Categories: NewsTV Shows

Guppedantha Manasu 9 Nov Today Episode : రిషి, వసుధార మధ్య ఉన్న బంధం గురించి తెలుసుకొని ఏంజెల్ షాక్.. అనుపమ ఇంట్లో చూసి విశ్వనాథం షాక్

Guppedantha Manasu 9 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు గుప్పెడంత మనసు 9 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 916 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా ఒకరికి ఒకరు తెలియనట్టు మాట్లాడాం. మా ప్రేమను బయటికి చెప్పుకోలేక, మనసులో దాచుకోలేక ఎంతో మనోవేదన అనుభవించాం. మా మధ్య ఉన్న దూరం పక్కన పెట్టి మేమిద్దరం ఒక్కటయ్యాం. మా ప్రేమకు ఉన్న బలం అలాంటిది. మా ప్రేమ కోసం మేమిద్దరం ఒక్కటయ్యాం అంటాడు రిషి. దీంతో వావ్.. సూపర్ రిషి నువ్వు. కథ చాలా బాగా చెప్పావు అంటుంది ఏంజెల్. ఈ కథ ఇప్పటికిప్పుడు భలే అల్లావు తెలుసా? వింటుంటే నిజమే అనిపిస్తోంది. నేను ఎప్పుడు అడిగినా చెప్పలేదు. నా మాట దాటేశావు. ఇప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్మాలా అంటుంది ఏంజెల్. దీంతో నమ్మాలి ఏంజెల్. రిషి సార్ చెప్పేది అంతా నిజమే. ఆయన చెప్పింది అంతా నమ్మాలి అంటుంది వసుధార. రిషి సార్ తన గతాన్ని ఎలా చెప్పగలరు చెప్పు. ఒక మహారాజు తన కిరీటం పోగొట్టుకొని రోడ్డు మీదికి వచ్చినప్పుడు ఎవరు నువ్వు అని అడిగితే కిరీటం పోగొట్టుకున్న మహారాజు అని ఎవరికీ చెప్పలేడు. అప్పుడు రిషి సార్ పరిస్థితి కూడా అలాంటిదే ఏంజెల్ అర్థం చేసుకో అంటుంది వసుధార. తనంటే చెప్పలేదు. మరి నువ్వెందుకు నిజం చెప్పలేదు అని ప్రశ్నిస్తుంది ఏంజెల్. మీకిద్దరికీ పరిచయం ఉందా అని ఎన్నిసార్లు అడిగాను. అప్పుడెందుకు నువ్వు ఆ విషయాలు దాచావు అంటే రిషి సార్ కోసం అంటుంది వసుధార.

ఏంటి.. అంటుంది ఏంజెల్. అవును ఏంజెల్. నువ్వు అడిగిన ప్రతిసారి చెప్పాలనుకున్నాను. మా మధ్య ఉన్నది పరిచయం కాదు. ప్రేమ అని. నీకు ఎన్నోసార్లు చెప్పాలని అనుకున్నా కానీ.. చెప్పలేకపోయాను. ఎందుకంటే రిషి సార్ మా మధ్య ఉన్న బంధం, మా గతం ఎక్కడా ఎవ్వరికీ చెప్పొద్దు అని ముందే మాట తీసుకున్నారు అని అంటుంది వసుధార. అందుకే ఆయన చెప్పలేని ఏ నిజాన్ని నేను బయటపెట్టలేకపోయాను అంటుంది వసుధార. మరి ఇప్పుడు ఎలా చెబుతున్నావు అంటే.. ఇప్పుడు రిషి సార్ నన్ను భార్యగా అంగీకరించారు. అందుకే చెబుతున్నా అంటుంది వసుధార. నేను రిషి సార్ స్టూడెంట్ ని. డీబీఎస్టీ కాలేజీలో చదువుకున్నా అంటుంది వసుధార. దీంతో ఏంజెల్, విశ్వనాథం షాక్ అవుతారు. జగతి మేడమే నన్ను డీబీఎస్టీ కాలేజీకి పంపించారు అంటుంది వసుధార. అక్కడే రిషి సార్ కి, నాకు మధ్య ప్రేమ చిగురించింది అని చెబుతుంది వసుధార. రిషి సార్ డీబీఎస్టీ కాలేజీ ఎండీగా హుందాగా ఉండేవారు. అలాంటి రిషి సార్ ను నేను కాలేజీలో లెక్చరర్ గా చూస్తూ నేను పడ్డ బాధ నా ఒక్కదానికే తెలుసు అంటుంది వసుధార. మళ్లీ రిషి సార్ ను రిషేంద్ర భూషణ్ గా చూడాలా అని క్షణక్షణం తపించి పోయేదాన్ని అంటుంది వసుధార.

