
Venkatesh Daughter Ashrita : కాంగ్రెస్ పార్టీ తరఫున విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ప్రచారం...!
Venkatesh Daughter Ashrita : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ఇక ఈ రాజకీయాలు వేసవికాలం భానుడి తాపం కంటే కూడా వేడిగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు పూనుకున్నాయి. దీంతో ఎండ వేడిని కూడా లెక్కచేయకుండా పార్టీ అభ్యర్థులు జోరుగా ప్రచారాలలో పాల్గొంటూ వస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం రోడ్ షోలు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ప్రజల్లో వెళ్లి వారి సమస్యలను తెలుసుకునేందుకు , అధికారంలోకి వస్తే వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారాలలో ఈసారి అక్కడక్కడ కాస్త సినిమా టచ్ కూడా కనిపిస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు సైతం వారి అభిమాన పార్టీ కోసం ప్రచారాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ , హైపర్ ఆది , యాంకర్ శ్యామల వంటి వారు వారి అభిమాన పార్టీ తరఫున ప్రచారాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు కూడా పొలిటికల్ క్యాంపెయిన్ చేయడం ఆసక్తికరంగా మారింది.
తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత తాజాగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే తన మామయ్య రఘురామరెడ్డి కోసం ఆమె క్యాంపెయిన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మం వేదికగా జరిగిన మీటింగ్ లో ఆమె కూడా పాల్గొన్నారు. ఇక ఈ మీటింగ్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సమావేశానికి హాజరైన ఆశ్రిత తన మామ రఘురామరెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ స్థానంపై ఉత్కంఠత నెలకొంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో లోక్ సభ స్థానంపై తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుండి తాండ్ర వినోద్ రావు పోటీ చేస్తుండగా , కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకటేష్ వియ్యంకుడు రఘురామారెడ్డి పోటీ చేస్తున్నారు.
Venkatesh Daughter Ashrita : కాంగ్రెస్ పార్టీ తరఫున విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ప్రచారం…!
ఈ నేపథ్యంలోనే రఘురామరెడ్డి పోటీ చేస్తుండడంతో ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ కు విక్టరీ వెంకటేష్ వస్తున్నారనే వార్తలు వినిపించాయి. కానీ విక్టరీ వెంకటేష్ బదులుగా ఆయన కుమార్తె ఆశ్రిత రంగంలోకి దిగి ఖమ్మం మీటింగ్ లో కాంగ్రెస్ కండువా కప్పుకొని జోరుగా ప్రచారాలు చేపట్టారు. ఇక ఈ సమావేశంలో ఆశ్రిత చాలా చురుగ్గా పాల్గొని రఘురామారెడ్డి ని గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రస్తుతం ఆశ్రిత పాల్గొన్న ప్రచార వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.