Home » News » Farmers Expectations On Farmer Insurance Funds
News

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ? .. యాసంగి పంట పై అన్నదాతల ఎదురు చూపులు

Authored By
Suma
The Telugu News | Published on: February 1, 2026, 5:00 pm
Advertisement

Rythu Bharosa : యాసంగి పంట  Yasangi panta  సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుతుంది. కానీ ప్రభుత్వ వైపు నుంచి రైతులకు ఎలాంటి స్పష్టమైన అప్డేట్ ఇంకా ఇవ్వబడలేదు. ప్రతి సీజన్‌లో రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధులు  Rythu Bharosa Funds  గురించి ప్రభుత్వం మౌనంగా ఉండటం పంటల పరంగా ఆందోళనను పెంచుతోంది. పంటల సాగింపులో పెట్టుబడులు, ఎరువులు, యంత్రసాధనల ఖర్చుల నేపథ్యంలో  రైతులకు ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తోంది. రైతులు తమ ఖాతాల్లో భరోసా నిధులు ఎప్పుడు జమవుతాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు.

Advertisement

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ? .. యాసంగి పంట పై అన్నదాతల ఎదురు చూపులు

Rythu Bharosa : శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభం

ప్రస్తుతం యాసంగి పంటలపై శాటిలైట్ మ్యాపింగ్ కార్యక్రమం  Satellite mapping process  జరుగుతోంది. ప్రభుత్వాధికారుల ప్రకారం ఈ మ్యాపింగ్ ద్వారా ప్రతి రైతు పంటల స్థితి, విస్తీర్ణం, పరిస్థితులు ఖచ్చితంగా గుర్తించబడతాయి. శాటిలైట్ డేటా ఆధారంగా మాత్రమే రైతు భరోసా నిధులు పంపిణీ అవుతాయి. రైతులు ఏ ప్రాంతంలో పంట సాగించారు, ఎన్ని ఎకరాల్లో పంట పెంచారు, లబ్ధి అంచనాలు ఏంటో తెలుసుకోవడానికి ఇది ఒక ఆధునిక సురక్షిత విధానం.

Advertisement

రైతు భరోసా అందుతుందా? .. ప్రజల్లో సందేహాలు

అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్ పూర్తయిన తర్వాతనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమవుతాయా అనే సందేహాలు రైతులలో  Farmers  ఉన్నాయని తెలుస్తోంది. ప్రతీ రైతుకి ఈ భరోసా వస్తుందా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటల నివేదికలు తక్షణం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి అందరికీ సమానంగా నిధులు రాలేకపోవచ్చనే భయాలు వ్యక్తమయ్యాయి. రైతుల ఆందోళనలను తీర్చడానికి అధికారులు త్వరలో అధికారిక ప్రకటనలు చేయాలని ఉద్దేశిస్తున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్ రైతులకు ముఖ్యమైన సమయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన టైమ్‌లైన్ లేకపోవడం నిధుల అందుబాటులో ఆలస్యం రావడం పెద్ద సమస్యగా మారింది. రైతులు శాటిలైట్ మ్యాపింగ్ పూర్తయ్యాక కూడా తమ ఖాతాల్లో భరోసా నిధులు ఎప్పుడు జమవుతాయో వేచి చూస్తున్నారు.

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి