Categories: NewsTrendingTV Shows

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : దివ్యను కిడ్నాప్ చేయించిన రత్నప్రభ.. జాను కోసం దివ్యను చంపేస్తారా? తులసికి ఈ విషయం తెలిసి ఏం చేస్తుంది?

Advertisement
Advertisement

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 అక్టోబర్ 2023, శుక్రవారం ఎపిసోడ్ 1086 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలిసి తెలిసి పులి నోటికి మేకపిల్లను అందించమంటారా? అంటుంది తులసి. దీంతో వద్దు అలా చేయొద్దు. దాచిన మేకపిల్ల కోసం పులి మన మీద దాడి చేసేవరకు వెయిట్ చేద్దాం. మీకు నచ్చినట్టుగా చేసుకోండి. నాకు అంత తెలివి లేదు అంటూ కోపంతో నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు లాస్యకు రత్నప్రభ ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అంటే.. ఏ క్షణాన ఏం చేయాలని అనిపిస్తే అది చేస్తా అంటుంది లాస్య. ఇంట్లో వాళ్ల ప్రెజర్ మీద నిన్ను దూరం పెట్టా కానీ.. ఎప్పటికప్పుడు నీతో టచ్ లోనే ఉన్నా కదా అంటుంది. దివ్య విషయంలో మనం ఏం ప్లాన్ చేసుకున్నాం. వెంటనే అనుకున్నది జరిగిపోవాలి అంటుంది. దీంతో ఓకే.. అది వెంటనే జరిగిపోతుంది అంటుంది లాస్య. మరోవైపు జానును తన తల్లిదండ్రులు తిడతారు. నువ్వు ఏ ప్లాన్ వేసినా అస్సలు అది వర్కవుట్ కాదు. తాగించి వాడితో పాటు గదిలో దూరిన రోజు అంతే. ఇంకేముంది శోభనం అయిపోయినట్టే అనుకున్నాం. చివరికి మా గాలి తీశావు అంటుంది జాను తల్లి. మాకు సిగ్గు లేదు కాబట్టి సరిపోయింది.. ఆ రోజు జరిగిన అవమానానికి ఏనాడో రైలు కింద తల పెట్టి చనిపోవాల్సింది అంటాడు జాను తండ్రి.

Advertisement

నీ చేతి మీద విక్రమ్ అనే పచ్చబొట్టు కనబడగానే చాలా సంతోషించాం. నా కూతురును ఇక ఈ ఇంటి కోడలు కాకుండా ఎవ్వరూ ఆపలేరు అని అనుకున్నాం. కానీ.. అంతా ఆగమాగం చేశావు. నువ్వు నన్ను మోసం చేశావు. అంతా చిన్నపిల్లల ఆట అయింది. వదినకు ఫోన్ చేసి జరిగిన గొడవ అంతా చెప్పేశాను అంటుంది. ఇంతలో రాజ్యలక్ష్మి నుంచి జాను వాళ్ల నాన్నకు ఫోన్ వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటా అని భరోసా ఇస్తుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. మరోవైపు విక్రమ్ తో మాట్లాడుతుంది దివ్య. విక్రమ్ బెడ్ షీట్ సరిచేస్తుండగా ఏంటి విక్రమ్.. నువ్వు ఏం పని చేస్తున్నావు అంటుంది. దీంతో ఊరికే చేస్తున్నా అంటుంది. నువ్వు చేసిన హెల్ప్ మరిచిపోలేకపోతున్నాను. నువ్వు నన్ను జాను నుంచి రక్షించావు. ఒకవేళ ఆ పచ్చబొట్టు ఉత్తదే అని తేలకపోయి ఉంటే ఏం జరిగేది అంటూ టెన్షన్ పడతాడు. దీంతో ఏం జరిగేది.. జాను నీకు రెండో భార్య అయ్యేది అంటుంది. నువ్వు జానుకు తాళి కట్టు అన్నా కట్టేసేవాడివి. అందుకే నా కాపురాన్ని నేను నిలబెట్టుకున్నాను అంటుంది దివ్య.

Advertisement

Intinti Gruhalakshmi 27 Oct Today Episode : దివ్య హెల్ప్ కోసం కాల్ చేసిన నందు

మరోవైపు దివ్యకు కాల్ చేస్తాడు నందు. నీ హెల్ప్ కోసం ఫోన్ చేశాను అంటాడు. ఈ విషయం నీ దాకా తీసుకురాకూడదు అనుకున్నాను కానీ.. చెప్పక తప్పడం లేదు. సామ్రాట్ పోయాక ఆయన ఇంటి పరిస్థితులు ఏం బాగోలేవు. హనీని అడ్డం పెట్టుకొని సామ్రాట్ కజిన్ అమెరికా నుంచి వచ్చి తనను ఇబ్బంది పెడుతున్నాడు. హనీ కోసం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. హనీని వెనక్కి పంపే ప్రసక్తే లేదంటోంది. తాతయ్య, నానమ్మ కూడా మీ అమ్మకే వత్తాసు పలుకుతున్నారు. హనీని తిరిగి పంపించమని నువ్వే మీ అమ్మకు నచ్చజెప్పాలి అంటాడు నందు.

దీంతో నేను ఆలోచించి చెబుతాను అంటుంది దివ్య. దీంతో అదేంటి దివ్య.. మీ నాన్న అంతలా నీకు ఫోన్ చేసి అడిగితే నువ్వేంటి అంత సింపుల్ గా చెబుతున్నావు అంటాడు విక్రమ్. ఇంతలో అక్కడికి జాను తండ్రి వచ్చి నేను మీ మాటలు అక్కడి నుంచి విన్నాను.. అంటాడు. సంబంధం లేని విషయంలో మీ అమ్మ తలదూర్చి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేస్తోంది అంటాడు.

నీ అభిప్రాయాన్ని మీ నాన్నకు చెప్పకుండా దాచడం అవసరమా? ఆయన ప్రమాదంలో ఉండే కదా నీ హెల్ప్ అడిగింది. అంత ఈజీగా ఎందుకు తీసుకుంటున్నావు. అత్తయ్య గారితో మాట్లాడు దివ్య అంటుంది. బాబాయి మీరు ఏదో పని మీద వచ్చినట్టున్నారు అంటే.. అవును అమ్మ పని మీద వచ్చాను. అక్కయ్య కాల్ చేసింది. తిరిగి రావడానికి ఇంకో రెండు రోజులు పడుతుందట అని చెబుతాడు.

మరోవైపు నాకే ఎందుకు ఈ కష్టాలు.. ఎందుకు ఇన్ని పరీక్షలు. మున్ముందు ఏం జరుగుతుందో అని టెన్షన్. నువ్వు నా వెనుక ఉంటావనే తెగించి ముందుకు వెళ్తున్నాను. హనీ సంగతి నేను చూసుకుంటాను కానీ.. నా కుటుంబంలో ఎవ్వరికీ ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాత్రం నీదే. నందు నిలదీస్తూ అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు.

నా మనసులో ఉంది.. చేయాలని అనుకున్నది ఒక్కటే. హనీకి అండగా ఉండటం, సామ్రాట్ గారు లేని లోటు తీర్చుకోవడం, నా ప్రయత్నంలో విఫలం కాకుండా దీవించు స్వామీ. ఇంతకంటే నేను ఇంకేం కోరుకోను అంటుంది తులసి. మరోవైపు రౌడీలు అందరూ రోడ్డు మీద కాపు కాస్తారు. దివ్యను కిడ్నాప్ చేయడం కోసం ప్లాన్ చేస్తారు.

ఇంతలో కారు వస్తుంటుంది. కారును అడ్డగించి అందులో ఉన్న దివ్యను కిందికి దింపుతారు. దివ్యను లాక్కొచ్చి మరీ తమ కారులో వేసి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. దీంతో ఆ కారు డ్రైవర్ కు ఏం చేయాలో అర్థం కాదు.

కట్ చేస్తే బావా నీతో మాట్లాడాలి.. లోపలికి రావచ్చా అంటే.. దివ్య లేనప్పుడు నువ్వు ఈ రూమ్ లోకి రావద్దు అంటాడు విక్రమ్. నేను తప్పు చేశాను అంటే.. తప్పు కాదు.. తప్పులు చేశావు అంటాడు విక్రమ్. నిన్ను చెడగొట్టినట్టు అయింది. నమ్మకం సంపాదించుకోవడం చాలా కష్టం. పోగొట్టుకోవడం చాలా తేలిక. నీ మీద నాకు ఎలాంటి నమ్మకం, ఇష్టం లేదు.. అని డైరెక్ట్ గా చెప్పేస్తాడు విక్రమ్.

నాకు చచ్చిపోవాలనిపిస్తోంది బావ అంటే.. అందులో నాకు నిజాయితీ ఉన్నట్టు అనిపించడం లేదు. ఫేక్ టాటూలా అనిపిస్తోంది. దేవుడు జీవితాన్ని ఇచ్చింది సుఖంగా బతకమని.. అంతే కానీ.. ఇంకొకరు జీవితాన్ని లాక్కొని బతకమని కాదు. బుద్ధిగా బతుకు. లోపలికిరా అంటాడు విక్రమ్.

ఇంతలో విక్రమ్ బాబు అంటూ దివ్య కారు డ్రైవర్ ఇంటికి వస్తాడు. దివ్యను కిడ్నాప్ చేసిన విషయం చెబుతాడు. వాళ్లు ఇచ్చిన ఉత్తరం ఇస్తాడు. దివ్యను కిడ్నాప్ చేశాం. తులసి, హనీని మాకు అప్పగిస్తేనే దివ్య మీకు దక్కుతుంది. లేకపోతే ప్రాణాలతో ఉండదు.. అని అందులో రాసి ఉంటుంది.

చెప్పానా.. తులసి చేస్తుంది తప్పు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటోంది అని అంటాడు జాను తండ్రి. దివ్యను కిడ్నాప్ చేశారని తెలియగానే విక్రమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. నాకు తెలిసి ఈ సమస్యకు పరిష్కారం మన చేతుల్లో లేదు. తులసి ఆంటి చేతుల్లో ఉంది. ముందు ఆంటి దగ్గరికి వెళ్లి మాట్లాడు బావ అంటుంది జాను.

దీంతో అవును.. అదే కరెక్ట్ అని తులసి దగ్గరికి వెళ్తాడు విక్రమ్. మరో వైపు అక్కయ్య నువ్వు పెట్టిన నిప్పు బాగానే మండుతోంది అని అనుకుంటారు. మరోవైపు తులసి ఇంటికి వచ్చిన విక్రమ్ కు చాలా కోపం వస్తుంది. తులసికి లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ చదివి షాక్ అవుతుంది. మరోవైపు రత్నప్రభ, లాస్య ఇద్దరూ చెస్ ఆడుతూ ఉండగా అక్కడికి పోలీసులను తీసుకొని వచ్చి లాస్యను అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Raviteja : విలన్ పాత్రలకు రెడీ అంటున్న మాస్ రాజా..!

Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…

3 hours ago

Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల కోసం PM E-డ్రైవ్ పథకం ప్రారంభం..!

Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (PM E-డ్రైవ్)…

4 hours ago

TGSRTC : జాబ్ నోటిఫికేషన్.. నెలకు 50 వేల జీతంతో ఉద్యోగాలు..!

TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…

5 hours ago

Jr NTR : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఎన్టీఆర్ కలుస్తున్నాడు..!

Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…

6 hours ago

Ganesh Nimajjanam : గణేష్ నిమజ్జనాలు.. పోలీసుల కీలక రూల్స్ ఇవీ.. పాటించకపోతే అంతే సంగతులు..!

Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…

7 hours ago

Revanth Reddy : కేసీఆర్ లక్కీ నంబర్ నా దగ్గర ఉంది.. నన్నేం చేయలేరన్న రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…

8 hours ago

Shekar Basha : బిగ్ బాస్ నుండి అనూహ్యంగా శేఖ‌ర్ భాషా బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణం ఇదేనా?

Shekar Basha : బిగ్‌బాస్ తెలుగు 8 స‌క్సెస్ ఫుల్‌గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…

9 hours ago

Liquor : మందు బాబుల‌కి కిక్కే కిక్కు.. ఇక రానున్న రోజుల‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌దు..!

Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…

10 hours ago

This website uses cookies.