revanth reddy to meet ponguleti srinivas reddy
Ponguleti Srinivas Reddy : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అన్నీ పొంగులేటి, జూపల్లి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ గా ఉండి రాజకీయాలను మార్చగల సత్తా ఉన్న నేతల్లో వీళ్లు మొదటి వరుసలో ఉంటారు. వీళ్లు రెబల్స్ అనే చెప్పుకోవాలి. అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టే సత్తా ఉన్న నాయకులు వీళ్లే. ప్రశ్నించే వాళ్లు కూడా వీళ్లే. అందుకే.. వీళ్ల చుట్టూనే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి.
ఇక.. బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన జూపల్లి, పొంగులేటి ఏ పార్టీలో చేరుతారు అనేదానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మరోవైపు తెలంగాణలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెంటనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జూబ్లీహిల్స్ లో ఉన్న పొంగులేటి నివాసానికి వెళ్లారు. వీళ్ల భేటీని బట్టి చూస్తే పొంగులేటి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయం అయినట్టే అనిపిస్తోంది.ప్రస్తుతం రాహుల్ గాంధీ.. అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికా పర్యటన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత పొంగులేటి.. ఆయన సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో భేటీలో కాంగ్రెస్ లో చేరికపై పొంగులేటి కీలక విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది.
revanth reddy to meet ponguleti srinivas reddy
పొంగులేటి.. తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే కొందరు కాంగ్రెస్ నాయకులకు దెబ్బ అనే చెప్పుకోవాలి. పొంగులేటి కాంగ్రెస్ రాజకీయాలను శాసించగలరు. ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు తమకు ఎక్కడ పొంగులేటి మేకు అయి కూర్చుంటాడో అని టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే అది కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాలి మరి.
Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
Vakkati Srihari : తెలంగాణ క్రీడలు, యువజన, మత్స్య మరియు పశుసంవర్థక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా…
This website uses cookies.