
janasena final list released
Pawan Kalyan – Chandrababu : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమరం స్టార్ట్ అయింది. ఇంకా నాలుగు నెలలు కూడా ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ వేడి ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. నిజానికి ఏపీలో ఎన్నికలు అంటేనే ఆ హడావుడి వేరే ఉంటుంది. మామూలుగా ఉండదు. రచ్చ రచ్చే ఉంటుంది. అయితే.. ఈసారి ఏపీలో ద్విముఖ పోటీలాగానే కనిపిస్తోంది. అధికార వైసీపీ ఒకవైపు అయితే.. మరోవైపు టీడీపీ, జనసేన నిలబడ్డాయి. త్వరలోనే బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమితో కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ జనసేన అభ్యర్థులకు ఎన్ని సీట్లు ఇస్తుంది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
అసలు జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే దానిపై తాజాగా క్లారిటీ వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిశారు. ఈనేపథ్యంలో పొత్తులపై ఇద్దరు డిస్కస్ చేశారు. అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి. ఏ నియోజకవర్గంలో ఇవ్వాలి. అధికారంలోకి ఈ కూటమి వస్తే.. ఎవరు అధికారాన్ని పంచుకుంటారు అనే దానిపై ఇద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. జనసేన పార్టీకి 28 టికెట్లు మాత్రమే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారట. ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం టికెట్ల విషయంలో క్లాష్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎంపీ టికెట్లు కూడా జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు తెలుస్తోంది.
ఓవరాల్ గా జనసేన పార్టీకి టీడీపీ కేటాయించబోయే స్థానాలు ఇవే అని తెలుస్తోంది. నెల్లిమర్ల, భీమిలి, గాజువాక, ఎలమంచిలి లేదా పెందుర్తి, పాడేరు, రాజానగరం, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, పీ గన్నవరం, రాజోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లి, ఉంగుటూరు లేదా ఏలూరు, నిడదవోలు లేదా తణుకు, కొవ్వూరు, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, పెడన, తెనాలి, గుంటూరు వెస్ట్, గిద్దలూరు, దర్శి, నెల్లూరు, తిరుపతి, మదనపల్లి, రాజంపేట నియోజకవర్గాల్లో టీడీపీ.. జనసేనకు టికెట్లు కేటాయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Amaravati : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజధాని అంశంపై కేంద్రం నుంచి కీలక సంకేతాలు అందుతున్నాయి. సుదీర్ఘ కాలంగా అమరావతిని…
ChatGPT : ఏఐ టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, ఓపెన్‌ఏఐ మరో కీలక అడుగు వేసింది. చాట్‌బాట్‌లను ఎక్కువ…
Toll Free Number : గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భద్రతనిచ్చే ప్రధాన పథకం…
Ys jagan : వైసీపీ YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేందుకు…
Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతుంది. ముఖ్యంగా చాలా…
USA-Iran: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు ఎవరైనా ప్రయత్నించి…
MLA Turns Delivery Boy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్…
KBR Park : హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం…
This website uses cookies.