
Hyderabad : హైదరాబాదీస్‌కి గుడ్ న్యూస్.. ఇక ఎంచక్కా గాలిలో ఎగురుకుంటూ ఆఫీసులకి పోవచ్చు..!
Hyderabad : హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. రోజు రోజుకి విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతూ ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా ఆఫీసులకు చేరుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసి టెస్టింగ్ చేస్తుండగా, అన్నీ సక్రమంగా జరిగితే వీలైనంత తొందరలోనే ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని ఢిల్లీ, గురుగ్రాం నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తక్కువ సమయంలో సుదూర ప్రయాణాలను పూర్తి చేయడానికి ఎయిర్ టాక్సీలు సహాయపడతాయి. అలాగే దీని కోసం మీరు విమానాశ్రయానికి వెళ్లవలసిన అవసరం లేదు. ఇది కాకుండా, విమాన టిక్కెట్లతో పోలిస్తే ఎయిర్ టాక్సీ ఛార్జీలు కూడా చాలా తక్కువ. అందుకే రాబోయే రోజుల్లో ఇది ఏవియేషన్ స్టార్టప్‌గా పరిగణిస్తాయి.ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ త్వరలో దుబాయ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది. స్టార్టప్ ఈ ఏడాది ప్రారంభంలో గల్ఫ్ ఎమిరేట్స్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ టాక్సీ 2025 నాటికి దుబాయ్‌లో పని చేస్తుంది. టయోటా వంటి ప్రముఖ కార్ కంపెనీ కూడా జాబీ ఏవియేషన్‌లో $394 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది.
Hyderabad : హైదరాబాదీస్‌కి గుడ్ న్యూస్.. ఇక ఎంచక్కా గాలిలో ఎగురుకుంటూ ఆఫీసులకి పోవచ్చు..!
హైదరాబాద్ కి చెందిన ‘డ్రోగో డ్రోన్స్’ అనే డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ హైదరాబాద్ లో ఎయిర్ ట్యాక్సీలను నడపాలని ప్రయత్నాలు చేస్తుంది..ఆటోలు, క్యాబ్ లు ఎక్కినట్టే ఈ డ్రోన్ ట్యాక్సీల్లో ఎక్కి కూర్చొని ప్రయాణం చేయవచ్చునని అన్నారు. అలానే సిటీలో ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ఈ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఈఓ యశ్వంత్ తెలిపారు. ఎయిర్ ట్యాక్సీతోపాటు అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రణాళిలకు రూపొందిస్తున్నట్లు డ్రోగో డ్రోన్స్ సీఈవో యశ్వంత్ బొంతు తెలిపారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.