Categories: NewsTV Shows

Intinti Gruhalakshmi 19 Dec Today Episode : మళ్లీ తులసి ఇంట్లో గొడవలు సృష్టించిన లాస్య.. పరందామయ్యకు మతిమరుపు ఉందనే విషయం తెలుస్తుందా? పూర్తిగా పిచ్చిది అయిన దివ్య

Intinti Gruhalakshmi 19 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 19 డిసెంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1131 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు పరందామయ్య. ఇక్కడే మీ పక్కనే ఉన్నానండి అంటుంది అనసూయ. దీంతో నా పక్కనే ఉంటావు కదూ. వదిలేసి వెళ్లవు కదూ అంటే వెళ్లను మీతోనే ఉంటాను అంటుంది అనసూయ. ఒక్కోసారి నేను ఎవరో, ఎక్కడున్నానో మరిచిపోతున్నాను అనసూయ. అలాంటప్పుడు నాకు భయం వేస్తుంటుంది. అలా ఎందుకు అవుతోంది అని అనసూయతో అంటాడు పరందామయ్య. దీంతో ముసలివాళ్లం అవుతున్నాం కదా అందుకే అలా అవుతుంది అని అంటుంది అనసూయ. ఇద్దరూ కలిసి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో తులసి పాలు పట్టుకొని వస్తుంది. పరందామయ్యను చూసి బాధపడుతుంది తులసి. నాకు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తోంది అనసూయ అంటాడు. దీంతో ఇక్కడ నీకు ఏం లోటు జరుగుతుందని మీరు బాధపడుతున్నారు అంటే.. ఏమో నాకు అలా అనిపిస్తోంది అంటాడు. ఇంతలో తులసి వచ్చి ఈ తులసిని చూడకుండా మీరు ఉండగలరేమో కానీ.. మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అంటుంది తులసి.

మరోవైపు దివ్యను ఇంకా పిచ్చిదాన్న చేస్తున్నాం అని రాజ్యలక్ష్మితో అంటాడు బసవయ్య. మొగుడి ప్రాణం డేంజర్ లో ఉందని తెలియగానే హడావుడి చేసింది అంటాడు బసవయ్య. పెళ్లాం పరిస్థితి చూసి విక్రమ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటు వదిన వైపు మాట్లాడలేక, మనవైపు మాట్లాడలేక అన్నయ్యకు పిచ్చెక్కుతోంది అంటాడు సంజయ్. అన్నయ్య దగ్గర అబద్ధం చెప్పాం. నాకు మాత్రం ఆ అబద్ధం నిజం అయి ఉంటే బాగుండు అనిపిస్తోంది అంటాడు సంజయ్. మనకి కక్ష ఉండొచ్చు.. కోపం, పగ ఉండొచ్చు.. అంత మాత్రం చేత ప్రాణం తీయాలని అనుకోవడం కరెక్ట్ కాదు. మన పనులు అయ్యేలా చూసుకోవాలి అంతే అంటుంది రాజ్యలక్ష్మి. ముందు ఆ విక్రమ్ గాడితో ఆస్తి రాయించుకోవాలంటే నాకు 5 నిమిషాలు చాలు అంటుంది రాజ్యలక్ష్మి. వాడికి వాడి పెళ్లాం మీద ప్రేమ ఉన్నమాట నిజం కానీ.. ఈ అమ్మ మీద కూడా ప్రేమ ఉంది అంటుంది రాజ్యలక్ష్మి. తను అడిగి ఆస్తి రాయించుకోవడం కాదు.. వాడి అంతట వాడే ఆస్తి రాసివ్వాలని అక్కయ్య ప్లాన్ అంటాడు బసవయ్య. ఇది జరగాలంటే మనకు ఉన్న ఒకే ఒక అడ్డంకి దివ్య. దివ్య నుంచి విక్రమ్ ను వేరు చేస్తే కథ పూర్తయినట్టే. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నాను అంటుంది రాజ్యలక్ష్మి. దివ్య కథ పూర్తయిన తర్వాత ప్రియ కథ చూద్దాం అంటుంది రాజ్యలక్ష్మి.

Intinti Gruhalakshmi 19 Dec Today Episode : పరందామయ్యను పరామర్శించడానికి వెళ్లిన లాస్య

మరోవైపు లాస్యతో భాగ్య మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఏంటి ఇంత మౌనంగా ఉన్నావు అని అడుగుతుంది భాగ్య. తట్టా బుట్టా సర్దుకో.. ఇంకా ఎందుకు ఆ తులసి వెంట పడతావు. నందు వెంట పడతావు అని అడుగుతుంది. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటా అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అంటే నేను పెళ్లి చేసుకోవడం నీకు నచ్చడం లేదా అంటుంది లాస్య. నేను నా మొగుడితో బాగానే ఉన్నాను అంటుంది భాగ్య. అటు బావ గారు తులసి వైపు మొగ్గు చూపుతున్నారు. తులసి వెంట పడుతున్నారు. నువ్వేమో ఇక్కడ నందు వెంట పరుగెడుతున్నావు అంటుంది భాగ్య. నందు తాగి పిచ్చోడిలా ఎక్కడికక్కడ పడుతున్నారు అంటుంది.

మరోవైపు విక్రమ్ కోసం ఆసుపత్రికి వెళ్తుంది దివ్య. విక్రమ్ నీకు ఏం కాలేదు కదా అని అడుగుతుంది. దివ్య ఏమైంది.. నువ్వు ఆసుపత్రికి ఎందుకు వచ్చావు అంటే నాకు ఏం కాలేదు. నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే.. నీ కారు ఎందుకు డ్యామేజ్ అయింది అని అడుగుతుంది. దీంతో రోడ్డు మీద ఓ వ్యక్తి కారుకు అడ్డం రావడంతో కారు అదుపుతప్పింది అని చెబుతాడు విక్రమ్. నా మీద ఒట్టేసి చెప్పు.. నిజంగానే అడ్డం వచ్చాడా లేక అటాక్ చేయబోయాడా అని అడుగుతుంది దివ్య. దీంతో నేను నిజమే చెబుతున్నా దివ్య. అసలు నాకు యాక్సిడెంట్ అయిన విషయం నీకు ఎవరు చెప్పారు. ఎందుకు ఇంత హంగామా చేస్తున్నావు అంటే.. నీకు తెలియదు విక్రమ్. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికీ వెళ్లొద్దు అని అంటుంది దివ్య. దివ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉండి ఉంటుంది. తర్వాత అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటాడు.

ఈ ఇంటి కోడలుగా ఉండాల్సిన దాన్ని పరాయి దానిలా రావాల్సి వస్తోంది అని తులసి ఇంటికి వెళ్లి అనుకుంటుంది లాస్య. ఒక బొకే తీసుకొని అక్కడికి వెళ్తుంది. పరందామయ్యను చూసి అతడి దగ్గరికి వెళ్తుంది లాస్య. సోఫా మీద కూర్చొని నిద్రపోతున్న పరందామయ్యను లేపుతుంది లాస్య. గుర్తుపట్టారా అంటే.. ఎక్కడో ఎప్పుడో చూసినట్టు ఉంది. పేరు గుర్తుకురావడం లేదు అంటాడు పరందామయ్య. నీకు జబ్బు ఉంది కదా.. నువ్వేం గుర్తుపడతావులే అంటుంది లాస్య.

నాకు ఏం జబ్బు ఉంది అని అడుగుతాడు. అదో మాయదారి జబ్బు. రాబందు జబ్బు. నీకు వచ్చిన జబ్బు పేరు ఏంటంటే అంటూ లాస్య చెప్పబోతుండగా తులసి చూసి ప్లేట్స్ కింద ఎత్తేసి తన దగ్గరికి కోపంగా వెళ్తుంది.  తులసి ఈ అమ్మాయి ఎవరో నేను జబ్బు మనిషిని అంటోంది. ఆ జబ్బు పేరు ఏంటో కూడా తెలుసు అంటుంది అని అంటాడు పరందామయ్య. దీంతో అత్తయ్య మామయ్యను బయటికి తీసుకెళ్లండి అంటుంది తులసి. అది పెద్ద దొంగ.. పదండి అని అనసూయ అనడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అసలు నీకు బుద్ధి ఉందా? ఆయన జబ్బు గురించి తెలియకుండా మేము జాగ్రత్తపడుతుంటే నువ్వు వచ్చి ఆయన జబ్బు గురించి చెబుతా అంటావా అంటే.. ఎందుకు అంత కోపం అంటుంది లాస్య. అసలు నువ్వెందుకు వచ్చావు. ఈ ఇంట్లో ఎవరు ఎలా ఉంటే నీకెందుకు. ఏం జరిగితే నీకెందుకు అని అంటాడు నందు. దీంతో ఈ ఇల్లు నాకు పరాయి ఇల్లు కాదు. ఈ ఇంట్లో నాకు అనుమతి ఉంది అంటుంది లాస్య. వాడు నిన్ను వదిలేసినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? వెళ్లిపో అని అంటుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

2 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

14 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

16 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

20 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

23 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago