
Warangal Congress : వరంగల్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుమంది ఎమ్మెల్యేలు ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు. ఈ జిల్లాలో మంత్రి కొండా సురేఖ దంపతులకు, అక్కడి ఎమ్మెల్యేలకు మధ్య కొంతకాలంగా నలుగుతున్న విభేదాలు మరింత పెరగడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు.
Warangal Congress : వరంగల్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా ఛైర్మన్ వెంకట్రాం రెడ్డి తదితరులు ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మీనాక్షి కార్యాలయానికి వచ్చి కలిశారు. కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏకపక్షంగా తలదూరుస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తున్నారని మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రస్థాయి కీలక నేతలపై కూడా లెక్కలేనట్లుగా వారు(కొండా దంపతులు) వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నందున హస్తం పార్టీకి తీరని నష్టం కలుగుతోందని జిల్లా నేతలు ఉదాహరణలతో సహా మీనాక్షికి చెప్పినట్లు సమాచారం. పార్టీలో విభేదాలుంటే అంతర్గత వేదికలపై చెప్పాలని, మీడియా ముందు ఎవరూ మాట్లాడవద్దని మీనాక్షి గట్టిగా హెచ్చరించినట్లు నేతలు తెలిపారు. ఆమె సూచనలతో ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.రాష్ట్రవ్యాప్తంగా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో నాయకుల మధ్య ఎక్కువగా విభేదాలున్నాయనే అంశంపైనా ఆమె వివరాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది.
Peddi Movie Review Live Updates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన భారీ…
Telangana Land Registration : తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన…
Peddi Movie : రామ్ చరణ్ Ram Charan హీరోగా బుచ్చిబాబు సానా Buchi Babu Sana దర్శకత్వంలో రూపొందిన…
Rain : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, ఇప్పుడు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRసీపీ) సీనియర్…
Missing Son Case : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.…
Peddi Movie Bookmyshow : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్…
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న Xiaomi సంస్థ మరో ప్రీమియం డివైస్‌ను భారతీయ వినియోగదారులకు అందించేందుకు సిద్ధమైంది. కంపెనీ…
Peddi Movie Pre Sales : మెగా పవర్ స్టార్ Ram Charan నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రత్యేక…
Ponnam Prabhakar : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan…
LPG : దేశవ్యాప్తంగా కోట్లాది ఎల్పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. వంటగ్యాస్ సేవలను మరింత…
This website uses cookies.