Guppedantha Manasu 9 Nov Today Episode : మాది ఆత్మ బంధం.. అదే ప్రేమగా, పెళ్లిగా మారింది అన్న వసుధార

మాది పెళ్లితోనే ప్రేమతోనే ఏర్పడిన బంధం కాదు సార్. మాది ఆత్మ బంధం. అదే ప్రేమగా, పెళ్లిగా మారింది సార్ అంటుంది వసుధార. మీరు ఎన్ని అయినా చెప్పండి నేను నమ్మను అంటుంది ఏంజెల్. ఇంతలో రూమ్ లో ఉన్న అనుపమకు అన్ని వినిపిస్తాయి. ఏంటి ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని అనుకుంటుంది. బయటికి వెళ్తుండగా తనకు పెద్దమ్మ ఫోన్ చేస్తుంది.

విశ్వనాథం.. రిషి, వసుధారను అర్థం చేసుకుంటాడు. మమ్మల్ని ఆశీర్వదించండి సార్ అంటుంది వసుధార. పది కాలాల పాటు చల్లగా ఉండండి అంటాడు విశ్వనాథం. డీబీఎస్టీ కాలేజీ మాత్రమే కాదు.. విష్ కాలేజీ కూడా మీదే. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు అని అంటాడు విశ్వం. నేను ఆ విషయం ఎప్పుడూ మరిచిపోను. విష్ కాలేజీకి రిషి, వసుధార అవసరం ఉంది. ఎప్పుడైనా మేము వస్తాం సార్ అంటాడు రిషి. ఇక మేము వెళ్లి వస్తాం సార్ అంటే.. ఒక్క నిమిషం రిషి అని చెప్పి మన ఇంటికి వచ్చిన కొత్త పెళ్లికూతురుకు మన పద్ధతి ప్రకారం తాంబూలం ఇచ్చి పంపు అంటాడు విశ్వం. దీంతో రిషి, వసుధార ఇద్దరికీ తాంబూలం ఇస్తుంది ఏంజెల్.

ఏంజెల్ మా మీద ఇంకా కోపంగా ఉందా అంటే.. ఇది కోపం కాదు రిషి.. బాధ అంటుంది ఏంజెల్. వసుధార నేను నిన్ను చాలా నమ్మాను. అన్ని విషయాలు నీతో షేర్ చేసుకున్నాను అంటుంది. రిషి.. నువ్వు నమ్మకద్రోహం చేశావా లేకా వెన్నుపోటు పొడిచావా అని నేను అడగను. కానీ.. మీరిద్దరూ నా దగ్గర పెద్ద విషయాలు దాచారు. నాకు తెలియకుండానే నేను మీ ఇద్దరినీ నమ్మాను. నాకు డౌట్ వస్తే దాన్ని మీరిద్దరూ కప్పిపుచ్చారు. ఒక్క విషయం చెప్పనా. మీరిద్దరూ కలిసి నన్ను ఒక తెలివి తక్కువ దద్దమ్మను చేశారు అంటుంది ఏంజెల్. వెళ్లొస్తాం సార్ అని చెప్పి రిషి, వసుధార అక్కడి నుంచి వెళ్తారు.

ఇంతలో పైన రూమ్ లో సౌండ్ కావడంతో ఏంటా సౌండ్ అని అడుగుతాడు విశ్వం. ఎవరో అమ్మగారు వచ్చారు సార్. పైన లాక్ వేసి ఉన్నా కీ అడిగారు అని అంటుంది సుభద్రమ్మ. ఇంతలో అనుపమ తన రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. తనను చూసి విశ్వం షాక్ అవుతాడు. అనుపమ అంటాడు.

వచ్చావా.. ఇన్నాళ్లకు నా మీద కోపం తగ్గిందా? అంటాడు విశ్వం. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంటాడు. ఎవరు తను అని అడుగుతుంది ఏంజెల్. దీంతో మీ అత్తయ్య అంటాడు విశ్వం. మీ అన్నయ్య కూతురు అని ఏంజెల్ ను చూపిస్తాడు విశ్వం. బాగా పెద్దదానివైపోయావు. నీ పేరు ఏంజెల్ కదా అని అడుగుతుంది అనుపమ. ఎలా ఉన్నారు డాడ్ అని అడుగుతుంది అనుపమ. విశ్వం.. ఇక నీకు ఇంకో తోడు దొరికింది అని అంటుంది ఏంజెల్.

