Guppedantha Manasu 9 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు గుప్పెడంత మనసు 9 డిసెంబర్ 2023, శనివారం ఎపిసోడ్ 942 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముకుల్ కి కానిస్టేబుల్ రాహుల్ ఫోన్ చేస్తాడు. ఔట్ స్కర్ట్స్ లో ఒక కారు అనుమానాస్పదంగా ఆగి ఉంది. అది రిషి సార్ ది అని అంటాడు. దీంతో ఎక్కడ చూశావు అంటే చిలుకూరు వెళ్లే రోడ్ లో సార్ అంటాడు. అక్కడ సీన్ ఎలా ఉంది అంటే అర్థం కావడం లేదు సార్ అంటాడు. అనుమానాస్పదంగా కానీ.. ఆధారాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే ఏం లేదు సార్ అంటాడు. ఆ కారు ఫోటో తీసి పంపించు అంటాడు ముకుల్. దీంతో ఫోటో తీసి లైవ్ లొకేషన్ పంపిస్తాడు కానిస్టేబుల్. మరోవైపు శైలేంద్ర ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. శైలేంద్ర అంటూ దేవయాని వస్తుంది. ముకుల్ గాడు ఇక్కడికి వస్తున్నాడంట అని చెబుతుంది. అప్పుడే వస్తున్నాడా అంటే.. అప్పుడే ఏంటి వీళ్లు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. తను వస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ నీ వాయిస్ ప్లే చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే.. ఏం చేయాలో అర్థం కావడం లేదు మామ్ అంటాడు శైలేంద్ర. ఏదో ఒకటి ముందు ఆలోచించి ఉంటే బాగుండేది కదా అంటుంది దేవయాని. మామ్.. నువ్వు అనవసర సలహాలు ఇవ్వకు. వాడు రానీ.. వచ్చాక ఏదో ఒకటి చేద్దాం అంటాడు శైలేంద్ర.
వాడు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తా అంటాడు శైలేంద్ర. అక్కడ మహీంద్రా అవకాశం ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరికీ తోడు అనుపమ ఒకటి. అది ఎందుకు వచ్చిందో ఏంటో.. నా ప్రాణానికే వచ్చినట్టుంది. వీళ్లంతా కలిసి ఏం చేస్తారో ఏమో అంటుంది దేవయాని. అసలు ఈ టెన్షన్ తోనే నేను సగం చచ్చిపోతున్నాను అంటుంది. ఇంతలో ధరణి వచ్చి ముకుల్ గారు వచ్చారు. ఆయన్ను పిలుస్తున్నారు. ఏదో మాట్లాడాలంటున్నారు అంటుంది ధరణి. దీంతో ఇప్పుడేం మాట్లాడుతారు. వాడు ఇప్పుడే కదా ఆసుపత్రి నుంచి వచ్చింది అంటే.. నాకేం తెలుసు అత్తయ్య అంటుంది. దీంతో సర్లే నీకేం తెలుసులే. వాడు వస్తాడు నువ్వు వెళ్లు అంటుంది దేవయాని. నాన్నా నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్లి ఏదో ఒకటి మేనేజ్ చేసి నేను పంపించేసి వస్తాను అంటుంది దేవయాని. మరోవైపు ముకుల్.. మహీంద్రా, వసుధార, రవీంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. అనుపమ కూడా వస్తుంది. ఇంతలో దేవయాని వచ్చి ఏంటండి మీరు.. అసలు ఏం అనుకుంటున్నారు మీరు. నా కొడుకు మనిషి అనుకుంటున్నారా? పశువు అనుకుంటున్నారా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇంటరాగేషన్ అంటే ఎలా కుదురుతుంది అంటుంది దేవయాని.
దీంతో అదేంటి మేడమ్.. హాస్పిటల్ లో మాట్లాడుదాం అంటే.. డిశ్చార్జ్ చేశాక రమ్మన్నారు. ఇప్పుడు వస్తేనేమో వద్దంటారు ఏంటి.. సార్ మాకు సహకరించమని చెప్పండి అంటాడు ముకుల్. దీంతో దేవయాని.. ఆయన డ్యూటీ ఆయన్ను చేసుకోనివ్వు. ఆయన పని ఆయన చేసుకొని వెళ్తాడు కదా అంటాడు రవీంద్ర. దీంతో నేను ఒప్పుకోను. వాడు ఇక్కడికి రాలేడు. గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. హాస్పిటల్ నుంచి ఇంటికి రాగలిగినప్పుడు ఇంట్లో నుంచి బయటికి రావడం పెద్ద కష్టమేమీ కాదు కదా అంటుంది అనుపమ.
