Guppedantha Manasu 23 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 928 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార.. అనుపమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన రిషి.. వసుధార ఏం ఆలోచిస్తున్నావు. అనుపమ గురించేనా? అమ్మ లేకపోవడం వల్ల డిస్టర్బ్ అయిన అమ్మే.. తనను డాడ్ దగ్గరికి పంపించినట్టు అనిపిస్తోంది అంటాడు రిషి. ప్రతి రోజు రెండు మూడు సార్లు భోజనానికి పిలిస్తే కానీ రాని డాడ్ తానే స్వయంగా భోజనాలను ఒడ్డించడం, వాళ్లు వాళ్లు సరదాగా భోం చేయడం మంచిగా అనిపించింది అంటాడు రిషి. ఆవిడ రాగానే చిన్న పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. తన జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయో అని వసుధారతో అంటాడు రిషి. ఆ దేవుడు ఒక్కొక్కరి తలరాతను ఒక్కోరకంగా రాస్తాడు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తుంటాయి. మనకు ఎన్ని సమస్యలు వచ్చినా చివరకు కలిసే ఉన్నాం కదా సార్ అంటుంది వసుధార. మరోవైపు ఫోన్ లో ఏదో వీడియో చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు మహీంద్రా. అక్కడికి వచ్చిన రిషి.. ఎందుకో ఈరోజు మీరు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఏంటి డాడ్ స్పెషల్. అదేం లేదే.. నేను ఎప్పటిలాగానే ఉన్నాను అంటాడు మహీంద్రా.
వసుధారా నువ్వు చెప్పు.. డాడ్ లో ఏదైనా కొత్తగా కనిపిస్తోందా అంటే.. అవును అంటుంది వసుధార. మీకు నాలో ఏం కొత్తదనం కనిపించిందో చెప్పండి. నేను నార్మల్ గా ఉన్నాను అంటాడు. అవును.. అవును.. మీరు నార్మల్ గానే ఉన్నారు. వసుధార డాడ్ నార్మల్ గానే ఉన్నారు కదా అంటే.. అవును అవును.. నార్మల్ గానే ఉన్నారు డాడ్ అంటుంది వసుధార. మీరు సంతోషంగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అంటుంది వసుధార. దీంతో అలాగే అమ్మ అంటాడు. మీరు వెళ్లి పడుకోండి అంటాడు మహీంద్రా. మీరు ఇలాగే సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోండి అంటాడు రిషి. దీంతో గుడ్ నైట్ డాడ్ అంటాడు రిషి. జగతి నువ్వు పోతూ పోతూ.. నాకు ఒక తల్లిని ఇచ్చి వెళ్లావు. రిషి నాకు తల్లిలా అన్ని చూసుకుంటున్నాడు అని మనసులో అనుకుంటాడు మహీంద్రా. మరోవైపు అనుపమకు దేవయాని ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. దీంతో ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదు.. తెలుసుకుందామని అంటుంది దేవయాని. ఎప్పుడూ తిన్నగా ప్రశ్నకు సమాధానం చెప్పదు అని మనసులో అనుకుంటుంది దేవయాని.
నువ్వు ఎక్కడ ఉన్నావో అని.. భోం చేశావో లేదో అని ఇంటికి వచ్చి భోం చేస్తావా అని అడుగుతున్నా అంటుంది. దీంతో నేను తిన్నా అంటుంది అనుపమ. దీంతో హోటల్ లో ఎందుకు తింటున్నారు అంటే.. నేను మహీంద్రా ఇంట్లో తిన్నాను అంటుంది. అవునా.. మహీంద్రా ఇంటికి ఎందుకు వెళ్లావు. వాళ్లు ఏమన్నారు.. జగతి ఏమన్నది అంటే.. నువ్వెందుకు అన్ని విషయాలు అడుగుతున్నావు అంటే ఊరికే తెలుసుకుందామని అనుకుంటున్నాను అంటుంది దేవయాని. అసలు మీకెందుకు.. ఎందుకు మీరు ఇవన్నీ అడుగుతున్నారు అంటుంది అనుపమ.
మరోవైపు కాలేజీ స్టూడెంట్స్ ఇద్దరూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చిత్రను ఓ స్టూడెంట్ బతిమిలాడుతూ ఉంటాడు. ఇంతలో రిషి, వసుధార అక్కడికి వస్తారు.. ఏం జరిగింది అని అడుగుతారు. ఎవరు నువ్వు.. మా కాలేజీ స్టూడెంట్ కాదు కదా అంటే.. నా పేరు వాసవ్ సార్.. చిత్ర వాళ్ల ఇంటి దగ్గర ఉంటాను అంటాడు. మీ ప్రాబ్లమ్ ఏంటి అని అడుగుతారు.
చిత్ర, నేను ప్రేమించుకున్నం అంటాడు. ఇద్దరికీ చిన్న గొడవ అయింది అంటాడు. అప్పటి నుంచి చిత్ర నాతో మాట్లాడటం లేదు అంటాడు. నేను మాట్లాడకపోయే సరికి నేను తట్టుకోలేకపోతున్నాను మేడమ్. నా మనసు, నా మనసులో ఉండటం లేదు. నాకు మెంటల్ ఎక్కి పోయింది అంటాడు. అందుకే మా ఇద్దరిలో తప్పు ఎవరిది అనేది పక్కన పెట్టి నేను కాంప్రమైజ్ అయ్యాను అంటాడు వాసవ్.
ఇతడు మా ఇంటి దగ్గరే ఉంటాడు కానీ. మా మధ్య ప్రేమ లేదు సార్ అంటుంది చిత్ర. తన చేయి పట్టుకొని బతిమిలాడుతాడు. దీంతో తన చేయి వదులు అని వాసవ్ చెంప చెళ్లుమనిపిస్తుంది వసుధార. తనున అబద్ధం చెబుతోంది మేడమ్ అంటాడు. వీడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వీడు నాకు ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి మేమిద్దరం కలసి తిరిగినట్టు మార్ఫింగ్ చేశాడు.
నేనే లవ్ లెటర్స్ రాసినట్టు సృష్టించాడు. ప్రతి రోజు ప్రతి క్షణం నా వెంట పడుతూ హింసిస్తున్నాడు సార్. వీడి వల్ల నరకం అనుభవిస్తున్నాను సార్ అంటుంది చిత్ర. వెంటనే సెక్యూరిటీని పిలిచి వాసవ్ ను బయటికి పంపిస్తాడు రిషి.
మరోవైపు అందరి ముందు ధరణిని మెచ్చుకుంటాడు శైలేంద్ర. దీంతో ఫణీంద్ర సంతోషిస్తాడు. ఇంట్లో ఫణీంద్ర పనిమనిషిని పెడతాడు ఫణీంద్రా. దీంతో దేవయాని షాక్ అవుతుంది. శైలేంద్ర, ధరణి ఇద్దరినీ కొన్ని రోజలు రిసార్ట్ కు వెళ్లి ఎంజాయ్ చేయాలని చెబుతాడు ఫణీంద్రా. అందుకే పనిమనిషిని పెట్టానని చెబుతాడు ఫణీంద్రా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.