మరోవైపు మహీంద్రా.. జగతి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. తనను చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతాడు. ఇంతలో మహీంద్రా.. నువ్వు మందు తాగవని రిషికి మాటిచ్చావు అనే మాటను గుర్తు తెచ్చుకుంటాడు. అవును జగతి. నేను రిషికి మాటిచ్చాను కానీ మందు తాగకుండా ఉండలేకపోతున్నాను జగతి. సరే.. నీకోసం తాగలేను జగతి అని అనుకుంటాడు మహీంద్రా.

ఈ డైరీలో మన తీపి గుర్తులు భద్రంగా ఉన్నాయి కానీ నువ్వే నా పక్కన లేవు. మన ఫ్రెండ్ అనుపమ నాకు ఫోన్ చేసింది కానీ నేను మాట్లాడలేదు. నాకు భయం వేసింది. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను అంటాడు. తను ఎదురు పడితే నీ గురించే అడుగుతుంది జగతి. జగతి ఎక్కడ ఉంది.. అని ప్రశ్నలే అడుగుతుంది. అందుకే తనతో మాట్లాడకుండా తప్పించుకుంటున్నాను. ఎందుకు జగతి.. నన్ను ఇలా కష్టాలు పెడుతున్నావు. నువ్వు ఇలా ఒక మెమోరీగా మిగిలిపోతావని నేను ఊహించలేదు జగతి అని అంటాడు మహీంద్రా.

మరోవైపు అనుపమ తన బట్టలు సర్దుకుంటూ ఉండగా.. ఒక ఫోటో కింద పడుతుంది. అది నీ ఫోటోనా అని అడుగుతుంది ఏంజెల్. దీంతో అది నా పర్సనల్ ఫోటో. నువ్వు చూడకూడదు అంటుంది అనుపమ. అప్పుడు నువ్వు ఎలా మనుషులను దూరం పెట్టేదానివో ఇప్పుడు కూడా అలాగే దూరం పెడుతున్నావు అంటుంది ఏంజెల్.

మరోవైపు రిషి సార్ కు వచ్చిన లెటర్స్ ను చూస్తాడు విష్ కాలేజీ ప్రిన్సిపల్. పాండ్యన్ ను పిలుస్తాడు. ఇవి రిషి సార్ కు పర్సనల్ గా వచ్చిన లెటర్స్. నువ్వు ఇవి తీసుకెళ్లి సార్ కు ఇచ్చేయ్ అంటాడు. వాళ్లు విశ్వనాథం సార్ ఇంటినుంచి ఇప్పుడే బయలుదేరారు. నువ్వు వెళ్లి ఇవ్వు అంటాడు ప్రిన్సిపల్. దీంతో సరే అంటాడు పాండ్యన్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Central Govt : ఉగ్ర‌వాద దాడుల్ని లైవ్‌లో చూపించొద్దు.. సీరియ‌స్ అయిన కేంద్రం..!

Central Govt : ప్ర‌స్తుతం భార‌త్ - పాక్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆపరేషన్ సింధూర్ త‌ర్వాత పాకిస్తాన్…

9 minutes ago

IPL 2025 Postponed : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వాయిదా ప‌డ్డ ఐపీఎల్ 2025..!

IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు…

1 hour ago

Army Jawan Murali Naik : భార‌త్-పాక్ యుద్ధం.. వీర‌మ‌ర‌ణం పొందిన జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్

Army Jawan Murali Naik : భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…

2 hours ago

Brain Healthy : మీ మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా : పదునైన మరియు కేంద్రీకృత మనస్సు కోసం చిట్కాలు

Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…

4 hours ago

Good News : గుడ్‌న్యూస్‌.. కేంద్రం కొత్త ప‌థ‌కంతో ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.50 లక్షలు…!

Good News :  భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…

5 hours ago

Sugarcane Juice : వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…

6 hours ago

Funeral : అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో నీళ్ల‌తో ఉన్న కుండ‌కి రంధ్రం ఎందుకు పెడ‌తారు?

Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇత‌ర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ ప‌లు ర‌కాల…

7 hours ago

Fingernails Health : మీ గోర్లు మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతాయో తెలుసా..?

Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…

8 hours ago