Home » News » Mynampally Hanumatha Rao Audio Call Leak
News

Mynampally : మైనంపల్లి హనుమంతరావు ఆడియో లీక్.. కేసీఆర్ ఫ్యామిలీపై బూతులతో రెచ్చిపోయాడు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 29, 2023, 10:00 am
Advertisement

Mynampally : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెద్ద దుమారమే లేపుతోంది. ఆయన ఓ నేతతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై బూతులతో మైనంపల్లి ఆ ఆడియోలో రెచ్చిపోయారు. నేను గలీజ్ కొడుకుని. నేను ఎంత గలీజ్ గాడినో మీకు తెలియదు. నా తెరువు ఎవ్వరూ రారు. నేను ఎవ్వరికీ భయపడను. సీఎంకి కాదు.. కేటీఆర్ కి కాదు.. ప్రధానికి కాదు.. ఎవ్వరికీ భయపడను.

Advertisement

సాయి గాడు నా నియోజకవర్గంలో ఉండటం వల్ల బచాయించిండు. నువ్వు కూడా నా నియోజకవర్గంలో ఉండటం వల్ల బతికిపోయావు. నేను ఎంత గలీజ్ గాడినే నీకు తెలియదు. నా తెరువు ఎవ్వడూ రానే రాడు. రేవంత్ రెడ్డిని కూడా నేను దేకలేదు. టీడీపీలో ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరినీ కలిపి తిట్టినా. తొక్కుత మాంకెలోడే అని ఇద్దరినీ పొట్టు పొట్టు తిట్టినా అంటూ బూతులతో రెచ్చిపోయాడు మైనంపల్లి.మామూలుగా ఉండదు. చంపేస్తా అని కేటీఆర్ కు కూడా చెప్పినా. కవిత ఒక్కతే పోనీయ్ అన్న అన్నది. నా గురించి తెలిసిన వాళ్లు నాతో పెట్టుకోరు అంటూ బండ బూతులతో మైనంపల్లి హనుమంతరావు రెచ్చిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Mynampally : మైనంపల్లి హనుమంతరావు ఆడియో లీక్.. కేసీఆర్ ఫ్యామిలీపై బూతులతో రెచ్చిపోయాడు

Advertisement

Mynampally : చంపేస్తా అని కేటీఆర్ కు కూడా చెప్పినా

బీఆర్ఎస్ హైకమాండ్ మీద తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్న మైనంపల్లి తాజాగా సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడుతూ మాట్లాడిన ఆడియోను విన్న తెలంగాణ ప్రజలు షాక్ అవుతున్నారు. అసలు మైనంపల్లి ఎవరి మీద అంత సీరియస్ అవుతూ మాట్లాడుతున్నారు అంటూ ఆ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి