
D Srinivas : బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కన్నుమూత
D Srinivas : Dharmapuri Srinivas కాంగ్రెస్ Congress సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) D Srinivas హైదరాబాద్‌లోని Hyderabad సిటీ న్యూరో ఆస్పత్రిలో తెల్లవారుజామున 3 గంటలకు కన్నుమూసారు. ఆయన మరణంతో కాంగ్రెస్ వర్గాలకి ఒక్కసారిగా గుండెపగిలినంత పని అయింది. గత కొంతకాలంగా డీ. శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తెల్లవారు జామున 3.30 గంటలకు డి శ్రీనివాస్ మృతి చెందినట్టు కుమారుడు ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘అన్నా.. అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు ఎప్పటికీ నా లోనే ఉంటావు’ అని ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు.
డి.శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరి…. రాజ్యసభ ఎంపీగా పని చేశారు. ధర్మపురి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 25న జన్మించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డీ శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరైన ధర్మపురి అర్వింద్.. ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా(బీజేపీ) ఉన్నారు. పెద్ద కుమారుడు డి.సంజయ్ నిజామాబాద్ నగర మాజీ మేయర్ గా పని చేశారు. ప్రస్తుతం ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈయన 1989, 1999, 2004లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
D Srinivas : బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కన్నుమూత
ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పాటు సేవలందించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. కొద్ది రోజుల పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఆపై రాజ్యసభ సభ్యునిగా సైతం కొనసాగారు. చివర్లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తరువాత అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. శ్రీనివాస్ మృతితో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర విషాదంలో ఉన్నాయి. హైదరాబాద్ నివాసంలో డీఎస్ పార్థీవదేహనికి పలువురు నేతలు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. రేపు నిజాబామాద్లో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.