Categories: NewsTelangana

Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) తో ఒప్పందం..!

Advertisement
Advertisement

Telangana  : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) Artificial intelligence సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు Telangana  తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) తో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలను విస్తృతం చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వ్యూహాత్మక సహకారం గూగుల్ సంస్థ అందించనుంది.  హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని టీ-హబ్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు గూగుల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, గూగుల్ ప్రతినిధులు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Advertisement

Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ (Google) తో ఒప్పందం..!

ఈ ఒప్పందం ప్రకారం గూగుల్ రైతులకు వ్యవసాయ సంబంధిత ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించనుంది. రవాణా సదుపాయాలను మెరుగుపరిచే డేటా ఇంటిగ్రేషన్ సదుపాయాల కల్పనలోనూ భాగస్వామ్యం పంచుకుంటుంది. రైతులకు అవసరమైన ఇన్పుట్, రెడిట్, మార్కెటింగ్ సదుపాయాలన్నీ అనుసంధానం చేస్తూ తెలంగాణ ఓపెన్ అగ్రికల్చర్ నెట్‌వర్క్ ను ప్రారంభిస్తుంది.  గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా ఏఐ నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలపై దృష్టి సారిస్తుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డిజిటల్ అభ్యసన పద్దతులను ప్రారంభిస్తుంది. గూగుల్ వర్క్ స్పేస్, క్రోమ్ సర్వీసెస్ ను అందిస్తుంది. గూగుల్ డేటా కామన్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓపెన్ డేటా యాక్సెస్‌ను మెరుగుపరుస్తుంది.

Advertisement

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ “ఏఐ ఆధారిత రంగాల్లో గ్లోబల్ లీడర్ గా ఉండాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు గూగుల్ సహకారం ఎంతగానే ఉపయోగపడుతుంది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా కీలక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. మెరుగైన పాలన, ఆర్థిక పురోగతితో పాటు ప్రజా సేవలను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఈ లక్ష్య సాధనలో గూగుల్తో ఒప్పందం కీలకంగా నిలుస్తుంది” అని అన్నారు. గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా గారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కీలక రంగాలలో సహకారం అందించటం సంతోషంగా ఉందన్నారు. దేశ డిజిటల్ భవిష్యత్తు పట్ల తమ సంస్థ నిబద్ధతను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుందని అన్నారు.

Advertisement

Recent Posts

Brahma Anandam Movie Review : బ్ర‌హ్మా ఆనందం మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Brahma Anandam Movie Review : మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల…

23 minutes ago

Laila Movie Review : విశ్వ‌క్ సేన్ లైలా మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్..!

Laila Movie Review : శుక్ర‌వారం వ‌చ్చిందంటే థియేట‌ర్స్‌లో వ‌చ్చే సినిమాల కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ…

2 hours ago

Manchu Vishnu : క‌న్న‌ప్ప‌కి సంబంధించిన ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు బ‌య‌ట పెట్టిన మంచు విష్ణు.. రెమ్యున‌రేష‌న్ భారీగానే..!

Manchu Vishnu : మంచు విష్ణు Manchu Vishnu ప్రధాన పాత్రలో తెరకెక్కిన కన్నప్ప సినిమా Kannappa Movie ఇప్పుడు…

3 hours ago

Samantha : స‌మంత వాల్ పేప‌ర్ ఇప్ప‌టికీ అదే ఉందా.. ఆశ్చ‌ర్యంలో ఫ్యాన్స్

Samantha : నటి సమంతా Samantha తరచుగా ఏదో అంశంతో ఇటీవల కాలంలో వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు వివాదాస్పద అంశాలతో…

4 hours ago

Prithvi Raj : ఎట్ట‌కేల‌కి దిగి వ‌చ్చిన పృథ్వీ రాజ్.. అంద‌రికి క్ష‌మాఫ‌ణ‌లు అంటూ వీడియో విడుద‌ల‌

Prithvi Raj : క‌మెడీయ‌న్ పృథ్వీ రాజ్ Prithvi Raj ఇటీవ‌ల వివాదాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారాడు. విశ్వక్ సేన్…

5 hours ago

Health Problem : ప్రతిరోజు గుడ్లను తింటున్నారా.. అసలు ఇది ఆరోగ్యానికి మంచిదా..! కాదా..!

Health Problem : గుడ్లు Eggs అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అయితే కొంతమంది దీంట్లో కొలెస్ట్రాల్ Cholesterol ఎక్కువగా…

7 hours ago

Coal India Recruitment : 434 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, రేపే ఆఖ‌రు

Coal India Recruitment : కోల్ ఇండియా లిమిటెడ్ Coal India Limited (CIL) కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, ఫైనాన్స్,…

8 hours ago