Home » News » Karthika Deepam 2 March 30th 2026 Today Monday Episode Highlights
News

Karthika Deepam 2 March 30th 2026 Episode : సుమిత్ర కన్నకూతురు దీపనే అని తెలుసుకున్న జ్యోత్స్న.. తన మనవరాలిని హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన పారిజాతం!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 30, 2026, 8:30 am
Advertisement

Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బ్లాక్ బస్టర్ సీరియల్ ‘కార్తీకదీపం 2’ Karthika Deepam 2. రోజుకో సరికొత్త మలుపుతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సీరియల్ దూసుకుపోతోంది. ముఖ్యంగా గత కొన్ని ఎపిసోడ్స్‌గా దీప గతం, ఆమె అసలు తల్లిదండ్రులు ఎవరు అనే విషయంపై నడుస్తున్న డ్రామా తారాస్థాయికి చేరుకుంది. మార్చి 30వ తేదీ ప్రసారం కానున్న 631వ ఎపిసోడ్‌లో ఎవరూ ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు చోటు చేసుకున్నాయి. దీపే సుమిత్ర కూతురని జ్యోత్స్నకు తెలియడం, దీప తన సొంత మనవరాలు అని పారిజాతానికి తెలియడంతో కథ పూర్తిగా మలుపు తిరిగింది. మరి ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్‌లో Karthika Deepam 2 March 30th Episode ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Karthika Deepam 2 March 30th 2026 Episode : సుమిత్ర కన్నకూతురు దీపనే అని తెలుసుకున్న జ్యోత్స్న.. తన మనవరాలిని హత్తుకుని గుండెలు పగిలేలా ఏడ్చిన పారిజాతం!

Karthika Deepam 2 March 30th 2026 Episode జ్యోత్స్న బుద్ధి పారిజాతానిదే అన్న కార్తీక్ – కాంచన షాకింగ్ కామెంట్స్

ఎపిసోడ్ ప్రారంభంలో కార్తీక్, తన తల్లి కాంచనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆస్తి కోసం జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుందని, ఆమె అసలు స్వరూపం గురించి వివరిస్తాడు. “అమ్మా.. మావయ్య వీలునామాలో ఆ క్లాజ్ పెట్టకుండా ఉంటే, జ్యోత్స్న ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ, ఆ పారు (పారిజాతం)తో కలిసి ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది” అని కార్తీక్ అంటాడు. ఆస్తులు అనగానే ఆకాశం అంతా సంబరపడిపోయే జ్యోత్స్న, వాళ్లింట్లో పాతచీర కూడా వేరే వాళ్ళకి దక్కకూడదని అనుకుంటుందని కార్తీక్ ఎద్దేవా చేస్తాడు. “అసలు ఇవన్నీ చూస్తుంటే జ్యోత్స్న అసలు మా అన్నయ్య కూతురేనా అనిపిస్తుంది. దాని బుద్ధులన్నీ పారిజాతం పిన్నిలాగే ఉంటాయి” అని కాంచన అంటుంది. అంతేకాకుండా, “మొన్న హాస్పిటల్‌లో బిడ్డల్ని మార్చేసినట్లు ఓ వార్త చూశాను.. జ్యోత్స్న కూడా అలాగే మారిపోయిందేమో” అని కాంచన అనడంతో కార్తీక్, దీపలు ఒక్కసారిగా షాక్ అవుతారు. (కాంచన సరదాగా అన్నప్పటికీ, అదే నిజం కావడం ఇక్కడ కొసమెరుపు). అయితే, “అయినా మా వదిన బతికింది దాని వల్లే కాబట్టి సరిపోయింది.. కానీ దాని బుద్ధి మాత్రం చాలా చెండాలం” అని కాంచన అంటుంది. దీనికి కార్తీక్ బదులిస్తూ.. “ఆ గంజాయి మొక్కని తులసి మొక్కగా నేను మారుస్తాను” అని ధీమాగా చెబుతాడు.

Advertisement

Karthika Deepam 2 March 30th 2026 Episode నిజం తెలుసుకుని షాకైన జ్యోత్స్న.. సుమిత్ర కూతురు దీపనే

మరోవైపు, ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వస్తుంది. హాస్పిటల్ నుంచి జ్యోత్స్నకు డీఎన్ఏ రిపోర్ట్స్ అందుతాయి. ఆ రిపోర్ట్స్ తెరిచి చూసిన జ్యోత్స్న గుండె ఆగినంత పని అవుతుంది. సుమిత్ర బ్లడ్ శాంపిల్స్, ‘దీప’ అనే ఆవిడతో నూటికి నూరు శాతం మ్యాచ్ అయ్యాయని ఆ రిపోర్ట్స్ ద్వారా జ్యోత్స్న తెలుసుకుంటుంది. అంటే, సుమిత్ర కన్నకూతురు దీపనే అని ఆమెకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నిజం తట్టుకోలేక జ్యోత్స్న షాక్‌లో ఉండిపోతుంది. సరిగ్గా అదే సమయానికి పారిజాతం అక్కడికి వస్తుంది. జ్యోత్స్న చేతిలో కవర్ చూసి, “ఈ రిపోర్ట్స్ ఏంటీ? ఇప్పుడు వచ్చింది ఎవరు?” అని నిలదీస్తుంది. వెంటనే తేరుకున్న జ్యోత్స్న అబద్ధం ఆడుతుంది. “మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి కదా? నేను సీఈవోగా ఉన్నప్పుడు పని చేసిన ఒక సూపర్‌వైజర్.. నాకు చాలా నమ్మిన బంటు. అతను ఏదో కష్టాల్లో ఉంటే సాయం చేశాను” అని కవర్ చేస్తూ పారిజాతాన్ని నమ్మిస్తుంది.

పారిజాతానికి దిమ్మతిరిగే నిజం చెప్పిన దాస్

జ్యోత్స్న అక్కడ నుంచి వెళ్లిన వెంటనే పారిజాతంకు దాస్ ఫోన్ చేస్తాడు. “పారిజాతం.. దీపే సుమిత్ర కూతురు. నేను అనుకున్నదే నిజమని తేలింది” అని బాంబ్ పేలుస్తాడు. దాస్ చెప్పిన మాటలు విన్న జ్యోత్స్న (చాటుగా వింటూ), డాక్టర్‌ను వీళ్లు మేనేజ్ చేసి అబద్ధం చెప్పించారని అనుకుంటుంది. “ఈ నిజం డాడీకి తెలుసా? తెలిసే వీలునామా మార్చి రాయించాడా? అది కూడా తెలిస్తే వీళ్లందరినీ ఏం చేయాలో నాకొక క్లారిటీ వస్తుంది” అని తనలో తాను రగిలిపోతూ మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

Advertisement

ఆ తర్వాత, కంగారుగా దాస్ దగ్గరికి వెళ్లిన పారిజాతం.. అతడిని నిలదీస్తుంది. “ఆ రోజు నన్ను మీరంతా మతిలేని దానిని చేశారు. అసలు ఎవరు నా మనవరాలు? ఎవరు నీ కూతురు?” అని అడుగుతుంది. “కార్తీక్ గాడే పెద్ద మాయలోడు అనుకున్నాను.. నువ్వు అంతకంటే పెద్ద మాయలోడివి” అని ఫైర్ అవుతుంది. అప్పుడు దాస్ కూల్‌గా.. “నీ మనవరాలు ఎవరో కాదు.. దీప” అని చెప్పడంతో పారిజాతం కాళ్ల కింద భూమి కంపించినంత పనవుతుంది. ఈ నిజం ఎలా తెలిసిందని పారు అడగ్గా.. “కుబేర్ ఫోటో చూసి అనసూయ గారిని అడిగితే, ఆమె మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పేసింది” అని అంటాడు దాస్.

దీప తన సొంత మనవరాలు అని తెలియగానే పారిజాతం ఎమోషనల్ అవుతుంది. “దీపకి నాకు ఓ పోలిక ఉంది.. నేను కూడా ఆ ఇంట్లో పనిమనిషినే కాబట్టి ఆ రక్తం నాకు కరెక్ట్‌గా సెట్ అయ్యింది” అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. “నువ్వే నా మనవరాలివి అని తెలియక, నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టానో కదా తల్లీ” అని తీవ్ర పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది పారిజాతం.

పారిజాతానికి దాస్ వార్నింగ్.. భయపెట్టిన శివన్నారాయణ పేరు

దీప తన మనవరాలని తెలిసిన ఆనందంలో, పారిజాతం వెంటనే ఆమెను చూడాలని బయల్దేరుతుండగా దాస్ ఆపుతాడు. “దీప నీకు మనవరాలు ఎలా అయ్యింది? ఎప్పుడు అయ్యింది? అని కాంచన అడుగుతుంది. అప్పుడు ఏం సమాధానం చెబుతావు?” అని దాస్ ప్రశ్నిస్తాడు. “అసలు బిడ్డల్ని ఎందుకు మార్చావని శివన్నారాయణ గారికి తెలిస్తే, నిన్ను తుపాకీతో కాల్చిచంపడమే కాదు.. నేరుగా జైలుకు పంపి అరెస్ట్ చేయిస్తాడు” అని దాస్ చెప్పడంతో పారిజాతం గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. “అన్ని తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండాలి.. లేదంటే ఆ కార్తీక్ గాడు నిన్ను ఇరికించేస్తాడు” అని దాస్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాస్ ఎన్ని చెప్పినా వినని పారిజాతం, తన మనవరాలిని ఎలాగైనా చూడాలని వెంటనే కార్తీక్ ఇంటికి పరుగుతీస్తుంది.

