
Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, తన ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేయించింది. షాపూర్‌నగర్‌లో నివాసముండే అంజలి (39)కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి భర్త చనిపోయాక రెండో వివాహం చేసుకున్న ఆమె, ఇద్దరు పిల్లలను పెంచుతూ కళా బృందంలో పనిచేస్తూ జీవనం కొనసాగించేది. ఈ క్రమంలో పెద్ద కూతురు (15)కి నల్గొండకు చెందిన డీజే ఆపరేటర్ శివకుమార్ (19)తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది.
Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!
తన ప్రేమను తొలుత అంగీకరించిన తల్లి ఆ తర్వాత మళ్లీ అడ్డుపడడంతో బాలిక తీవ్రమైన కోపానికి లోనైంది. తన ప్రియుడికి తల్లిని హత్య చేయాలని ప్రేరేపించింది. తాను చనిపోతానంటూ బెదిరించడంతో శివకుమార్ తన 16 ఏళ్ల తమ్ముడితో కలిసి అంజలిని తల్లిని హత్య చేశాడు. ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. హత్య అనంతరం పోలీసులు బాలికతో పాటు శివకుమార్, అతని సోదరుడిని అరెస్ట్ చేసి, ఇద్దరు మైనర్లను జువెనైల్ హోంకు తరలించారు.
ఇక ఈ హత్యపై శివ తల్లి చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. హత్య చెల్లుబాటు అవుతుందని, తప్పంతా అమ్మాయిది, ఆమె తల్లిదేనని చెప్పడం ఆవేదన కలిగిస్తోంది. తన కుమారులు జైలులో ఉన్నా పర్వాలేదని, తిరిగి వస్తారంటూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. అంజలి మృతితో రెండో కుమార్తె అనాథగా మిగలడం, కుటుంబం పూర్తిగా చిద్రమవడం తల్లితండ్రులపై పిల్లలు చేసే దాడుల ఘాతుక మానసికతపై విస్తృత చర్చకు దారితీసింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.