Categories: NewsTV Shows

Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న జాతకం చెప్పిన పంతులు.. రహస్యం బయటపడుతుందా?..దీపకు బిడ్డపై హెచ్చరిక..!

Advertisement
Advertisement

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 19 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్పిటల్‌కు తీసుకొచ్చిన జ్యోత్స్న బ్లడ్ సాంపిల్స్ ఇవ్వనంటూ గట్టిగా తిరస్కరించడంతో కథ మలుపు తిరిగింది. టెస్టులంటే భయం అని బ్లడ్ చూస్తే కళ్లు తిరుగుతాయని జ్యోత్స్న, పారిజాతం చెప్పినా ఆమె వణుకు చూసి డాక్టర్‌కు అనుమానం వస్తుంది. అందరూ బయట ఉంటే భయం తగ్గుతుందన్న పారిజాతం బయటకు వెళ్లిపోతుంది. డాక్టర్ ప్రశ్నలకు జ్యోత్స్న సమాధానం చెప్పలేక పోవడంతో కార్తీక్ మరింత కచ్చితంగా నిలదీస్తాడు. మీరు నిజంగా సుమిత్ర కూతురేనా? అన్న డాక్టర్ మాటలు జ్యోత్స్నను షాక్‌కు గురి చేస్తాయి. కార్తీక్ కూడా సరదాగా కాదు భయం నిజమవుతుందేమో అన్నట్టుగా మాట్లాడటంతో జ్యోత్స్నలో టెన్షన్ పెరుగుతుంది. చివరికి డాక్టర్ కార్తీక్‌ను బయటకు పంపిస్తుంది. ఆ సమయంలో జ్యోత్స్న ముఖంలో కనిపించిన భయం దాచిన రహస్యాలపై అనుమానాలను పెంచుతుంది.

Advertisement

Karthika Deepam 2 Today Episode: జ్యోత్స్న జాతకం చెప్పిన పంతులు.. రహస్యం బయటపడుతుందా?..దీపకు బిడ్డపై హెచ్చరిక..!

Karthika Deepam 2 Today Episode: శివ నారాయణ ఆందోళన.. పంతులు ప్రవేశం

మరోవైపు ఇంట్లో శివ నారాయణ మనసు కలవరపడుతుంది. కాంచన చెప్పిన మాటలు గుర్తొచ్చి తన కొడుక్కి కూడా తనలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయపడతాడు. దీప వచ్చి ధైర్యం చెబుతూ డాక్టర్లు చెప్పినట్లే అమ్మను కాపాడేది ఆమె కూతురేనని గుర్తు చేస్తుంది. అయినా శివ నారాయణ మనసుకు శాంతి లభించదు. పంతులు గారిని పిలిపించడంతో ఇంట్లో వాతావరణం మరింత గంభీరంగా మారుతుంది. జరిగిన హోమం, పూర్ణాహుతి గురించి మాట్లాడుతూ..కర్మ సిద్ధాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని పంతులు చెబుతాడు. ఆ సమయంలో జ్యోత్స్న వచ్చి మాటలతో దీపను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కార్తీక్ అడ్డుపడతాడు. జ్యోత్స్న అసహనంగా ప్రవర్తించడంతో ఆమెకు ఏదో దాచిన బాధ ఉందని కార్తీక్ పంతులను జాతకం చూడమని కోరుతాడు. పంతులు జ్యోత్స్న ముఖం చూసి సాలెగూడులో చిక్కుకున్నట్టు ఇబ్బంది పడుతున్నావు. కానీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడతావు. అయితే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి ఉంది. రాబోయే కాలం మరింత కఠినంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తాడు. ఈ మాటలు జ్యోత్స్నను మరింత కలవరానికి గురి చేస్తాయి.

Advertisement

Karthika Deepam 2 Today Episode: దీపకు బిడ్డపై హెచ్చరిక.. భవిష్యత్తు సంకేతాలు

మరోవైపు దీప గర్భవతి కావడంతో ఆమె భవిష్యత్తు గురించి కార్తీక్ అడగగానే పంతులు కీలకమైన జాతకం చెబుతాడు. నీకు కావలసినదాన్ని పొందాలంటే నువ్వు కోరుకున్నదే వదులుకోవాల్సి వస్తుంది. కొంత ఇబ్బంది ఉన్నా చివరికి నీకు శుభమే జరుగుతుంది. సంచార జీవిలా ఉన్న నువ్వు ఒక రోజు సొంత గూటికి చేరుతావు అని అంటాడు. పారు మధ్యలో మాట్లాడి దీపకు సొంత గూడు అంటే పుట్టిల్లు కదా కానీ ఆమెకు కన్నవాళ్లు ఎవరో తెలియదని చెప్పగా పంతులు కలవాలని రాసి ఉంటే తప్పక కలుస్తారు. అదే కర్మ సిద్ధాంతం అంటూ స్పష్టం చేస్తాడు. చివరగా శివ నారాయణను ఉద్దేశించి సుమిత్రతో ఉన్న గండం పూర్తిగా తొలగిందని చెప్పలేను. కాస్తా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా దీపతో పాటు బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడిపై నమ్మకం ఉంచండి అంటూ హెచ్చరిస్తాడు. ఇక హాస్పిటల్‌లో కార్తీక్ ఒత్తిడితో జ్యోత్స్న బ్లడ్ సాంపిల్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఎలా తప్పించుకోవాలో అర్థం కాక ఆమెలో భయం మరింత పెరుగుతుంది. రిపోర్ట్స్ త్వరగా వచ్చేలా చూడమని దశరథ్‌కు శివ నారాయణ చెప్పడంతో ఎపిసోడ్ ఉత్కంఠతో ముగుస్తుంది. జ్యోత్స్న రహస్యం బయటపడుతుందా? దీపకు వచ్చిన హెచ్చరిక కథను ఎటు తీసుకెళ్తుందో అన్న ఆసక్తిని ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో పెంచింది.

Recent Posts

Dwakra womens : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం..ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా…

38 minutes ago

Today Gold Rate 19 January 2026 : వామ్మో మళ్లీ కొండెక్కిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో…

2 hours ago

Super Foods : ఖర్చు తక్కువ లాభం ఎక్కువ అనేలా ఈ సూపర్ ఫుడ్స్‌.. నిజంగా ఆరోగ్యానికి ఖజానాలే అవేంటో తెలుసా?

Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్‌లు విదేశీ సూపర్ ఫుడ్స్‌ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది.…

3 hours ago

Ratha Saptami 2026 : రథ సప్తమి ఎప్పుడు జరుపుకుంటారు?.. ఈసారి రథ సప్తమి ఎప్పుడొచ్చింది?

Ratha Saptami 2026: సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. సమస్త లోకాలకు వెలుగును శక్తిని అందించే…

4 hours ago

Chicken with skin vs without skin : చికెన్ స్కిన్ తో తినాలా?.. స్కిన్ లేకుండా తినాలా.. ఏది బెస్టో మీకు తెలుసా..?

Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…

5 hours ago

Zodiac Signs : జ‌న‌వ‌రి 19 సోమ‌వారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…

6 hours ago

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ట్వీట్ వైసీపీ కి షాక్, కూటమికి ప్లస్..!

Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…

12 hours ago

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…

15 hours ago