Hyderabad : హైదరాబాద్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో ఈ నెల 5వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.కఠినంగా నిబంధనలు అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడం వంటి చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. గతంలో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.100 ఫైన్ వేసేవారు. ఇప్పడు ఆ జరిమానాను 100 శాతం పెంచారు.
అంటే ఇక నుంచి వితౌట్ హెల్మెట్ తో వాహనం నడిపితే రూ.200 ఫైన్ విధించాలని నిర్ణయించారు. రూ.35 ఛార్జీలు కూడా ఉండనున్నాయి. రాంగ్ రూట్లో వెళ్తే.. ఇక అంతే సంగతి. రాంగ్ రూట్లో వెళ్తే భారీగా జరిమానా విధించనున్నారు. రూ.2000 ఫైన్ విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి తోడు రూ.35 ఛార్జీలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ అధికారి విశ్వప్రసాద్ ఆదేశాల జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే మోటర్ వెహికల్ చట్టం ప్రకారం గరిష్ఠంగా జరిమానా విధించాల్సి వస్తుందన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపేవారు, రాంగ్ రూట్లో వెళ్లే వారికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.
హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత 3 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు.ఇక నుంచి మీరు హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.235 చెల్లించాల్సిందే. ఇక రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.2035 కట్టాల్సిందే. గతంలో రాంగ్ రూట్లో వెళ్తే రూ.1000 జరిమానా విధించే వారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా హాజరు పరిచేవారు.రాంగ్ రూట్ వెళ్లి చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు.ఈ క్రమంలోనే పోలీసులు కఠిన శిక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.