని రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటామని మట్టి చెప్పారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో ధర్మల్ పవర్ ప్లాంట్ ను రామగుండంలో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసామని త్వరలోనే ప్రజలకి శుభవార్త వింటారు అని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తామని అన్నారు. వాటితో పాటుగా ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నుంచి నీటిని వదులుతామని చెప్పారు. ఇక పాలవంచ కొత్తగూడెం రెండు పట్టణాలు కలిపితే కార్పొరేషన్ ఏర్పాటు తో పాటు స్థానికంగా ఐటి హబ్ ఏర్పాటు చేసే ఆలోచనల ప్రభుత్వం ఉంది అని పేర్కొన్నారు.
Crop Loan Waive : గుడ్‌న్యూస్ .. రైతు రుణమాఫీ పై క్లారిటీ… ఎప్పుడంటే…!
రైతుబంధు ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని చెడు ప్రచారాలు జరిగాయని కాని రైతుల ఖాతాలో ఒకేసారి 7500 కోట్లు జమ చేసామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పంట సాగు చేయని భూములకు రైతు భరోసా ఇవ్వమని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయం పై అన్నదాతల అభిప్రాయాలను తీసుకుంటున్నామని ఆలస్యం జరిగిన రైతులకు మేలు చేస్తామని తెలిపారు . గత ప్రభుత్వ పాలనలో 9 వేల కోట్లల రూపాయలను ఖర్చు చేసిన ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. గతంలొ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పేర్లు మార్చి డబ్బుని దోచుకున్నారని ఆరోపించారు పొంగులేటి. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు గంటల్లో వెళ్లేలా ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే కేంద్రమంత్రి గడ్కరి ఆదేశాలతో సెప్టెంబర్ లో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.