Categories: NewsTV Shows

Guppedantha Manasu 19 Dec Today Episode : రిషి సీటులో కూర్చోబోయిన శైలేంద్ర.. కాలేజీలో శైలేంద్ర పరువు తీసిన వసుధార.. ఇంతలో మరో ట్విస్ట్

Guppedantha Manasu 19 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. గుప్పెడంత మనసు 19 డిసెంబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 950 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతాడు శైలేంద్ర. దేవయాని వచ్చి ఎక్కడికి రెడీ అవుతున్నావు అంటే కాలేజీకి అంటాడు. నేను కాలేజీకి వెళ్లాల్సిందే అంటాడు శైలేంద్ర. దీంతో ఈ టైమ్ లో అవసరమా అంటే వెళ్లాలి అంటాడు. ఇంతలో ధరణి వచ్చి ఎక్కడికి రెడీ అయ్యారు అని అడుగుతుంది. దీంతో కాలేజీకి అంటాడు. ఇంకా దెబ్బ తగ్గలేదు అప్పుడే వెళ్తున్నారా? వద్దు అండి అంటుంది ధరణి. తనను కాలేజీకి వెళ్లనీయకుండా ప్రయత్నిస్తుంది కానీ.. కుదరదు. దీంతో దేవయానిని తీసుకొని శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. మరోవైపు వసుధారను కాలేజీలో కలవడానికి వస్తుంది అనుపమ. నోటీసు బోర్డు దగ్గర ఉన్న వసుధాను అనుపమ చూస్తుంది. నోటీసు మీద రిషి మిషన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లాడని పెట్టావు. అందుకు బాధపడుతున్నావా అని అడుగుతుంది అనుపమ. తప్పదు మేడమ్.. రిషి సార్ మాట మీద నేను ఎండీ సీటు బాధ్యతను తీసుకున్నాను. ఒకవైపు ఆ సీటు కోసం ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. అయినా జగతి మేడమ్ కోసం ఆ సీటులో కూర్చొన్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. దానికి సార్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు. కానీ.. ఇప్పుడు రిషి సార్ కనిపించకుండా పోయారు అని బాధపడుతుంది వసుధార. వసుధార అనే పేరుకు ఒక బ్రాండ్ ఉంది. నిన్ను నలుగురు ఆదర్శంగా తీసుకుంటారు. నువ్వు కుంగిపోకూడదు అంటుంది అనుపమ. అక్కడే ఉన్న మహీంద్రా కూడా వసుధారకు ధైర్యం చెబుతాడు.

మరోవైపు కాలేజీకి వస్తారు శైలేంద్ర, దేవయాని. ఈ కాలేజీని నేను చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందో తెలుసా అని అడుగుతాడు. నువ్వు ఏం ఆలోచిస్తావో నాకు తెలియదా? ఇది నీ కోట. ఇది నీ సామ్రాజ్యం. ఇది నువ్వు ఏలాల్సిన కోట అంటుంది దేవయాని. దీంతో  నువ్వు బ్రిలియంట్ మామ్. నా మనసులో ఏముందో కరెక్ట్ గా తెలుసుకున్నావు. ఖచ్చితంగా నీ కోరిక నెరవేర్చుతాను అంటాడు శైలేంద్ర. ఎప్పుడో ఎందుకు.. ఇప్పుడు రిషి కూడా లేడు కదా. వెళ్లి ఆ ఎండీ సీటులో కూర్చొందువు పదా అంటుంది దేవయాని. ఏం కాదు కదా. వసుధార ఏమైనా అడ్డుపడుతుంది అంటావా అంటే నువ్వు తన గురించి ఆలోచించకు నాన్న. నేను నీ వెనుక ఉన్నాను కదా అంటుంది దేవయాని. ఇంతలో ఆఫీసు బాయ్ ని పిలిచి వసుధార ఎక్కడుంది అంటే.. నోటీసు బోర్డు దగ్గర ఉన్నట్టున్నారు మేడమ్ అంటాడు. దీంతో ఎండీ రూమ్ కు వెళ్తారు ఇద్దరూ. అక్కడ ఎండీ సీటును చూస్తాడు శైలేంద్ర. మమ్మీ బీబీఎస్టీ ఎండీ శైలేంద్ర భూషణ్ అనే బోర్డు టేబుల్ మీదికి రావాలి కదా. ప్రతి ఫైల్ కింద నా పేరు చేరాలి మమ్మీ అంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu 19 Dec Today Episode : ఎండీ సీటు చూసి కూర్చోబోయిన శైలేంద్ర

