Home » News » Fake Mutton Racket Busted In Hyderabad 50 Kg Adulterated Meat Seized
News

Fake Mutton : షాకింగ్ న్యూస్‌… హైదరాబాద్‌లో మటన్ తింటున్నారా..? మటన్‌లో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సరఫరా!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 2, 2026 2:50 pm
Advertisement

Fake Mutton : హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తాజా తనిఖీల్లో మటన్‌లో ఎద్దు మాంసం Fake Mutton కలిపి విక్రయిస్తున్న కల్తీ మాంసం రాకెట్ Fake Mutton  బయటపడింది. ఈ ఘటన నగర ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా హోటళ్లకు సరఫరా అవుతున్న మాంసం నాణ్యతపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన H-Fast అధికారులు మరియు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హబీబ్‌నగర్ పరిధిలో కొంతకాలంగా మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ మాంసాన్ని నగరంలోని కొన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

Advertisement

షాకింగ్ న్యూస్‌… హైదరాబాద్‌లో మటన్ తింటున్నారా..? మటన్‌లో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సరఫరా!

Fake Mutton : ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగులోకి వచ్చిన కల్తీ మాంసం దందా

అధికారులు మల్లెపల్లిలోని ఓ మాంసం దుకాణంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మేక మాంసంతో Fake Mutton పాటు ఇతర మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వినియోగదారులను మోసం చేస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.దర్యాప్తు అనంతరం ఉస్మాన్ ఖురేషి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మాంసం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఇంకా ఎన్ని హోటళ్లకు సరఫరా చేశారు? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement

Fake Mutton : 50 కిలోల కల్తీ మాంసం స్వాధీనం.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

దాడుల సందర్భంగా అధికారులు సుమారు 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని పరీక్షల కోసం సంబంధిత ప్రయోగశాలకు పంపించినట్లు తెలుస్తోంది. అలాగే ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు మాంసాహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచిస్తున్నారు. లైసెన్స్ కలిగిన, విశ్వసనీయమైన దుకాణాల నుంచే మాంసం కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టేందుకు నగర వ్యాప్తంగా తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి