Home » News » Jabardasth Faima Rejected Praveen
News

Jabardasth Faima : ప్రవీణ్ ని మోసం చేసిన ఫైమా.. ఫైనల్ గా అతడిని రిజెక్ట్ చేసిందా..??

Authored By
aruna
The Telugu News | Updated on: October 31, 2023 4:51 pm
Advertisement

Jabardasth Faima : బుల్లితెరపై పలు ఎంటర్టైన్మెంట్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రవీణ్, ఫైమా. జబర్దస్త్ షోలో కూడా తమ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఉన్న వీడియోలు షేర్ చేశారు. దీంతో ప్రవీణ్, ఫైమా పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఇక ప్రవీణ్ కూడా ఫైమాతో ప్రేమలో పడినట్లు పలు టీవీ స్టేజీల పైన చెప్పాడు. అప్పుడు కూడా ఫైమా వ్యతిరేకత చెప్పలేదు. అవన్నీ ఆడియన్స్ ని అలరించేందుకు చేసిన స్క్రిప్టులు అనుకున్నా, వాళ్ళ సొంత యూట్యూబ్ ఛానల్ లో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియోలు కూడా చేశారు.

Advertisement

చివరికి పైమా వాళ్ళ ఇంటికి ప్రవీణ్ పలుమార్లు వెళ్ళాడు. ఆ సమయంలో ఫైమా తల్లి గారిని అత్తయ్యా అని పిలిచేవాడు. అంత సన్నిహిత్యం ఆమె కుటుంబంతో ప్రవీణ్ కి ఉంది. దీంతో వారిద్దరు నిజంగానే పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాలన్నింటిపై ప్రవీణ్ క్లారిటీ ఇచ్చాడు. ఫైమా తో ప్రేమ అనేది ఫ్రెండ్షిప్ తో ప్రారంభమైంది. నా జర్నీ మొదటి నుంచి తను నాతోనే ఉంది. అందుకే ప్రేమిస్తున్నానని చెప్పాను. దానికి ఆమె నో చెప్పింది. ఆమె నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. అంతేకాకుండా ఆమె నో చెప్పిందని తనకు నేను ఎప్పుడు దూరంగా లేను. ప్రేమ లేకపోయినా ఫ్రెండ్స్ గా ఉందామని అనుకున్నా. ఒక మంచి ఫ్రెండ్ గా ఆమె వెంట ఎప్పుడూ ఉంటాను. కానీ ఆమె నా ప్రేమను అంగీకరించలేదని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఒకానొక సమయంలో బాగా ఏడ్చేశాను అని చెప్పాడు.

ప్రస్తుతం నా ఫ్యామిలీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయాకే మా అప్పులు తెలిసాయి. వాటిని తీర్చేందుకు కష్టపడుతున్నాను. ఒకవేళ భవిష్యత్తులో ఫైమా నా ప్రేమను చెబితే ఆమెను తప్పకుండా అంగీకరిస్తాను అని ప్రవీణ్ తెలిపాడు. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫైమాలో చాలా మార్పులు వచ్చాయని, ఆ షో ద్వారా ఆమెకు మంచి గుర్తింపు రావడంతో ప్రవీణ్ ను పక్కన పెట్టేసిందని వార్తలు వచ్చాయి. వాటికి ప్రవీణ్ రియాక్ట్ అయ్యాడు. బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక పైమా బాగా హర్ట్ అయింది. మొదట కొద్ది రోజులు ఎవరితో మాట్లాడలేదు. ఆ తర్వాత నాతో బాగానే మాట్లాడింది అని అన్నాడు. అయితే ప్రవీణ్ పైమా ను మోసం చేసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రవీణ్ ఆ విషయం చెప్పకుండా తను మాత్రమే ప్రేమించానని ఆమె ప్రేమించలేదని చెబుతూ ఫైమాను సేఫ్ చేస్తున్నాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి