Hyderabad : హైద‌రాబాదీలు జ‌ర జాగ్ర‌త్త‌.. మీ జేబుల‌కి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyderabad : హైద‌రాబాదీలు జ‌ర జాగ్ర‌త్త‌.. మీ జేబుల‌కి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :6 November 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Hyderabad : హైద‌రాబాదీలు జ‌ర జాగ్ర‌త్త‌.. మీ జేబుల‌కి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు..!

Hyderabad : హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధ‌రించ‌క‌పోవ‌డం, రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయ‌డం కార‌ణంగానే ఎక్కువ ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో న‌గ‌రంలో ఈ నెల 5వ తేదీ నుంచి స్పెష‌ల్ డ్రైవ్ చేప‌ట్టాల‌ని ట్రాఫిక్ పోలీసులు నిర్ణ‌యించారు.కఠినంగా నిబంధనలు అమలు చేయ‌బోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడం వంటి చేస్తే భారీ జరిమానా విధించనున్నారు. గతంలో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.100 ఫైన్ వేసేవారు. ఇప్పడు ఆ జరిమానాను 100 శాతం పెంచారు.

Hyderabad జ‌ర జాగ్ర‌త్త‌..

అంటే ఇక నుంచి వితౌట్ హెల్మెట్ తో వాహనం నడిపితే రూ.200 ఫైన్ విధించాలని నిర్ణయించారు. రూ.35 ఛార్జీలు కూడా ఉండనున్నాయి. రాంగ్ రూట్లో వెళ్తే.. ఇక అంతే సంగతి. రాంగ్ రూట్లో వెళ్తే భారీగా జరిమానా విధించనున్నారు. రూ.2000 ఫైన్ విధించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీనికి తోడు రూ.35 ఛార్జీలు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ అధికారి విశ్వప్రసాద్ ఆదేశాల జారీ చేశారు. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే మోటర్ వెహికల్ చట్టం ప్రకారం గరిష్ఠంగా జరిమానా విధించాల్సి వస్తుందన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపేవారు, రాంగ్ రూట్లో వెళ్లే వారికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

Hyderabad హైద‌రాబాదీలు జ‌ర జాగ్ర‌త్త‌ మీ జేబుల‌కి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు

Hyderabad : హైద‌రాబాదీలు జ‌ర జాగ్ర‌త్త‌.. మీ జేబుల‌కి చిల్లు వేసేందుకు రెడీ అయిన పోలీసులు..!

హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత 3 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు.ఇక నుంచి మీరు హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.235 చెల్లించాల్సిందే. ఇక రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తే రూ.2035 కట్టాల్సిందే. గతంలో రాంగ్ రూట్లో వెళ్తే రూ.1000 జరిమానా విధించే వారు. కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా హాజరు పరిచేవారు.రాంగ్ రూట్ వెళ్లి చాలా మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ చాలా మంది రాంగ్ రూట్ లో వెళ్తున్నారు.ఈ క్ర‌మంలోనే పోలీసులు క‌ఠిన శిక్ష‌లు విధించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది