Bigg Boss Telugu 10 : హౌస్ నుంచి ఝాన్సీ ఎలిమినేట్.. ముకేశ్ కన్నీళ్లు.. వర్షిణి వీడియోతో షాక్!
Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు 10లో శనివారం ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒకవైపు కంటెస్టెంట్ల ఆటతీరుపై నాగార్జున క్లాస్ తీసుకుంటూ స్టార్స్ ఇచ్చారు. మరోవైపు హౌస్‌లో కొందరు కంటెస్టెంట్లు రహస్యంగా మాట్లాడుకున్న విషయాలను వీడియోల ద్వారా బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక చివర్లో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఫోక్ సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె ఎలిమినేషన్‌తో ముకేశ్ కన్నీరుమున్నీరయ్యాడు. ఈ వారం రెండు ఎలిమినేషన్లు ఉండటంతో శనివారం ఝాన్సీ వెళ్లిపోగా, ఆదివారం మరో కంటెస్టెంట్ హౌస్‌ను వీడనున్నారు.
Bigg Boss Telugu 10 : హౌస్ నుంచి ఝాన్సీ ఎలిమినేట్.. ముకేశ్ కన్నీళ్లు.. వర్షిణి వీడియోతో షాక్!
Bigg Boss Telugu 10 ఝాన్సీకి జీరో స్టార్స్.. వర్షిణికి నాగార్జున షాక్ ట్రీట్‌మెంట్!
శనివారం ఎపిసోడ్‌లో ముందుగా కంటెస్టెంట్ల ఆటతీరును సమీక్షించిన నాగార్జున.. ఈ వారం ప్రదర్శన ఆధారంగా ఒక్కొక్కరికి స్టార్స్ కేటాయించారు. ఆశించిన స్థాయిలో ఆడని వారిని జీరో స్టార్స్ కేటగిరీలో ఉంచారు. ఈ జాబితాలో సుధీర్, ఝాన్సీ, ఆర్కే, నీతూ ఉన్నారు. ఆర్కేను సాధారణంగా ‘నవరస మామ’ అని పిలుస్తుంటారు. అయితే అతడికి శోక రసం మాత్రమే కనిపిస్తోందంటూ నాగార్జున సరదాగా సెటైర్ వేశారు. మరోవైపు నరేష్, రామ్ ప్రసాద్ ఆటతీరును మెచ్చుకున్న నాగార్జున.. వారిద్దరికీ ఐదు స్టార్స్ ఇచ్చి అభినందించారు. ఈ వారం పర్వాలేదనిపించిన కంటెస్టెంట్లకు మూడు స్టార్స్ కేటాయించారు. అయితే వర్షిణి విషయంలో మాత్రం నాగార్జున మొదట మూడు స్టార్స్ ఇచ్చినట్లే ఇచ్చి, ఆ తర్వాత ఆమెను జీరో స్టార్స్ కేటగిరీలోకి తీసుకెళ్లారు. ఇందుకు కారణం హౌస్‌లో జరిగిన ఒక రహస్య సమావేశం. వర్షిణి, ముకేశ్, సుధీర్, రోహిత్ నలుగురూ కలిసి శివ కుమార్ గురించి సీక్రెట్‌గా మాట్లాడుకున్న వీడియోను నాగార్జున బయటపెట్టారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వర్షిణిని ‘P’ అంటే ఏంటి? అని, సుధీర్‌ను ‘B’ అంటే ఏంటి? అని నాగార్జున ప్రశ్నించారు. మొదట ఇద్దరూ తమకు ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడటంతో ఇబ్బందిగా ముఖాలు పెట్టారు. అనంతరం ఆ నలుగురూ శివ కుమార్ గురించి మాట్లాడుకున్న వీడియోను నాగార్జున చూపించారు.
