Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతాన్ని ఈ సమయంలో జరుపుకుంటే కోటీశ్వరులవ్వడం ఖాయం...!
Varalakshmi Vratam : ప్రతి ఏడాది వచ్చే శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి అని అంటారు. అయితే ఈసారి వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అంటూ కొత్త చర్చ జరుగుతుంది. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతాన్ని ఆడవారి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఆరోజు సకల సౌభాగ్యాలను అందించి వరలక్ష్మీ దేవిని కొలుచుకోవడం వల్ల సకల సుఖాలు కలుగుతాయని ఆడవారి నమ్మకం. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఏ సమయంలో జరుపుకోవాలని అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే ఏ సమయంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటే మంచి శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
శ్రావణమాసంలో ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనుకునే వారికి శుభ ముహూర్తాలు ఎలా ఉన్నాయంటే ఆగస్టు 16 ఉదయం 5:30 నుంచి 8:14 నిమిషాల వరకు ఈ సమయం ఉదయం పూజకు అనువైనది. అలాగే మంత్రాలు పట్టించడానికి అనుగుణంగా ఉంటుంది. ఉదయం సూర్యకిరణాలు సానుకూల శక్తిని ఇస్తాయి. మధ్యాహ్నం 12: 50 నిమిషాల నుండి మూడు గంటల 8 నిమిషాల వరకు ఈ సమయం పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ పూజ చేసుకోవడానికి అలాగే వ్రత కథలు వినడానికి ఇది మంచి సమయం. సాయంత్రం 6:50 నుంచి రాత్రి 8: 25 నిమిషాల వరకు ఈ సమయం సాయంత్రం పూజకు దీపారాధనకు అనువైనది. సాయంత్రం సమయంలో దీపాలు వెలిగించడం స్తోకాలను పట్టించడం వలన ప్రశాంతమైన వాతావరణ నెలకొంటుంది. అర్ధరాత్రి 11:22 నిమిషాల నుంచి తెల్లవారుజామున 1:18 నిమిషాల వరకు ఈ సమయం అర్ధరాత్రి పూజ చేసుకోవాలి అనుకునే వారికి నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవాలి అనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. రాత్రి సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనసును ఏకాగ్రతతో ఉంచడానికి సహాయపడుతుంది.
Varalakshmi Vratam : వరలక్ష్మీ వ్రతాన్ని ఈ సమయంలో జరుపుకుంటే కోటీశ్వరులవ్వడం ఖాయం…!
ఈరోజు నా తెల్లవారుజామున లేచి శుభ్రమైన కొత్త బట్టలను ధరించాలి. పూజ గదిని కడిగి గంగాజలంతో పవిత్రం చేసుకోవాలి. పూలతో మామిడి ఆకులతో అందంగా అలంకరణ చేయాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు పువ్వులతో అలంకరించాలి. ఇక పూజకు కావాల్సిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. చక్క పీటపై ఎర్రటి వస్త్రం పరిచి లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు లేదా చిత్రపటాలను ఉంచాలి. విగ్రహాలు కింద బియ్యం పోసి వాటిపై కలశాన్ని నీటితో నింపాలి. విగ్రహాలకు నైవేద్యం పండ్లు పూలు తాంబూలం సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించి అగర్బత్తుల తో ధూపం వెలిగించాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. విజ్ఞాలను తొలగించి పూజ సజావుగా జరగడానికి వినాయకుడి అనుగ్రహం కోరాలి. అమ్మవారికి కనీసం 9 లేదా ఐదు రకాల నైవిద్యాలను సమర్పించాలి. పులిహోర పాయసం శనగలు చలివిడి వడపప్పు బూరెలు వంటివి సాధారణంగా సమర్పించే నైవేద్యాలు సమర్పించాలి శ్రద్ధతో వరలక్ష్మి కథను చదవాలి. ఇది వ్రతం యొక్క ప్రాముఖ్యతను దాని వెనక ఉన్న భక్తిని లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.