Categories: NewsTelanganaTrending

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Advertisement
Published by
Advertisement

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎన్నో కలలతో పోరాడిన ప్రజలకు ఆ ఆశలు నెరవేరలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో పాలనలో తాను కూడా భాగస్వామినై ఉండటంపై బాధ వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజలను క్షమించాలని వినమ్రంగా కోరారు. తెలంగాణ సాధించినందుకు గర్వంగా ఉన్నప్పటికీ ఆ తర్వాతి పరిపాలనలో జరిగిన తప్పిదాల్లో తన పాత్ర ఉన్నందుకు తాను బాధపడుతున్నానని తెలిపారు. కేవలం క్షమాపణతో ఆగిపోకుండా సమాజానికి న్యాయం జరిగేలా కొత్త దిశగా పని చేయాలని సంకల్పించారు.

Advertisement

Kavita News Party Telangana Rashtra Sena

Kavitha : మూడు పార్టీలపై పోరాటం ప్రకటించిన కవిత

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మునీరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తాను సమానంగా పోరాటం చేస్తానని కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ సాధన కోసం అవసరమైతే ఎవరి ఎదుటైనా నిలబడతామని ఎవరైనా మనవారే అయినా తప్పుదోవలో ఉంటే వారిపై యుద్ధం చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కుటుంబ ఆధారిత రాజకీయాలుగా మారిందని విమర్శించారు. ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం కనబడటం లేదని, పార్టీ మార్గదర్శకత్వం తప్పిపోయిందని అన్నారు. తమ పోరాటం ప్రజల కోసం, వారి హక్కుల కోసం కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Kavitha : కేసీఆర్‌ మన మనిషి కాదు.. మర మనిషి

నాటి టీఆర్‌ఎస్‌ కోసం నా రక్తం, చెమట, సమయం ధారపోశా. పార్టీ బలోపేతం కోసం పని చేశా. ఆనాటి కేసీఆర్‌ వేరు.. ఇప్పటి కేసీఆర్‌ వేరు. చేనేత కార్మికులు చనిపోతుంటే.. ఆనాటి కేసీఆర్‌ భిక్షాటన చేశారు. ఇప్పటి కేసీఆర్‌ మారిన మనిషి.. మర మనిషి.. మన మనిషి కాదు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సార్‌ రారు.. ఎందుకంటే ఆయన మారిన మనిషి. గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో కేసీఆర్‌ ఖైదీ అయ్యారు. పంజాబ్‌, గుజరాత్‌, బిహార్‌ వెళ్లి జాతీయ పార్టీ పెట్టాలని చూశారు. కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉండి ఉంటే పాలమూరు పూర్తయ్యేది. నేను ఎన్ని మాట్లాడినా బీఆర్‌ఎస్‌ నేతలు బయటకు వచ్చి జవాబివ్వట్లేదు. సమాధానం చెప్పకపోతే.. ప్రజలే బయటకు లాగి జవాబు చెప్పేలా చేస్తారు.

Kavitha : తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు దారి తప్పాయని విమర్శ

టీఆర్‌ఎస్ పార్టీ కోసం తాను రక్తం, చెమట, సమయాన్ని వెచ్చించినట్లు గుర్తుచేసిన కవిత, అప్పటి నాయకత్వం మరియు ఇప్పటి పరిస్థితుల్లో విపరీతమైన మార్పు వచ్చిందని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై ఒకప్పుడు స్పందించిన నాయకత్వం, ఇప్పుడు ప్రజల కష్టాలకు దూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు స్వేచ్ఛ, అభివృద్ధి వస్తుందని ఆశించామని, కానీ రైతులు మరియు సాధారణ ప్రజలు ఇంకా కష్టాల్లోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిఘా పెరిగిందని ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని అన్నారు. అదేవిధంగా, దళితబంధు వంటి పథకాలు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించబడినట్లు ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ప్రజల ఆశలు అర్థం చేసుకోవడంలో విఫలమైందని తెలిపారు. తెలంగాణ ఉద్యమం లక్ష్యాలు సాధించడంలో పాలన విఫలమైందని సామాజిక తెలంగాణ భావన దెబ్బతిన్నదని అన్నారు. ఇకపై ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ భవిష్యత్తును తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కాగా గత పాలనలో జరిగిన లోపాలను అంగీకరిస్తూ కొత్త దిశగా ముందుకు వెళ్లాలని కవిత పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement
Ramanujam Sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Recent Posts

Tea : పాలు విరగకుండా చిక్కటి టీ కావాలా? ప్రతి గృహిణి తెలుసుకోవాల్సిన సీక్రెట్స్..!

Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…

1 hour ago

Today Horoscope : 9-06-2026 బుధ‌వారం ఈ రోజు రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ధనయోగం.. 3 రాశుల వారికి జాగ్రత్త..!

Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…

2 hours ago

H1B Visa : H1B వీసాలపై ట్రంప్‌కు భారీ షాక్.. లక్ష డాలర్ల ఫీజు నిర్ణయాన్ని కొట్టివేసిన అమెరికా కోర్టు

H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…

10 hours ago

Boduppal : బోడుప్పల్ అభివృద్ధికి మరో అడుగు.. రూ.80 లక్షల డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన అజయ్ యాదవ్

Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…

11 hours ago

Meenakshi Natarajan : బిగ్ బ్రేకింగ్ : మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ..!

Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…

11 hours ago

Gundlapochampally : 49 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్ భూములపై సర్వేకు ఆదేశాలు.. కబ్జాదారులపై చర్యలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…

12 hours ago

Weather Rain Alert : రెయిన్ అలర్ట్.. మ‌రికాసేప‌ట్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. !

Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…

13 hours ago

FIFA 2026 : మెస్సి, రొనాల్డోకు ఇదే చివరి వరల్డ్‌కప్‌నా? ఫుట్‌బాల్ దిగ్గజాల వీడ్కోలు సమయం వచ్చేసిందా!

FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న…

14 hours ago

Father Pension Money : పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రిని హత్య.. కొడుకు, కూతురికి తల్లికి సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..!

Father Pension Money : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…

15 hours ago

29 Movie Review : 29 మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌.. ఎమోషనల్ లవ్ స్టోరీ..!

29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…

16 hours ago

Telangana Womens : మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ బంపర్ గిఫ్ట్.. ఖాతాల్లోకి నేరుగా డబ్బులు..!

Telangana Womens : తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న…

17 hours ago

Pension : నేను బతికే ఉన్నా.. కాగితాలపై చంపేశారు.. పెన్షన్ ఆపేశారు.. 75 ఏళ్ల వృద్ధురాలి పోరాటం వైరల్..!

Pension : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన వారికి చేరితే వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురాగలవు. ముఖ్యంగా…

18 hours ago