ఆ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ.. శివకుమార్ మరో త్రిగుణ్‌లాంటి వ్యక్తి అని, ఇక్కడి విషయాలు అక్కడికి, అక్కడి విషయాలు ఇక్కడికి చేరవేసే మధ్యవర్తిలా వ్యవహరిస్తున్నాడని ముకేశ్ అన్నట్లు ప్రస్తావించాడు. దీనికి స్పందించిన రోహిత్.. నువ్వు ఆ మాటను పద్ధతిగా చెప్పావని, తాను అయితే మరో విధంగా చెబుతానని అన్నాడు. వెంటనే సుధీర్ ఆ పదం ‘B’తో మొదలవుతుందని చెప్పగా, వర్షిణి మాత్రం అది ‘P’ అంటూ సైగ చేసింది. ఈ సంఘటనపై నాగార్జున వారిని నిలదీశారు. ఆ పదాలు ఏమిటో చెప్పాలని అడిగినా ఎవరూ సమాధానం ఇవ్వలేదు. దీంతో నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. ఆ మాటలు చెప్పడానికే మీకు ఇంత ఇబ్బందిగా ఉంటే, వాటిని విన్న ప్రేక్షకులు ఎలా భావించి ఉంటారని ప్రశ్నిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్నే కారణంగా చూపిస్తూ వర్షిణికి మొదట ఇచ్చిన మూడు స్టార్స్‌ను వెనక్కి తీసుకుని జీరో స్టార్స్‌కు మార్చారు.
Bigg Boss Telugu 10 త్రిగుణ్‌పై వర్షిణి సీక్రెట్ ప్లాన్.. వీడియో చూసి షాకైన కంటెస్టెంట్!
ఇదే ఎపిసోడ్‌లో నాగార్జున త్రిగుణ్ ఆటతీరును అభినందించారు. అల్టిమేట్ గోట్‌గా నిలిచిన త్రిగుణ్‌కు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇచ్చారు. అయితే ఆ గిఫ్ట్‌లో భాగంగా హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లు అతడి గురించి రహస్యంగా ఏమనుకుంటున్నారో చూపించే వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోలో వర్షిణి చేసిన వ్యాఖ్యలు త్రిగుణ్‌కు షాక్ ఇచ్చాయి.వర్షిణి మాట్లాడుతూ.. త్రిగుణ్ బలహీనతపై దెబ్బ కొడతానని, తాను కొట్టిన దెబ్బకు అతడు కచ్చితంగా పడిపోవాల్సిందేనని అన్నట్లు వీడియోలో కనిపించింది. ఈ వ్యాఖ్యలను చూసిన త్రిగుణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంపై వెంటనే స్పందించకుండా, సరైన సమయం వచ్చినప్పుడు దీనిపై మాట్లాడతానని నాగార్జునకు తెలిపాడు. దీంతో వర్షిణి వ్యాఖ్యలు, త్రిగుణ్ స్పందన హౌస్‌లో మరో చర్చకు దారితీశాయి.
Also Read : 10th New Rules : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్!
ఇక ఎపిసోడ్ చివర్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. త్రిగుణ్ కుండలను పగలగొట్టినప్పుడు అందులో ఝాన్సీ ఫొటో రాలేదు. దీంతో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఝాన్సీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో శనివారం ఆమె హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఆదివారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు.అయితే ఝాన్సీ ఎలిమినేషన్‌పై నాగార్జున మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ముకేశ్ తన మ్యాజిక్ పవర్‌ను ఉపయోగించి సుధీర్‌ను సేవ్ చేశాడని, ఆ పవర్‌ను వినియోగించకపోయి ఉంటే ఝాన్సీ స్థానంలో సుధీర్ ఎలిమినేట్ అయ్యేవాడని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన వల్లే ఝాన్సీ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే బాధతో వెక్కివెక్కి ఏడ్చాడు. ఝాన్సీ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయింది.హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో ఝాన్సీ తన మనసులోని బాధను వ్యక్తం చేసింది. “నా అమాయకత్వంతో హౌస్‌లో ఇంకా ఉండలేను. అలాగని నా వ్యక్తిత్వాన్ని చంపుకోలేను. అందుకే ఎలిమినేట్ అయ్యాను” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తంగా శనివారం ఎపిసోడ్‌లో ఝాన్సీ ఎలిమినేషన్, ముకేశ్ భావోద్వేగం, వర్షిణి సీక్రెట్ వీడియో, త్రిగుణ్‌కు చూపించిన ఫుటేజ్ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఇక ఆదివారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Elimination, Jhansi Eviction, Varshini Bigg Boss, Trigun Bigg Boss
