Malipeddi Sudheer Reddy : ఘనంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు..!
Malipeddi Sudheer Reddy : జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేషన్ Congress Party కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మరియు కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్,ఘట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేశ్ . మేడ్చల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు,కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్,ఘట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేశ్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
Malipeddi Sudheer Reddy : ఘనంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు..!
ఈ సందర్భంగా తుంగతుర్తి రవి గారు మాట్లాడుతూ, మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధిలో మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి పాత్ర ఎంతో ముఖ్యమైనదని, ఆయన చేసిన అభివృద్ధి పనులు చిరస్మరణీయమని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేస్తూ, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు పార్టీ కట్టుబడి ఉందని, ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు. మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ నాయకులు బండిరాళ్ల భాస్కర్, నాదం గౌడ్, బండి శ్రీరాములు, వంగూరి పరమేష్, సుదర్శన్ రెడ్డి, సోమయ్య, సైదా నాయక్, కృష్ణ, కపిల్, విష్ణు,పీర్జాదిగూడ మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్రు నాయక్,ఎన్.ఎన్.కె. దుర్గ,అరుణ, అంజమ్మ మరియు ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ISRO-ICRB Recruitment : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ISRO-ICRB) సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల కోసం…
Jeera Water : మన వంటింట్లోనే నిక్షిప్తమై ఉన్నానా వస్తువులతోనే మన ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. కానీ వీటిని చాలామంది…
Zodiac Signs : ఈ 2025వ సంవత్సరములో ఈ రాశుల వారికి ఎంతో అదృష్టం కలగబోతుంది. పేద జ్యోతిష్య శాస్త్రాలలో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో…
Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు…
TDP Mahanadu : 2025 మహానాడు వేదికపై ఆంధ్రప్రదేశ్ Andhra pradesh CM Chandrababu ముఖ్యమంత్రి, టీడీపీ TDP అధినేత…
Jr NTR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుండడంపై…
This website uses cookies.