దీంతో నేనే లోపలికి వెళ్లి మాట్లాడుతా అంటాడు ముకుల్. దీంతో వద్దులే.. ఆయనే మీదగ్గరికి రావాలి కదా అంటాడు రవీంద్రా. మహీంద్రా వెళ్లి శైలేంద్రను తీసుకురావడానికి వెళ్తాడు. శైలేంద్రను నెమ్మదిగా వీల్ చైర్ లో కూర్చోబెట్టి బయటికి తీసుకొస్తాడు మహీంద్రా. హలో శైలేంద్ర గారు అంటాడు ముకుల్. ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే.. కొంచెం కష్టంగానే ఉంది సార్. అయినా పర్లేదు. మేనేజ్ చేస్తాను అంటాడు. మీ డ్యూటీకి సహకరిస్తాను అంటాడు.
నేను కూడా మిమ్మల్ని ఎక్కువ సేపు ఇబ్బంది పెట్టను. 10 నిమిషాలు అంతే అంటాడు. మీరు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు అని అడుగుతాడు ముకుల్. దీంతో జాబ్ చేయాల్సిన కర్మ మా వాడికి ఏంటి అని అంటుంది దేవయాని. దీంతో మమ్మీ నువ్వు ఆగు. నేను డీబీఎస్టీ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ పనులు చూసుకుంటాను అంటాడు. ఇదే జీవితాంతం చేస్తారా? లేక పై స్థాయికి వెళ్లాలని లేదా అంటే.. మా అమ్మానాన్న ఏం చెబితే అది చేస్తాను అంటాడు. దీంతో కానీ మీరు ఒకసారి ఎండీ పదవి తీసుకుంటా అన్నట్టున్నారు అంటుంది వసుధార. మీకు కూడా చెప్పారు కదా సార్ అని రవీంద్రతో అంటుంది వసుధార.
అవును సార్. జగతి చనిపోయిన తర్వాత ఎండీ సీటులో ఎవరు కూర్చొంటారు అనే దాని మీద డిస్కషన్ జరిగింది. అప్పుడు మేము ఒప్పుకుంటే శైలేంద్ర ఎండీ సీటులో కూర్చొంటా అన్నాడు. కానీ.. వాడికి అనుభవం లేదని నేనే వద్దని చెప్పాను అంటాడు. అవును.. సారధి మీ ఫ్రెండే కదా అని అడుగుతాడు ముకుల్. దీంతో ఎస్ అంటాడు. ఎప్పటి నుంచి అంటే కాలేజీ డేస్ నుంచి అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ విషయంలో రిషి ఫ్రాడ్ చేశాడని తనే కదా ఇష్యూ చేసింది. కానీ.. వసుధార చెప్పినట్టు జగతి మేడమ్ ను ఎవరో బ్లాక్ మెయిల్ చేయడం వల్లే వాళ్లు అప్పుడు రిషి మీద నింద వేశారు అంటాడు ముకుల్.
ఆ బ్లాక్ మెయిల్ చేసింది సారధి అంటే మీరు నమ్ముతారా అంటే ఏమో తెలియదు సార్ అంటాడు శైలేంద్ర. ఆ తర్వాత ఆ వాయిస్ వినిపిస్తాడు ముకుల్. ఆ వాయిస్ విని అందరూ షాక్ అవుతారు. ఇది ఇప్పటికే మొన్ననే వినిపించాను అంటాడు ముకుల్. దీంతో అవునా.. నాకు చెప్పలేదు అంటాడు. ఇది అచ్చం నా వాయిస్ లాగే ఉంది కదా అంటాడు. దీంతో అచ్చం మీ వాయిస్ కాదు సార్.. వందకు వంద శాతం మీ వాయిసే అనుకుంటున్నాం అంటాడు ముకుల్. ఏమంటారు మీ వాయిసా కాదా.. చెప్పండి సార్ అంటే శైలేంద్రకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.