
Revanth Reddy : రూ.2లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. రేవంత్ రెడ్డి !
Revanth Reddy : దేశచరిత్రలోనే తొలిసారి రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రజాప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ కోసం మొత్తం రూ.31వేల కోట్లు వెచ్చిస్తున్నామని, తద్వారా వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ‘సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజాప్రభుత్వం అజెండాలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఉందని, ఒకవైపు రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూ, మరోవైపు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా శరవేగంగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
”ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును ఈరోజే జాతికి అంకితం చేసుకున్నాం. ఏడాది తిరిగేలోపే ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది” అని ముఖ్యమంత్రి తెలిపారు. అటు ప్రాజెక్టుల నిర్మాణం, ఇటు రుణమాఫీ ప్రక్రియతో తెలంగాణ రైతన్నల ఇంట పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో రైతులకు ఏవైనా ఇబ్బందులు వస్తే వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని చెప్పారు.
Revanth Reddy : రూ.2లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిదని, ఆరు గ్యారంటీలతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని తీరుతామని సీఎం స్పష్టం చేశారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ అసాధ్యం అని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే పదవులకు రాజీనామాలు చేస్తామన్న ప్రతిపక్ష నేతలు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. సాగుకు జీవం – రైతుకు ఊతం బహిరంగ సభలో ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, పలువురు ఎంపీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.