Free Petrol : పెట్రోల్ కావాలంటే ఏం చేస్తాం.. పెట్రోల్ బంక్ కి వెళ్లి రూ.110 చెల్లిస్తే లీటర్ పెట్రోల్ పోస్తారు అంటారా? కానీ.. రూపాయి కూడా ఖర్చు కాకుండా.. ఉచితంగా పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవచ్చు. కాకపోతే మీరు ఒక పని చేయాలి. మీ ఇంట్లో నుంచి వచ్చే చెత్తను తీసుకొచ్చి వీళ్లకు ఇవ్వాలి. అదేంటి.. చెత్తను చెత్తడబ్బాలో వేస్తాం కదా. చెత్తకుప్పలో పడేస్తాం కదా. వీళ్లు ఆ చెత్తను ఏం చేసుకుంటారు అంటారా? అవును.. వాళ్లు ఆ చెత్తను రీసైకిల్ చేస్తారు. మీరు ఎంత చెత్త ఇస్తే.. అంత ఎక్కువ పెట్రోల్ మీకు వస్తుంది.
రీఫ్యుయల్ విత్ రీసైకిల్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది ఎక్కడో అనుకునేరు. మన హైదరాబాద్ లోనే కోకో అనే పెట్రోల్ బంక్ లో దీన్ని ప్రారంభించారు. హైటెక్ సిటీలో ఈ పెట్రోల్ బంక్ ఉంది. ఈ బంక్ బ్రాంచీలు హైదరాబాద్ లో మొత్తం ఐదు ఉన్నాయట. ఏ బ్రాంచ్ కైనా సరే.. చెత్తను తీసుకెళ్లి పెట్రోల్ ఉచితంగా కొట్టించుకోవచ్చు.అక్కడ దీని కోసం ఒక మిషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దాని పేరు వెండింగ్ మిషన్. అందులో చెత్త వేయాలి. కాకపోతే చెత్తలోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఏ చెత్తను పడితే ఆ చెత్తను తీసుకోరు. పెట్ బాటిల్స్, అల్యూమినియం క్యాన్స్ లాంటివి వేస్తే ఎక్కువ ఫ్యుయల్ వస్తుంది.
ప్లాస్టిక్ వేస్ట్, పేపర్స్, కార్డ్ బోర్డ్స్, బుక్స్, ఈ వేస్ట్ లాంటి మొబైల్స్, లాప్ టాప్స్, మానిటర్స్, కేబుల్స్, నెట్ వర్క్ ఎక్విప్ మెంట్, గ్లాసెస్, మెటల్ లాంటివి తీసుకెళ్లి పెట్రోల్ పొందొచ్చు. హైటెక్ సిటీతో పాటు రాజ్ భవన్ రోడ్, మియాపూర్ లో వాళ్ల వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇంట్లోని చెత్తను చాలా జాగ్రత్తగా సేకరించి బయట పారేయకుండా తీసుకెళ్లి అక్కడ ఇచ్చి ఉచితంగా పెట్రోల్ పొందండి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.