Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్..!
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర Telangana Govt ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రెండో విడతIndiramma Housing Scheme ప్రారంభించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth reddy మంగళవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 23 రోజులపాటు ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక అధికారిని, అలాగే ప్రతి మండలంలోని నాలుగు లేదా ఐదు గ్రామాలకు గెజిటెడ్ అధికారిని నియమించనున్నారు. వారు అర్హుల జాబితాలను పరిశీలించి, అనర్హుల వివరాలను తొలగించే బాధ్యత వహించనున్నారు.
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రేవంత్ గుడ్ న్యూస్..!
ఇందిరమ్మ ఇళ్లను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందిరమ్మ కమిటీలు అర్హుల ఎంపికకు సూచనలు చేస్తాయి. ఈ నెల 17వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సూచనలతో గ్రామాలకు ఇళ్ల మంజూరుపై చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత 18 నుంచి 21 వరకు కమిటీల సూచనలను అధికారుల పరిధిలో సమీక్షిస్తారు. అనంతరం 22 నుండి 30 వరకు అధికారులతో ‘సూపర్ చెక్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. మే 1న అర్హుల జాబితా పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.
జాబితాల పరిశీలన అనంతరం మే 5, 6, 7 తేదీల్లో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఇళ్ల మంజూరు ప్రక్రియ జరగనుంది. మరోవైపు గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పలు ప్రాంతాల్లో ఇంకా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో, ఈ అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే నిర్మాణం పూర్తైన ఇళ్లు ఎల్2 దరఖాస్తుదారులకు మాత్రమే కేటాయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో, ఇళ్ల కేటాయింపుపై గల సందేహాలకు స్పష్టత వచ్చింది.
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
This website uses cookies.