Kavya Entry In Tollywood As Heroine
Gangotri Movie Child Artist Kavya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ ‘గంగోత్రి’ మ్యూజిక్ పరంగా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వందో చిత్రం ‘గంగోత్రి’ కాగా, ఈ సినిమాను అశ్వనీదత్, అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలోని ‘వల్లంకి పిట్ట’ పాటలో బాలనటిగా మెరిసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావ్య అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే..
Kavya Entry In Tollywood As Heroine
‘గంగోత్రి’ సినిమాలో పాటలన్ని కూడా సూపర్ హిట్ కాగా, ‘వల్లంకి పిట్ట’ పాట బాగా పాపులర్. ఇందులో చిన్నారి కావ్య తన ఎక్స్ ప్రెషన్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా సమయంలో కావ్య వయసు నాలుగేళ్లే కాగా, ఇప్పుడామె ఏజ్ 22 ఏళ్లు.. అప్పట్లో ఒకే ఒక్క పాటతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన కావ్య.. ఇప్పుడు హీరోయిన్‌గా ట్రై చేయాలనుకుంటుందట. చిన్నారి కాస్త ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ అయింది. సోషల్ మీడియాలో ‘గంగోత్రి’ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య గురించి ఆసక్తి కర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కావ్య పలు చిత్రాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.
Kavya Entry In Tollywood As Heroine
ఇకపోతే కావ్య తన చదువులు పూర్తి చేసుకున్న ప్రస్తుతం సినిమా రంగంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నదని తెలుస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల కోసం కావ్య ఆడిషన్స్ కూడా ఇచ్చినట్లు వినికిడి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కావ్య ఫొటోలు వైరలవుతున్నాయి. తెలుగమ్మాయి అయిన కావ్యను ఇంట్రడ్యూస్ చేయాలనుకుని ఓ డైరెక్టర్ ప్లాన్ కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోయిన్‌గా ఫస్ట్ మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకోవాలనుకుని కావ్య బాగా హార్డ్ వర్క్ చేస్తుందట. చూడాలి మరి.. ఏమవుతుందో.. చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కావ్య.. హీరోయిన్‌గా ప్రేక్షకుల మెప్పు పొందుతుందో.. లేదో..
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
This website uses cookies.