Chandrababu : చంద్ర‌బాబు నిప్పు.. ఎవ‌రికైన డౌట్ ఉందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : చంద్ర‌బాబు నిప్పు.. ఎవ‌రికైన డౌట్ ఉందా ?

Chandrababu : ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వార్త‌ల‌లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుపై కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలు చేసి ఇరుకుని పెట్టాలని చూసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటుకు నోటు కేసులో వైసిపి నేత రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : చంద్ర‌బాబు నిప్పు.. ఎవ‌రికైన డౌట్ ఉందా ?

Chandrababu : ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వార్త‌ల‌లో నిలిచారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుపై కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలు చేసి ఇరుకుని పెట్టాలని చూసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఓటుకు నోటు కేసులో వైసిపి నేత రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దని.. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సూచించింది. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధారాలు లేని అంశాలను తీసుకువచ్చి.. సుప్రీంకోర్టుతో ఆటలాడుకోవద్దని.. రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించింది.

Chandrababu బాబు బంగారం…

ఈ సందర్భంగా పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపైనా సుప్రీంకోర్టు ఆరా తీసింది. పిటిషనర్‌ ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. 2014 నుంచి 2024 ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి చెందిన నాయకుడు అని.. అయితే ఈ పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కూడా ఆ పార్టీ ప్రతిపక్షంలోనే ఉందని సీనియర్‌ లాయర్ సిద్దార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. కేసుల జాబితా పరిశీలించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం.. పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు తమకు కనిపించడం లేదని కోర్టు స్పష్టం చేసింది.

Chandrababu చంద్ర‌బాబు నిప్పు ఎవ‌రికైన డౌట్ ఉందా

Chandrababu : చంద్ర‌బాబు నిప్పు.. ఎవ‌రికైన డౌట్ ఉందా ?

అయితే చంద్ర‌బాబుపై నింద‌లు ఇప్ప‌టి నుండి కాదు. ఎన్టీఆర్ చిన్నల్లుడిగా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తూ ఉన్నారు. కాని ఏది కూడా నిరూపించ‌లేక‌పోయారు. కొందరు నాయ‌కులు ఏళ్ల‌త‌ర‌బ‌డి జైలులో ఉన్నా చంద్ర‌బాబు మాత్రం జైలుకి వెళ్లిన దాఖ‌లాలు లేవు. గత ఏడాది జైలుకు వెళ్లిన ఆ కేసు ఇంకా తేల‌లేదు. బాబు మీద గత వైసీపీ ప్రభుత్వం కక్షతోనే కేసులు పెట్టిందని ఆయన నిప్పు అని అంటున్నారు. ఇప్ప‌టి వ‌రకు ఆయ‌న‌ని సాధికారికంగా సహేతుకంగా కోర్టులలో ఫలనా తప్పు చేశారు అని నిరూపించలేక పోయారు అంటే అది బాబు గ్రేట్ నెస్ కాదా అని అంటున్నారు. మా బాబు బంగారం అని టీడీపీ నేతలు గర్వంగా చెప్పుకుంటారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది