Home » Entertainment » Chiranjeevi Allu Arjun Dance In Niharika Konidela Sangeeth Party
Entertainment

నిహారిక చైతన్యలు అలా.. చిరంజీవి అల్లు అర్జున్ ఇలా.. సంగీత్‌లో రచ్చ రచ్చ వీడియో..!

Authored By
Admin
The Telugu News | Published on: December 9, 2020, 10:27 am
Advertisement

మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి వేడుకలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇన్ని రోజుల వేడుకల్లో పవన్ కళ్యాణ్ లేకపోవడంతో అది అసంపూర్ణంగా అనిపించింది. అయితే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ కూడా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. దీంతో ఆ పార్టీ సంతృప్తిగా అనిపించింది. మెగా ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూసిన అభిమాలకు ఆ ముచ్చట తీరిపోయింది.

Advertisement

Chiranjeevi Allu arjun Dance In Niharika Konidela Sangeeth Party

ఇక నిన్న, మొన్న రాత్రి జరిగిన సంగీత్ ఈవెంట్‌లో మెగా హీరోలు, కొత్త జంట వేసిన స్టెప్పులు మామూలుగా వైరల్ కాలేదు. నిహారిక చైతన్యలు కలిసి బావగారూ బాగున్నారా సినిమాలోని ఆంటీ కూతురు అనే పాటకు స్టెప్పులు వేశారు. మామూలుగా డ్యాన్స్ వేయడం కాదు ఏకంగా చిరు సిగ్నేచర్ స్టెప్పునే వేశారు. అలా నిహారిక చైతన్యలు దుమ్ములేపారు. ఇక అనంతరం వారితో పాటుగా రామ్ చరణ్ కూడా కాలు కదిపాడు. ఈ మేరకు వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో తెగ సందడి చేశాయి.

Advertisement

అయితే తాజాగా చిరంజీవి అలా సింపుల్‌గా కాలు కదిపిన మూమెంట్ బయటకు వచ్చింది. చుట్టు అందరూ ఉండగా.. బన్నీ మాత్రం చిరును అంటి పెట్టుకున్నాడు.బంగారు కోడిపెట్ట అనే పాటకు అలా చిరు తనదైన శైలిలో మూమెంట్ ఇచ్చాడు. దీంతో అందరూ అరుపులు కేకలు వేసేశారు. ఆ మూమెంట్‌లో సురేఖను కూడా చిరంజీవి లాగేశారు. మొత్తానికి కొత్త జంట అలా ఎంజాయ్ ఈ జంట ఇలా రచ్చ చేసింది. నేటి రాత్రి నిహారిక చైతన్యలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు.

Advertisement

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి