Revanth Reddy : తెలంగాణకు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి ముఖ్యమంత్రి అయినందుకు రేవంత్ రెడ్డికి సంతోషం కంటే కూడా బాధే ఎక్కువగా ఉందట. అసలు రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. ఆయన ప్లేస్ లో ఇంకెవరు ఉన్నా కూడా వాళ్లకు కూడా ఇదే బాధ ఉంటుందట. ఎందుకు అంటే.. తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పులు మూట. తెలంగాణ మీద ఇప్పుడు లక్షల కోట్ల అప్పుడు ఉంది. 5 లక్షల కోట్ల అప్పుడు ఉంది. అసలు 2014 లో అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ మీద ఉన్న అప్పుడు 8 కోట్లు మాత్రమే. కానీ.. ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పు ఉంది. అందులోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసం అప్పటి తెలంగాణ ప్రభుత్వం 85 వేల కోట్ల అప్పును చేసింది. మరి ఇదంతా తెలంగాణకు బర్డెన్ అవుతుంది కదా. సంక్షేమ పథకాలకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఉన్న 5 లక్షల కోట్ల అప్పు ఇంకా పెరకబోతోంది కానీ.. తగ్గదు. మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు మధ్య రాష్ట్రాన్ని పాలించడం అనేది కష్టమే అని చెప్పుకోవాలి.
అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఏలడం అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ట్యాక్సుల మీద వచ్చే ఆదాయాన్ని మొత్తం ప్రజలకే సంక్షేమ పథకాల రూపంలో పంచేస్తే ఇక అప్పులను ఎలా తీర్చేది. ఈ అప్పు మరే రాష్ట్రంలో లేదు. నిజానికి తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. మిగితా పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత మొత్తంలో అప్పులు లేవు. కానీ.. ఇంత చిన్న రాష్ట్రం తెలంగాణకు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉండటంతో మరి ఆ అప్పును ఎలా తీర్చుతారు. దాని కోసం ఆదాయ మార్గాలు ఎలా వెతుకుతారు. ఇదంతా మళ్లీ ప్రజల నుంచే ముక్కు పిండి మరీ వసూలు చేస్తారా? ఈ ఆర్థిక సంవత్సరాన్ని కొత్త ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుంది? సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తుంది.. అనే దానిపై క్లారిటీ లేదు.
ఇప్పుడు కేసీఆర్ సర్కారు పథకాలను రేవంత్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా? అంటే అది కత్తి మీద సామే అని చెప్పుకోవాలి. ఒక రైతు బంధు కావచ్చు.. దళిత బంధు, బీసీ బంధు, రుణ మాఫీ లాంటి పథకాల కోసం వేల కోట్లు వెచ్చించాలి. కానీ.. రాష్ట్ర ఖాజానా చూస్తే నిల్.. రూపాయి కూడా లేదు. మరి.. ఈ సమయంలో ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి వేల కోట్లు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచుతారు. అంతే కాక.. కాంగ్రెస్ తెచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేయాలన్నా దానికి వేల కోట్లు కావాలి. మరి.. దీన్ని రేవంత్ రెడ్డి ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.