
Pushpa 2 Teaser : పుష్ప 2 టీజర్ అప్డేట్...ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం...!
Pushpa 2 Teaser : టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు కూడా విపరీతంగా ఉన్నాయి. అయితే 2021లో వచ్చిన పుష్ప 1 ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప పార్ట్ 2 అంతకుమించి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన పోస్టర్లు సైతం సినిమా ఎలా ఉండబోతుందో ముందే చెప్పేలా ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈసారి అల్లు అర్జున్ క్యారెక్టర్ మరింత కొత్తగా ఐ హోల్టేజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదివరకే బన్నీ లేడీ గెటప్ లో ఉగ్రరూపంతో కనిపించిన పోస్టర్ ఒకటి పెద్ద ఎత్తున వైరల్ అయింది.ఇక ఇప్పుడు మరొక పోస్టర్ ద్వారా సినిమా టీజర్ పై అధికారిక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇటీవల రిలీజైన ఈ పోస్టర్ లో హీరో కాలుకి గజ్జలు కట్టుకొని నాట్యం ఆడుతున్నట్లుగా కనిపిస్తుంది. చుట్టూ కుంకుమతో కాళ్లకు గజ్జలు కట్టుకొని కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా బలంగా ఉంటాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ టీమ్స్ సిద్ధమవుతున్నట్లుగా ఈ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ అప్డేట్ కోసమే చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. మొత్తానికి పోస్టర్ ద్వారా మూవీ టీమ్ టీజర్ అప్డేట్ ఇవ్వడంతో సినిమాపై చాలా పాజిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త ట్రెండింగ్ లో ఉంది.ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కెట్ ను అందుకోవాలని చూస్తున్నారు. అలాగే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 650 కోట్లకు పైగానే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో బాక్సాఫీస్ వద్ద పుష్ప2 సినిమా కాస్త క్లిక్ అయినా సరే 1000 కోట్ల టార్గెట్ అందుకోవటం ఖాయమని పలువురు తెలియజేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ పాన్ ఇండియా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న విడుదల చేసేందుకు మూవీ టీం సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.