Intinti Gruhalakshmi 27 Nov Monday Episode Highlights : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఇంటింటి గృహలక్ష్మి 27 నవంబర్ 2023, సోమవారం ఎపిసోడ్ 1112 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అత్తయ్య ఆరోగ్యం కోసం నేను ఎంత శ్రమ అయినా పడతా అని చెబుతుంది దివ్య. దీంతో నీ పెద్ద కోడలుకు నువ్వంటే ఎంత ప్రేమో అంటాడు బసవయ్య. నేను ఇలాగే ఇంట్లో కూర్చొంటే ట్యాబ్లెట్స్ పేర్లు అన్నీ మరిచిపోతా అన్నయ్య అంటాడు తన తమ్ముడు. దీంతో దీక్ష కంటిన్యూ చేయాలి కదా అంటే.. దీక్ష చేస్తూనే హాఫ్ డే ఆసుపత్రికి వస్తాను అంటాడు విక్రమ్ తమ్ముడు. దీంతో విక్రమ్ కు ఏం చెప్పాలో అర్థం కాదు. రాజ్యలక్ష్మి కూడా బతిమిలాడుతుంది. దీంతో సరే అమ్మ.. హాఫ్ డే వెళ్లమను అంటాడు. దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఆట గెలిచావు అని అంటాడు బసవయ్య. దీంతో ఇంకెక్కడ మామయ్య ఆట పూర్తవ్వలేదు కదా అంటే.. మిగితా ఆట నేను ఆడుతాను. గెలిచి చూపిస్తాను అంటుంది దివ్య. దివ్య, విక్రమ్ తమ్ముడు ఇద్దరూ కలిసి చెస్ ఆడుతారు. ఒకే ఒక్క స్టెప్ తో చెక్ మేట్ పెడుతుంది దివ్య. దీంతో అందరూ షాక్ అవుతారు.
మరోవైపు ఆఫీసులో నందును స్టాఫ్ ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. ఆఫీసులోకి నందు రాగానే.. రాజు తన పని తాను చేసుకెళ్తాడు. లాస్య చెప్పినట్టుగా నందు దగ్గరకు వెళ్లి తులసి తల్లి చావుకు మీరే కారణమని తులసి మేనేజర్ తో చెప్పిందట. దీంతో మేనేజర్ ఆ విషయాన్ని టామ్ టామ్ చేశాడు. స్టాఫ్ అందరికీ చెప్పాడు. అందుకే సాఫ్ట్ మీతో సరిగ్గా ఉండటం లేదు అంటాడు రాజ్. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు బసవయ్య.. లెక్కలు తప్పుగా రాసి రాజ్యలక్ష్మి నుంచి డబ్బులు కొట్టేస్తాడు. ఆ విషయం తన భార్యకు చెబుతుండగా దివ్య వింటుంది. అక్కడే డెస్క్ లో ఎవ్వరికీ తెలియకుండా డబ్బులు దాస్తాడు బసవయ్య. దీంతో తన తోటి కోడలును కూడా పిలిచి ఈ విషయం చెబుతుంది. అసలు మీరిద్దరూ మా నాన్న గది దగ్గర ఏం చేస్తున్నారు అని అడుగుతుంది జాను. ఏం లేదు.. మీ అమ్మ నాన్న చెమ్మ చెక్క ఆడుతుంటే చూస్తున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు తులసి దగ్గరికి వెళ్లిన నందు.. కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతాడు. దీంతో వెంటనే మేనేజర్ కు ఫోన్ చేసి తన క్యాబిన్ కు రావాలని చెబుతుంది. కోపంతో మేనేజర్ తో మాట్లాడుతుంది. నా క్యాబిన్ కు రావడానికి కనీసం డోర్ కొట్టి రావాలని కూడా తెలియదా? ఇలా డైరెక్ట్ గా వచ్చేస్తారా అంటూ సీరియస్ అవుతుంది తులసి. దీంతో నందుకు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
ఆ తర్వాత రాజుకు ఫోన్ చేసి లాస్య అన్ని విషయాలు కనుక్కుంటుంది. మీరు చెప్పింది చెప్పినట్టుగా చేశానని చెప్పుకొస్తాడు. దీంతో చాలా ఖుషీ అవుతుంది లాస్య. మరోవైపు ఓ వ్యక్తిని పిలిచి బసవయ్య కప్ బోర్డ్ లో పెట్టిన డబ్బును దొంగతనం చేయాలని చెబుతుంది దివ్య. తనకు తెలిసిన వ్యక్తే కావడంతో ఓకే అంటాడు ఆ వ్యక్తి.
మరోవైపు కోపంతో ఇంటికి వస్తుంది తులసి. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారు అత్తయ్య అని అడుగుతుంది తులసి. దీంతో వాడు పొద్దున నీతో పాటే ఆఫీసుకు వచ్చారు కదా. నీకు కలవలేదా అంటే.. ఏం అనుకుంటున్నారు ఆయన. బాధ్యత, పాడు లేదా? ఆఫీసులో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు. ఆ మాత్రం తెలియదా? చెప్పాపెట్టకుండా ఆఫీసు నుంచి మాయం అయ్యారు. అంత అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వస్తే నాతో ఒక మాట చెప్పాలి కదా అంటుంది తులసి.
ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అని అడుగుతుంది అనసూయ. దీంతో ఒక్కసారి కాదు.. ఆఫీసు వాళ్లు చాలా సార్లు చేశారు కానీ.. లిఫ్ట్ చేస్తే కదా అంటుంది తులసి. మరోవైపు నందు బారులో కూర్చొని ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. ఇంతలో కొందరు రౌడీలు వచ్చి ఎవడ్రా నువ్వు.. మా టేబుల్స్ మీద కూర్చున్నావు.. లే అంటే ఈ టేబుల్ మీద నీ పేరు రాసి ఉందా అని అంటాడు నందు. దీంతో నందును కొడతారు. ఆ తర్వాత రోడ్డు మీద నందు నడుచుకుంటూ వెళ్లడం చూసిన లాస్య.. తన కారులో నందును తులసి ఇంటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.