Home » News » Cm Revanth Reddy Comments About Kcr
News

CM Revanth Reddy : కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు… నిజంగా కేసీఆర్ కు సిగ్గు లేదు…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: April 2, 2024, 9:10 pm
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు సరైన సమయానికి రైతుల ఖాతాలలో చేరేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అది చేతకావడం లేదని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరువు వచ్చిందంటూ విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ను తిట్టడం తప్ప మరో పని లేదని పేర్కొన్నారు.

Advertisement

నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చిందా అనేది వచ్చే జూలై నెల నుండి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా లేదా ,లేక కాంగ్రెస్ వలన ప్రకృతి పగ పట్టిందా అనే లెక్క అప్పుడు తెలుస్తది. మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. అది చేయలేదు ఇది చేయలేదని విమర్శలు చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఖాతాలో రైతుబంధు 10 రోజుల్లో వేసామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ నిజంగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ లో మొదలుపెడితే సెప్టెంబర్ వరకు అంటే దాదాపు 10 నెలల వరకు రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో వేసిన లెక్కలు ఉన్నాయి.కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఇక అసెంబ్లీలో అవన్నీ బయటపెడదామంటే నువ్వు రాకుండా పారిపోయావు అంటూ కేసిఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

2018 ఎన్నికల్లో మాత్రమే రైతుబంధు సరైన సమయానికి ఇచ్చారు. ఆ తర్వాత నుండి ప్రతిసారి కూడా రైతుబంధు వేయడానికి కనీసం నాలుగు నెలల సమయం తీసుకున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 64 లక్షల 75 వేల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు వేసాము అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నది 69 లక్షల మంది ఖాతాలు. దీనిలో ఇప్పటికే 64 లక్షలు మందికి డబ్బు చేరడం జరిగింది. ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే. నేను కేసీఆర్ కి సూటిగా సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే వచ్చి ఈ లెక్కలలో తప్పు ఉంటే నిజం కాదని నిరూపించాల్సిందిగా కోరుతున్నానంటూ కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి