Home » News » Ys Sharmila To Announce Her Party On April 9
News

YS Sharmila : షర్మిల పార్టీ ప్రకటన తేదీ కన్ఫమ్? లక్ష మందితో ఆ జిల్లాలో మీటింగ్.. అక్కడే పార్టీ ప్రకటన?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 2, 2021, 11:00 am
Advertisement

YS Sharmila : వైఎస్ షర్మిల.. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఈమె హాట్ టాపిక్. అసలు.. షర్మిల తెలంగాణలో పార్టీ పెడతారని ఎవ్వరూ ఊహించలేదు. కలలో కూడా ఊహించలేదు. షర్మిల తెలంగాణ పార్టీ పెట్టబోతున్నారంటూ ముందు కొన్ని వార్తలు వచ్చినా.. వాటిని షర్మిలే కొట్టి పారేసింది. తర్వాత తనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించింది.

Advertisement

ys sharmila to announce her party on april 9

పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన తర్వాత పార్టీలోకి కొందరు నేతలను తీసుకోవడం.. పార్టీ పేరు కోసం.. పార్టీ విధి విధానాల కోసం తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పలు పర్యటనలు చేశారు. వైఎస్ అభిమానులతో, ఇతర నాయకులతో ఆమె భేటీ అయి.. పార్టీ గురించి చర్చించారు. విద్యార్థులతో కూడా ఆమె పలుమార్లు సమావేశమయ్యాయి.

Advertisement

మొత్తం మీద పార్టీ ప్రకటన తేదీ, పార్టీని ఎక్కడ లాంచ్ చేయాలి.. అనే వాటిపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ పేరు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని అంటున్నారు.

YS Sharmila :  ఏప్రిల్ 9న ఖమ్మంలో పార్టీ ప్రకటన?

వచ్చే నెల ఏప్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి అక్కడే పార్టీ పేరును, పార్టీ విధివిధానాలను షర్మిల ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభలో సుమారు లక్ష మంది జనాలు వస్తారని అంచనా వేస్తున్నారు.

Advertisement

గత ఆదివారం రాత్రే బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకున్న షర్మిల.. పార్టీ నేతలతో లోటస్ పాండ్ లో పార్టీ గురించి పలు విషయాలు చర్చించారు.

నిజానికి జులై 8న పార్టీని ప్రకటించాలని భావించినా.. అది చాలా లేట్ అవుతుందని.. ఎంత త్వరగా పార్టీ పేరు ప్రకటిస్తే.. అంత త్వరగా తెలంగాణ ప్రజల్లోకి పార్టీ వెళ్తుందని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది.

YS Sharmila : ఏప్రిల్ 9న పార్టీలో చేరనున్న పలువురు నేతలు

ఏప్రిల్ 9న పార్టీ ప్రకటన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు షర్మిల పార్టీలోకి చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిలతో నేతలు మంతనాలు జరిపారట. పార్టీ ప్రకటన రోజే.. అందరి ముందు షర్మిల పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి