Home » News » Who Are The Kaleshwaram Medigadda Culprits
News

Medigadda : మేడిగడ్డ పాపం ఎవ్వరిది.. ఇందులో దోషులెవరు? దోషులను శిక్షించే సాహసం రేవంత్ ప్రభుత్వం చేస్తుందా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 19, 2023, 4:00 pm
Advertisement

Medigadda : ప్రస్తుతం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వెంటనే కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పనుల్లో జరిగిన అవకతవకలను వెలికితీస్తోంది. ముందు విద్యుత్ సంస్థలపై రేవంత్ ప్రభుత్వం పడింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి ఎల్ అండ్ టీ సంస్థ. ఈ ప్రాజెక్టు లక్ష కోట్లకు పైనే అయింది. ఈ ప్రాజెక్టు కట్టి మూడేళ్లు కూడా కాలేదు కానీ.. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ వద్ద పగుళ్లు రావడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మళ్లీ చర్చనీయాంశమయింది. కాళేశ్వరం అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విచారణకు ఆదేశించారు. సింగిల్ జడ్జితో విచారణకు కూడా ఆదేశించారు.

Advertisement

అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, సొరంగాలు.. ఇలా అన్ని కలిసే ఉంటాయి. అందులో ఉన్న మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దానికి కారణం ఎవరు కాదు.. దానికి బాధ్యత ఎవరు వహించాలి అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని.. కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తానని రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కుంగడం చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ అనడంతో తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు ఎల్ అండ్ టీ సంస్థ కూడా అది మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఆ పనులు చేయాలంటే కొత్త ఒప్పందాలు ఉండాలని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఏ పనికి అయినా కాపర్ డ్యామ్ కట్టాలి. దానికి 56 కోట్లు కావాలి. అందుకే ఎల్ అండ్ టీ సంస్థ మేడిగడ్డ కుంగడంపై పక్కకు తప్పకుంది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. అందుకే ముందు సింగిల్ జడ్జి విచారణ కోసం వెయిట్ చేస్తున్నారు.

Medigadda : కేసీఆర్ బాధ్యత వహిస్తారా?

నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందంటే దానికి కారణం కేసీఆర్. మరి.. మేడిగడ్డ కుంగుపాటుకు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి కేసీఆర్ బాధ్యత వహిస్తారా లేదా అనేది తెలియాలంటే సింగిల్ జడ్జి విచారణ పూర్తవ్వాలి. ఆ నివేదికలో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి చోటు చేసుకుంది అని తేలితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి