Traffic Police : హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతను పెంచేలా స్పెషల్ డ్రైవ్ లను ఏర్పాటు చేశారు. బేగంపేట మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రాజధానిలో జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు బలి అవుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం హెల్మెట్ లేకపోవడమే అని గుర్తించారు. అంతేకాఉ రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసినా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈ ఏడాది హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్న వాహనదారులపై 3 లక్షల పైగా కేసులు పెట్టినట్టు ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఈ ఏడాది ట్రాఫిక్ పోలీసులు మొదలు పెట్టిన స్పెషల్ డ్రైవ్ లో 1600 కేసులు నమోదు అయ్యాయని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ వెల్లడించారు. బేగంపేట్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఈ తనిఖిలు నిర్వహించారు. 100కి పైగా టూవీలర్స్ హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. అలాంటి వారికి రోడ్డుపైనే కౌన్సెలింగ్, ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తుంది.
ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు పోతున్నాయని తలకు తీవ్ర గాయాలు అవ్వడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని డీసీపీ రాహుల్ అన్నారు. హెల్మెట్ లేకపోతే 200, రాంగ్ రూట్ లో ప్రయాణించిన వారికి 1000 జరిమానా విధిస్తున్నామని చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
హెల్మెట్ ధరించినా తప్పుగా ధరించిన వారికి ప్రమాదాలు అవుతున్నాయి. హెల్మెట్ ని సరిగా టైట్ గా ఎలా పెట్టుకోవాలో డీసీపీ చెబుతున్నారు. ఈ కౌన్సిలింగ్ తర్వాత వాహనదారులు తమ తప్పుని అంగీకరించి భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా ప్రామిస్ చేస్తున్నారని వెల్లడించారు. ఈ స్పెషల్ డ్రైవ్ మన భద్రత కోసం.. ట్రాఫిక్ పోలీసులు మనకు సలహాలు ఇస్తున్నారు. హెల్మెట్ ధరించడం మన బాధ్యత అని వాహనదారులు చెబుతున్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.