Home » News » Revanth Reddy Supports To Chandrababu
News

Revanth Reddy : చంద్ర‌బాబు పొత్తు లాభం.. ఏపీకి రూ.2500 కోట్లు చెల్లించ‌నున్న రేవంత్ రెడ్డి..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 23, 2024, 6:00 pm
Advertisement

Revanth Reddy : ఆంధ్ర‌ప్ర‌దేశ్,తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రుల మ‌ధ్య ఎంత‌టి స‌యోధ్య ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌తంలో జ‌రిగిన లాభ‌న‌ష్టాల విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌గా, అవి పాజిటివ్‌గానే ఉన్నాయి హైదరాబాద్‌లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, హుస్సేన్‌ సాగర్‌ ప్రాజెక్టుల కోసం తీసుకున్న విదేశీ రుణాలు! వాటి చెల్లింపులు పూర్తి కాకముందే రాష్ట్ర విభజన జరిగింది. ‘ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో ఉన్న ఖాతాలు నవ్యాంధ్రకు రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ, అసలును ఏపీ ప్రభుత్వమే కడుతోంది! ఏటా అందులో 42 శాతాన్ని తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. అలా కట్టేలా కేంద్ర ప్రభుత్వం చూడాలి! కానీ… పదేళ్లు కేసీఆర్‌ సర్కారు కట్టలేదు! కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్‌కు ఈ విషయం అసలు పట్టనేలేదు. ఇప్పుడు… ‘పొత్తు’ లాభం ఫలించింది! పదేళ్లకు సంబంధించిన రూ.2500 కోట్లు ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అందాయి.

Advertisement

Revanth Reddy మంచి విష‌యం..

కేంద్ర ఆర్థిక శాఖ సూచన/ఆదేశాల మేరకు టీ-సర్కారు ఈ నిధులను ‘అంతర్‌ రాష్ట్ర నిధుల బదిలీ’ (ఐజీటీ) ద్వారా ఏపీ ఖాతాకు జమ చేయ‌డం జ‌రిగింది. ఇది న్యాయంగా ఏపీకి దక్కాల్సిన సొమ్మే. అయితే పదేళ్ల పాటు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం… తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారు. విభజన సమస్యల పరిష్కారంపై కేసీఆర్‌ పెద్దగా దృష్టి సారించలేదు. ఇక… చెల్లింపుల సంగతి సరేసరి. అప్పట్లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కేంద్రంవద్ద ఈ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు Chandrababu కృషి చేస్తూ వచ్చారు. అంతా కొలిక్కి వచ్చే సమయానికి… ఎన్డీయేతో కటీఫ్‌ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి కాగానే విభజన సమస్యలపై చంద్రబాబు దృష్టి సారించారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కూడా సహకరించారు.

Revanth Reddy : చంద్ర‌బాబు పొత్తు లాభం.. ఏపీకి రూ.2500 కోట్లు చెల్లించ‌నున్న రేవంత్ రెడ్డి..!

Advertisement

పైగా… ఎన్డీయే సర్కారులో టీడీపీది కీలక పాత్ర కావడంతో కేంద్రం కూడా సహకరించింది. హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశాలపై చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, హుస్సేన్‌ సాగర్‌ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఈఏపీ (విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టులు) రుణాల అసలు, వడ్డీ మొత్తాన్ని ఏపీ సర్కారే చెల్లిస్తున్న అంశం తెరపైకి వచ్చింది. ఇందులో 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ చెల్లించాలి. కానీ… పదేళ్లుగా తెలంగాణ నుంచి చెల్లింపులే జరగలేదు. ఇప్పుడు, ఇన్నేళ్లకు దీనికి సంబంధించిన రూ.2500 కోట్లు ఏపీకి దక్కాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి