Home » News » Women Telangana Govt Intends To Deposit Abhaya Hastam Scheme
News

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. అతి త్వ‌ర‌లోనే వారి ఖాతాల‌లోకి డ‌బ్బులు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: January 28, 2025 1:33 pm
Advertisement

Women : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్నిabhaya hastam scheme అమలు చేసేందుకు రెడీ అయిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌కి శుభ‌వార్త‌లు అందిస్తున్నారు.అయితే అభయ హస్తం పథకం డబ్బులను తిరిగి లబ్ధిదారులకు చెల్లించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. త్వరలో వడ్డీతో కలిపి మొత్తం సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఆలోచ‌న చేస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 21లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారు. దీంతో మరికొద్ది రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో వడ్డీతో సహా నగదు జమకానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. అతి త్వ‌ర‌లోనే వారి ఖాతాల‌లోకి డ‌బ్బులు..!

Women మంచి రోజులు..

రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన మహిళలకు ప్రతి నెలా రూ.500 పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అభయహస్తం పథకాన్ని ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అభ‌య హ‌స్తం పథకంలో చేరిన సభ్యులు తమవంతు వాటాగా ఏడాదికి 365 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో డబ్బులు జమచేసింది. సభ్యులకు 60ఏళ్ల వయస్సు దాటితే వారికి రూ.500 పింఛన్ అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. దీనికితోడు సంఘంలోని మహిళల కుటుంబంలో 9, 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్న వారి పిల్లలకు ఏడాదికి రూ. 12వేలు చెల్లించింది.

Advertisement

సభ్యురాలు సహజ మరణం అయితే రూ.75వేలు, శాశ్వత వైకల్యానికి రూ.75వేలు, పాక్షిక వైకల్యానికి రూ.37,500 చెల్లించేవారు. 2016 వరకు ఈ పథకం సజావుగానే సాగినప్పటికీ.. ఆ తరువాత అధికారంలో ఉన్న ప్రభుత్వం దానిని నిలిపివేసి ఆసరా పింఛన్ ప్రారంభించింది. పింఛన్ సొమ్మును రెట్టింపు చేసింది. అయితే, మహిళలు కట్టిన సొమ్మును చెల్లిస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు ఆ సొమ్మును తిరిగి చెల్లించేందుకు నిర్ణయించింది. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల సొమ్ములను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి రోజు 4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.569 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 18,180 రైతు కూలీ కుటుంబాలకు రూ.6 వేల చొప్పున రూ.10.91 కోట్లు జమ చేశారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి