Home » News » Loan Waiver Of Rs 2 Lakhs For All Eligible Farmers On 30th
News

Farmers : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. 30న అకౌంట్‌లో డ‌బ్బులు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 29, 2024, 11:30 am
Advertisement

Farmers  : తెలంగాణ Telangana ప్రభుత్వం రూ.2 లక్షల వ‌ర‌కు రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మెుత్తం 3 విడతల్లో రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసింది. మెుత్తం రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్ల‌డించింది. అయితే అర్హతలు ఉన్నా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో రుణ మాఫీ కాలేదు.

Advertisement

దాతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వ్యవసాయ అధికారులు వారి వివరాలు సేకరించారు. తాజాగా ఆయా రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు అందించారు. వివిధ కారణాలతో రాష్ట్ర‌ వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరగలేదని, ఆయా రైతులు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ఆయ‌న‌ వెల్లడించారు. ఈ నెల 30న పాలమూరులో రైతు పండగ కార్యక్రమం జరుగ‌నున్న‌ట్లు, ఈ వేదికగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Farmers : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. 30న అకౌంట్‌లో డ‌బ్బులు..!

Advertisement

అలాగే రైతు భరోసా పథకంపైనా మంత్రి కీలక స‌మాచారం అంద‌జేశారు. రుణమాఫీ పూర్తి అయిన అనంత‌రం త్వరలోనే రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15 వేలు పంట పెట్టుబడి సాయం రైతుల‌కు అందించనుంది.Loan waiver of Rs 2 lakhs for all eligible farmers on 30th

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి