
intinti gruhalakshmi 28 november 2023 tuesday full episode
Intinti Gruhalakshmi 23 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఇంటింటి గృహలక్ష్మి 23 నవంబర్ 2023, గురువారం ఎపిసోడ్ 1109 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా ముభావంగా ఉంటావు అంటే.. ఒక్కోసారి పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అంటుంది తులసి. హనీ విషయంలో విక్రమ్ తో నువ్వు ఏమన్నావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మా అమ్మ ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. తప్పు చేయదు అన్నావు అవునా. మరి ఇప్పుడు ఆ నమ్మకం ఏమైందమ్మా. మరి ఎందుకు మీ అమ్మను ప్రశ్నిస్తున్నావు. మీ నాన్న మీద నీకు ఉన్న ప్రేమ.. అమ్మ మీద నమ్మకాన్ని మింగేస్తుందా? అంటుంది తులసి. దీంతో అలా కాదమ్మా.. నువ్వు, నాన్న నాకు రెండు కళ్లు అంటుంది దివ్య. మరోవైపు పరందామయ్య.. నందుతో మాట్లాడుతాడు. కన్నీళ్లు తుడుచుకోవడం తప్ప అడుగు ముందుకు వేయలేవురా అంటాడు పరందామయ్య. దీంతో నేను ఓడిపోయాను నాన్న.. ఒప్పుకుంటాను కానీ.. మళ్లీ నేను గమ్యం చేరుకునేందుకు ప్రయత్నిస్తాను అంటాడు నందు. నాన్న విషయంలో నువ్వు ఒక నిర్ణయానికి వచ్చావని అర్థమయింది అంటుంది దివ్య. నా మాట విను అమ్మ.. నీకోసం కాదు.. నానమ్మ, తాతయ్య కోసం. వాళ్లు కూడా సరిగ్గా భోజనం చేయడం లేదు. షుగర్ పేషెంట్స్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేశారు అంటుంది దివ్య.
దీంతో నాతో వంతులు ఏంటి. మీ ఆరోగ్యం గురించి పట్టించుకోరా అంటే.. నా గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావో.. నీ గురించి కూడా మేము అంతే బాధపడుతున్నాం. ఏం జరిగితే అది జరుగుతుంది అంటాడు పరందామయ్య. దీంతో దివ్య.. ఆ పాల గ్లాస్ ఇలా తీసుకురా అమ్మ అంటుంది తులసి. పాల గ్లాస్ ఇవ్వగానే పాలు తాగేస్తుంది తులసి. అప్పుడే దీపక్ కూడా వస్తాడు. కనీసం ఇప్పుడైనా ఇంటికి రా అక్క అంటే.. ఇంకా అక్కడ నాకు ఎవరు ఉన్నారని నేను రావాలి అంటుంది తులసి. దీంతో అదేంటి అక్క నేను లేనా. నీకు నేనున్నాను కదా.. అంటుంది దీంతో సరే అంటుంది తులసి. మరోవైపు రాజ్యలక్ష్మి.. ఒక ముఖ్యమైన విషయం అందరితో షేర్ చేసుకోవడానికి పిలుస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిందా అని అడుగుతాడు విక్రమ్. లేదు.. హాస్పిటల్ కు సంబంధించింది అంటుంది రాజ్యలక్ష్మి. హాస్పిటల్ గురించి అన్ని విషయాలు నువ్వే చేసుకుంటున్నావు కదా అమ్మ అంటాడు విక్రమ్. దీంతో విక్రమ్ అత్తయ్య గారు చెప్పే మాటలు వినొచ్చు కదా అంటుంది దివ్య. నువ్వు ఒక విషయం మరిచిపోతున్నావు హాస్పిటల్ నాది కాదు.. నీది. నీది పెద్ద మనసు కాబట్టి హాస్పిటల్ బాధ్యతను ఈ అమ్మకు అప్పగించావు. నేను కూడా హాస్పిటల్ ను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాను అంటుంది రాజ్యలక్ష్మి.
నాకు కూడా ఒక అంతరాత్మ ఉంది. దాని నుంచి నేను అంతా తెలుసుకుంటాను అంటుంది రాజ్యలక్ష్మి. ఈ మధ్య హాస్పిటల్ లాభాలు తగ్గిపోయాయి. దీంతో నష్టాలు వస్తున్నాయి అంటే ఎప్పుడూ లేనిది సడెన్ గా ఎందుకు నష్టాలు వస్తున్నాయి అని అందరూ అనుకుంటారు. హాస్పిటల్ అనేది సేవా భావంతోనే చేయాలి. ఒప్పుకుంటాను కానీ.. హద్దు మీరిన సేవా భావం చేతులు కాలేదాకా తెచ్చుకుంది. ఇప్పుడు జరుగుతుంది అదే.. ఈ మధ్య అపరిమితంగా ఉచిత ఆపరేషన్స్ చేశాం. దాని వల్ల ఆదాయం తగ్గిపోయింది అంటుంది రాజ్యలక్ష్మి. దీంతో అలా అంటారు ఏంటి అత్తయ్య. పుణ్యం పెరుగుతుంది కదా. మీ గురించి, హాస్పిటల్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. విక్రమ్.. ఇటీవల నేను ఆడిటర్ తో మాట్లాడాను. వేరే వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి కదా.. అంటుంది దివ్య. దీంతో విక్రమ్ కూడా అదే అంటాడు.
హాస్పిటల్ కు లాస్ వచ్చిందని ఇక్కడ నిన్ను ప్రశ్నించే వాళ్లు ఎవరూ లేరు. మనం చేసే ఉచిత ఆపరేషన్లు ఆపాల్సిన అవసరం లేదు అంటాడు విక్రమ్. దీంతో అవును.. కరెక్ట్ అంటుంది దివ్య. ఇక.. అత్తయ్య గారు మీరు పిలిచిన పని అయిపోయింది కదా. ఇక ఎవరి పనులు వాళ్లు చేసుకోండి అని చెబుతుంది దివ్య.
కట్ చేస్తే తులసి చేసే పనులను వద్దు అని వారిస్తుంది అనసూయ. ఇప్పుడు నువ్వన్నీ ఈ పనులు చేయడం అవసరమా అంటుంది అనసూయ. మరోవైపు లాస్య.. తులసి ఇంటికి వస్తుంది. తన తల్లి చనిపోయినందుకు తులసిని పరామర్శిస్తుంది. లాస్యతో పాటు తులసి తోటి కోడలు కూడా వస్తుంది. నువ్వు ముందు మనిషివో డిసైడ్ చేసుకో.. ఆ తర్వాత మంచి దానివో, చెడ్డ దానివో చూసుకోవచ్చు అంటుంది తులసి.
మరోవైపు లాస్య.. తులసి ముందు నందు ఎలాగూ పరువు పోగొట్టుకున్నాడు. ఆ పరువును ఆఫీసులోనూ తీయండి అని తులసి ఆఫీసులో పని చేసే వ్యక్తితో చెబుతుంది. తులసి, నందు ఇద్దరూ ఆఫీసుకు వెళ్తారు. తులసికి అందరూ గుడ్ మార్నింగ్ చెబుతారు కానీ.. నందుకు ఎవ్వరూ చెప్పరు.
ఆ తర్వాత ఆఫీసులో పని చేసే వ్యక్తి వచ్చి మీ గురించి ఆఫీసులో చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు. తులసి మేడమ్ తల్లి చావుకు మీరే కారణమని అని అంటాడు. తులసి గారే మేనేజర్ కు చెప్పారట అంటాడు. దీంతో ఏం చేయాలో నందుకు తెలియదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mother : కన్నతల్లి తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందనే మాటను ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది.…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరానికి…
Karthika Deepam 2 Today Episode 8th June 2026 : స్టార్ మాలో ప్రసారమవుతున్న ‘కార్తీక దీపం 2’…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి బులియన్ మార్కెట్ నుంచి ఊహించని శుభవార్త అందింది.…
Mrigasira Karthe 2026 : తెలుగు సంప్రదాయాలు, ప్రకృతి చక్రం, ఆరోగ్య పరిరక్షణ.. ఈ మూడింటి కలయికే మృగశిర కార్తె.…
Tea : ఉదయం లేవగానే ఒక కప్పు టీ.. ఆఫీసులో పని మధ్యలో మరో కప్పు.. సాయంత్రం స్నేహితులతో కలిసి…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం మన జీవితంలోని అనేక అంశాలపై ప్రభావం…
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్‌లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్‌లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
This website uses cookies.