
nominationa process started in telangana assembly elections 2023
Telangana Nominations : తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. ఇంకా 24 రోజులే ఉంది. వచ్చే నెల ఈ సమయం వరకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అది అధికార బీఆర్ఎస్ పార్టీనా, లేక మరో పార్టీనా అనేది పక్కన పడితే.. తెలంగాణలో ప్రస్తుతం ఓవైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు నామినేషన్ల జోరు కూడా సాగుతోంది. తెలంగాణలో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల బిజీలో ఉన్నారు. ఇప్పటికే చాలామంది నేతలు రిట్నరింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ అనేది అంత చిన్న విషయం కాదు. నామినేషన్ కోసం తమ ఆస్తులన్నీ ప్రకటించాలి. నామినేషన్ లో ఏ చిన్న తప్పు ఉన్నా.. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ను తిరస్కరిస్తారు. దీంతో ఆ నామినేషన్ పనికిరాకుండా పోతుంది. చివరకు ఎన్నికల్లో పోటీ కూడా చేయలేరు. అందుకే.. అభ్యర్థులు నామినేషన్ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమ వ్యక్తిగత వివరాలతో పాటు తమకు ఉన్న ఆస్తుల, అప్పులు, తమ కుటుంబ సభ్యులు అన్ని వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది.
అయితే.. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు తమ నామినేషన్లను గత శుక్రవారమే ప్రారంభించారు. నవంబర్ 10 వరకు నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. నవంబర్ 10 తర్వాత నామినేషన్లను స్వీకరించరు. తొలి రోజు నుంచే చాలా మంది అభ్యర్థులు నామినేషన్లను వేశారు. తొలి నామినేషన్ గా కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థి ఆన్ లైన్ లో దాఖలు చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి తరుపున ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి నామినేషన్ వేశారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. తొలి రోజు నామినేషన్లు చాలా మంది ముఖ్య నేతలు కూడా వేశారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు.
బీఆర్ఎస్ నుంచి తొలి రోజు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. అభ్యర్థులు తమకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు అఫిడవిట్ లో పొందుపరచాలి. అత్యధికంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వీ. జగదీశ్వర్ గౌడ్ 129 కోట్ల 49 లక్షల ఆస్తులను తన అఫిడవిట్ లో పొందుపరిచారు. 77 ఎకరాల వ్యవసాయ భూమి, ఇండ్లు, ప్లాట్లు ఉన్నట్టు తన అఫిడవిట్ లో సమర్పించారు. ఆ తర్వాత ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావ్ పాటిల్ రూ.67 కోట్లు, ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య రూ.42 కోట్లు, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు 26 కోట్లు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల 17 కోట్లు, భూపాలపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు రూ.11 కోట్లు, చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం రూ.4 కోట్లు, గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థి మొగిలి సునీత రూ.3 కోట్లు, బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి శ్రీదేవి రూ. కోటి 66 లక్షలు, సిర్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ రూ. కోటి 47 లక్షలతో అఫిడవిట్స్ చూపించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.