అదేంటి ఇక్కడ ఇంకో ఎక్స్ ట్రా సీటు వేసి ఉంది అంటే.. ఆ ఎండీ సీటులో రిషి మాత్రమే అర్హుడట. అందుకే ఆ సీటులో కూర్చోకుండా పక్కన సీటులో కూర్చుంటుంది అంటుంది దేవయాని. నువ్వు కూర్చో. నీ ముచ్చట తీర్చుకో అంటుంది దేవయాని. అవును మమ్మీ దీని మీద ఎప్పుడెప్పుడు కూర్చోవాలా అని ఆరాటపడుతున్నాను అంటాడు శైలేంద్ర. దీంతో మనల్ని ఎవడ్రా ఆపేది. నువ్వు కూర్చో అంటుంది దేవయాని. దాంట్లో కూర్చొనే సమయానికి ఆగు అంటూ వసుధార అక్కడికి వస్తుంది.

మీరు ఈ సీటులో కూర్చోవద్దు అని అంటుంది వసుధార. ఎందుకు కూర్చోవద్దు అని అడుగుతుంది దేవయాని. ఇది రిషి సార్ సీటు. ఎండీని నేనే కూర్చోవడం లేదు. ఎవ్వరూ కూర్చోవద్దు అంటుంది. నా కొడుకు ఎందుకు కూర్చోవద్దు అంటే అది రిషి సార్ సీటు. రిజర్వ్ చేసి పెట్టాను. అందులో కూర్చోవాలంటే ఒక అర్హత ఉండాలి అంటుంది వసుధార. దీంతో నా కొడుకు ఫారెన్ లో చదివి వచ్చాడు. అది చాలదా అర్హత అంటే.. సీటులో కూర్చోవాలంటే పై చదువులు చదవడం కాదు. అందులో కూర్చోవాలంటే దమ్ము ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఆ చరిష్మా, కరిష్మా ఉండాలి. రిషి సార్ కు అవన్నీ ఉన్నాయి అని అంటుంది వసుధార. అంటే.. నా కొడుకుకు లేవా అని అడుగుతుంది దేవయాని. అది మీ కొడుక్కే తెలియాలి అంటుంది వసుధార.

నేను పేషెంట్ ను కదా. ఒక రెండు నిమిషాలు కూర్చొంటాను అంటాడు శైలేంద్ర. దీంతో మీకు వీల్ చైర్ తెప్పిస్తా లేదంటే స్ట్రెచ్చర్ తెప్పించి సరాసరి ఆసుపత్రికి పంపిస్తా అంటుంది వసుధార. అంతేకానీ.. మీరు ఈ సీటులో కూర్చోవడానికి అర్హులు మాత్రం కాదు అంటుంది వసుధార. ఇది మా సామ్రాజ్యం. వాడు నా కొడుకు. నువ్వు వాడిని చేయి తీయమంటావేంటి అంటే.. మీ కొడుకు అయితే మీ ఇంట్లో పైన చైర్ వేసి కూర్చోబెట్టండి నాకు ఏం అభ్యంతరం లేదు అంటుంది వసుధార.

మీ రాచరికాలు.. పెద్దరికాలు మీ ఇంట్లో చూపించుకోండి నా దగ్గర కాదు అంటుంది వసుధార. నువ్వు ఏమైనా చేసుకో వసుధార. కానీ ఈ కాలేజీ మాది. ఇందులో మేము బోర్డు మెంబర్స్ అనే విషయం నువ్వు మరిచిపోయావనుకుంటా అంటుంది దేవయాని. నీకు ఆ గర్వం తప్ప ఇంకేం తెలియదు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఈ కాలేజీతో ముడిపడి ఉంది అంటుంది వసుధార. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటేయాల్సి ఉంటుంది అంటుంది వసుధార. ఆఫీసు బాయ్ ని తిడుతుంది వసుధార. ముందు వీళ్లను మెడ పట్టి బయటికి గెంటేయ్. నీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. నేను హామీ ఇస్తున్నాను రా అని ఆఫీసు బాయ్ ని పిలుస్తుంది. దీంతో రేయ్ ఆగు అంటాడు శైలేంద్ర. మమ్మీ పదా అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

6 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

8 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

12 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

15 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

18 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago