
Karthika Deepam 2 March 28th 2026 Episode : ఆస్తి నాకొద్దు అన్న దీప.. జ్యోత్స్న, పారిజాతానికి కార్తీక్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్!
Karthika Deepam 2 March 28th 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజుకో సరికొత్త మలుపుతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీప, కార్తీక్ ల మధ్య బంధం, జ్యోత్స్న కుట్రలు, దశరథ వేస్తున్న ఎత్తుగడలతో కథ ఉత్కంఠభరితంగా సాగుతోంది. నేడు (మార్చి 28) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆస్తి కోసం దశరథ రాసిన వీలునామా, జ్యోత్స్నకు దీప ఇచ్చిన కౌంటర్, పారిజాతాన్ని ఇరికించడానికి కార్తీక్ వేసిన స్కెచ్.. ఇలా అడుగడుగునా ఉత్కంఠగా సాగిన నేటి ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం..
Karthika Deepam 2 March 28th 2026 Episode : ఆస్తి నాకొద్దు అన్న దీప.. జ్యోత్స్న, పారిజాతానికి కార్తీక్ మైండ్ బ్లోయింగ్ స్కెచ్!
ఎపిసోడ్ ప్రారంభంలోనే దీప, జ్యోత్స్న మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. దీపను టార్గెట్ చేస్తూ జ్యోత్స్న రెచ్చిపోతుంది. “నేను ఎంత గెలవాలని ఆడినా.. అది నాకు సొంతమయ్యేలోపు నువ్వు దాన్ని గెలుచుకుని వెళ్లిపోతున్నావు దీప. ఆట ఎలా ఆడాలో తెలిసిన నీలాంటి దాని ముందు, తెలివైన నాలాంటిది ఓడిపోతూనే ఉంది” అని జ్యోత్స్న కోపంగా అంటుంది. దానికి దీప చాలా కూల్‌గా, అంతే స్ట్రాంగ్‌గా బదులిస్తుంది. “నువ్వు ఆటను గెలవాలని ఆడతావు.. కానీ నేను నా వాళ్లను, నా కుటుంబాన్ని గెలిపించాలని ఆడతాను. అందుకే నేను గెలుస్తున్నాను” అని దీప ధీటుగా సమాధానం ఇస్తుంది. దీంతో రగిలిపోయిన జ్యోత్స్న.. “నీకు భయం లేదని తెలుసు దీప.. కానీ నీకు భయం రప్పిస్తా. భయం చాలా విలువైనది, దానితో ఆడుకోకూడదు” అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు దీప మరింత ఘాటుగా కౌంటర్ వేస్తుంది.. “అమ్మానాన్నలు నీ పెళ్లి చూడాలని ఎన్నో కలలు కంటున్నారు. నువ్వు ఈ చిన్నపిల్లల ఆటలు ఆపేసి, ముందు పెళ్లి చేసుకుంటే.. నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ మనశ్శాంతి నీకు దొరుకుతుంది. ముందు పెళ్లి గురించి ఆలోచించు” అని జ్యోత్స్న నోరు మూయిస్తుంది.
మరోవైపు స్వప్న కోసం దాసు తీసుకున్న నిర్ణయం కాశీకి తీవ్ర కోపాన్ని తెప్పిస్తుంది. స్వప్నకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయడంతో దాసుపై కాశీ ఫైర్ అవుతాడు. “నేను ఇంత కష్టపడుతున్నది, ఇక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నది స్వప్న కోసమే కదా. అలాంటిది నువ్వు వేరే సంబంధం తీసుకువస్తే, స్వప్న ఓకే అనకుండా ఎలా ఉంటుంది? నా బతుక్కి అర్థం లేకుండా చేశారు” అని కాశీ ఆవేదన చెందుతాడు. అప్పుడు దాసు అసలు నిజం చెబుతాడు. “ఇదంతా నీ మంచి కోసమేరా. నీ మీద ఉన్న కోపంతోనే స్వప్న ఆ పెళ్లికి సరే అంది కానీ, తనకి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదు. విడాకుల కాగితాలపై సంతకం చేసిన తర్వాత నువ్వు కనిపించకుండా పోయి ఉంటే.. తను బాధపడేది. కానీ నువ్వు కళ్ల ముందే ఉన్నావు. ఇలాగే ఉంటే మీ ఇద్దరూ కలవలేరు. స్వప్నలో ఉన్న ప్రేమను బయటకు తీసుకురావడానికే ఈ నాటకం ఆడుతున్నాను” అని కొడుక్కి సర్దిచెబుతాడు. సరిగ్గా అప్పుడే దాసుకు కార్తీక్ కాల్ చేస్తాడు. “మామయ్యా.. ఈ సారి ఒక మంచి పని చేయాలి. కొంతమందిని దారిలోకి తీసుకురావాలంటే ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించాలి. ఇక శంఖం పూరించు మామయ్యా” అని పారిజాతాన్ని ఆడుకోవడానికి దాసుతో కలిసి కార్తీక్ ఓ పెద్ద స్కెచ్ వేస్తాడు.
దశరథ రాసిన వీలునామా Veelunama కండిషన్ల గురించి ఆలోచిస్తూ జ్యోత్స్న సీరియస్‌గా ఉంటుంది. అప్పుడు పారిజాతం జ్యూస్ తీసుకువచ్చి వెటకారం మొదలుపెడుతుంది. “ఇదంతా మీ అమ్మానాన్న వేసిన స్కెచ్ లా ఉంది. నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే ఆ ఆస్తి మొత్తం నీకే కదా వస్తుంది” అని అంటుంది. దానికి జ్యోత్స్న మండిపడుతూ.. “15 నెలల గడువులోపు పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడానికి నేనేమైనా మెషిన్‌నా?” అని కోప్పడుతుంది. అయితే కార్తీక్, దీపలను ఇంట్లోంచి గెంటేయడానికే బావ సడెన్‌గా ఈ అగ్రిమెంట్ టాపిక్ తీసుకువచ్చాడేమో అని జ్యోత్స్న అనుమానం వ్యక్తం చేస్తుంది. వీలునామా మార్పించడానికి ఇదొక ఎత్తుగడ అంటుంది. కానీ పారిజాతం మాత్రం జ్యోత్స్నను పెళ్లి చేసుకోమని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేస్తుంది.
వీలునామా విషయంలో దశరథ తీసుకున్న నిర్ణయంపై దీప, కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేస్తారు. “మాకు ముందు చెప్పకుండా ఏంటి మామయ్యా ఈ నిర్ణయం? ఆస్తి మాకు రాయడం ఏంటి? జ్యోత్స్నను అలా రెచ్చగొట్టడం దేనికి?” అని కార్తీక్ నిలదీస్తాడు. అప్పుడు దశరథ ఎమోషనల్ అవుతూ తన మనసులోని మాటను బయటపెడతాడు. “ఒక తండ్రిగా, భర్తగా నేను ఎంత నలిగిపోతున్నానో నాకే తెలుసు. జ్యోత్స్న నా అసలైన కూతురు కాదని చెప్పి బయటకు గెంటేయొచ్చు కదా అనిపించింది. కానీ చిన్నప్పటి నుంచి నా కూతురు అని పెంచుకున్నాను. ఆమెను వదులుకోలేను, అలాగని నా భార్య సుమిత్ర కోరిక కాదనలేను. అన్నింటికంటే ముఖ్యంగా నా సొంత కూతురికి (దీపకు) న్యాయం చేయాలి. అందుకే ఈ మూడు విషయాలు ఆలోచించి ఇలా వీలునామా రాశాను” అని అంటాడు. అప్పుడు దీప మాట్లాడుతూ.. “జ్యోత్స్న పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నా, కనకపోయినా ఆ ఆస్తి తనకే ఇచ్చేయ్ నాన్న. ఆస్తుల కోసం నేను మనుషుల్ని వదులుకోలేను” అని తేల్చి చెబుతుంది. ఇది అర్థం కాక జ్యోత్స్న తప్పుల మీద తప్పులు చేస్తోందని, రేపు తనను చంపడానికైనా వెనుకాడదని దశరథ భయపడతాడు. “నువ్వు (దీప) ఉండాల్సిన స్థానంలో జ్యోత్స్న ఉంది. నిన్ను అనాథ, పనిమనిషి అంటుంటే తట్టుకోలేకపోతున్నాను. నాకేమైనా జరిగినా ఆస్తి మీకే దక్కాలని ఇలా చేశాను” అని దశరథ కన్నీళ్లు పెట్టుకుంటాడు. “నువ్వు ఈరోజు అంత రెచ్చగొట్టినా జ్యోత్స్న సైలెంట్ గా ఉందంటే.. తను పెద్ద ప్లాన్‌లోనే ఉంది” అని కార్తీక్ హెచ్చరిస్తాడు.
రాత్రి సమయంలో వీలునామా గురించి కాంచన, కార్తీక్, దీపలతో చర్చిస్తుంది. “అన్నయ్య వీలునామాలో జ్యోత్స్న కండిషన్ నెరవేర్చకపోతే.. ఆస్తి మేనల్లుడి కుటుంబానికి అని రాశాడు కానీ, చెల్లెలి కుటుంబానికి అని ఎందుకు రాయలేదు? అంటే ముఖ్యంగా ఆస్తి నీ భార్య, పిల్లలకు (దీపకు) చెందేలా ఎందుకు రాశాడు?” అని కాంచన లాజికల్ పాయింట్ లాగుతుంది. దానికి కార్తీక్ చాలా కూల్‌గా.. “జ్యోత్స్నకు బుద్ధి వచ్చి పెళ్లి చేసుకుంటే మనమంతా హ్యాపీనే కదా అమ్మా” అని అసలు విషయం దాటవేస్తాడు.
మొత్తానికి దశరథ వీలునామా ఇంట్లో పెద్ద చిచ్చునే రగిల్చింది. మరి దాసు సాయంతో కార్తీక్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? పారిజాతాన్ని కార్తీక్ ఎలా బురిడీ కొట్టించబోతున్నాడు? కాశీ ప్రేమను స్వప్న అర్థం చేసుకుంటుందా? ఆస్తి కోసం జ్యోత్స్న నెక్స్ట్ వేయబోయే అడుగు ఏంటి? అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
This website uses cookies.