జ్యోత్స్నను చీల్చి చెండాడిన సుమిత్ర, దశరథ

మరోవైపు, దీపే సుమిత్ర కన్నకూతురని తెలుసుకున్న జ్యోత్స్న ఆలోచనల్లో పడిపోతుంది. “నేను సుమిత్ర కూతురిని కాదన్న విషయం ఇంకెంతమందికి తెలుసు? దీప, దాస్, బావ (కార్తీక్) అందరూ ఒక్కటైపోయారు. కాంచన అత్తకి కూడా ఈ విషయం చెప్పారా?” అని తీవ్రంగా ఆలోచిస్తూ భోజనం చేయకుండా కూర్చుంటుంది. ఇది గమనించిన దశరథ, “ఏం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు?” అని అడుగుతాడు. దానికి జ్యోత్స్న పొగరుగా.. “కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు, మనుషులు కొత్తగా కనిపిస్తారు” అని పరోక్షంగా సెటైర్లు వేస్తుంది.

Advertisement

అది విన్న సుమిత్రకు కోపం కట్టలు తెంచుకుంటుంది. “మధ్యాహ్నం జరిగిన విషయమే అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. త్వరలో మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాం, అత్తారింటికి వెళ్లిపో” అని కరాఖండీగా చెబుతుంది. “పెళ్లి అనేది ఏదో రకంగా కంప్లీట్ చేసేది కాదు, దానికి కొంత టైం పడుతుంది” అని జ్యోత్స్న సమాధానం ఇస్తుంది. “నువ్వు సరిగ్గా ఉండి ఉంటే.. మాకు వీలునామా రాసే పరిస్ధితి వచ్చేది కాదు. నీ వల్ల నా ఆడపడుచు ముఖం చూడగలుగుతున్నానా?” అని కూతురిపై మండిపడుతుంది సుమిత్ర. “ఆస్తులు తీసుకోవడానికి ఓకే కానీ.. ఇలా మాటలు పడటం ఇష్టం లేదు” అంటూ సీరియస్ అవుతుంది జ్యోత్స్న. “నీ కారణంగానే అందరూ విడిపోయే పరిస్ధితి వచ్చింది” అని దశరథ కూడా మండిపడతాడు. దానికి జ్యోత్స్న, “నేను మీ అందరితో మాట్లాడాలి” అని అంటుంది. “నువ్వు ఏం చెప్పాలనుకున్నా మీ అమ్మని దృష్టిలో పెట్టుకుని చెప్పు” అని దశరథ వార్నింగ్ ఇస్తాడు. జ్యోత్స్న ఏం చెప్పబోతోందనేది తదుపరి ఎపిసోడ్‌లో కీలకం కానుంది.

కార్తీక్ ఇంట్లో పారిజాతం రచ్చ.. దీపను చూసి కన్నీరుమున్నీరు

ఇక ఎపిసోడ్ చివర్లో ఉత్కంఠభరితమైన సీన్ చోటు చేసుకుంది. కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా.. పారిజాతం గట్టిగా తలుపులు కొడుతూ లోపలికి వస్తుంది. పారిజాతాన్ని చూసిన కార్తీక్ అలర్ట్ అవుతాడు. “ఏం జరిగినా.. ఏం జరగనట్లే ఉండు” అని దీపను అలర్ట్ చేస్తాడు కార్తీక్. లోపలికి వచ్చిన పారిజాతాన్ని చూసి, “డైలీ ఈ టైంకి ఒక ముష్టిది వస్తుంది.. అది నువ్వే అనుకున్నాను” అని కావాలనే అవమానిస్తాడు కార్తీక్. ఆ మాటలకు పారు షాక్ అయినా, కార్తీక్ మాటలను అస్సలు పట్టించుకోదు.

ఆమె కళ్లంతా దీప కోసమే వెతుకుతుంటాయి. “దీప… దీపా…” అంటూ అరుస్తూ ఇళ్లంతా పిచ్చిదానిలా వెతుకుతుంది పారిజాతం. ఆమె అరుపులు విని లోపల నుంచి అనసూయ, కాంచన బయటకు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. పారిజాతం పరిస్థితి చూసి, “తప్పిపోయిన కూతురి కోసం తల్లి వెతుకుతున్నట్లు, ఇలా దీపను వెతుకుతుందేంటి?” అని ఆశ్చర్యంగా అడుగుతుంది అనసూయ. “ఇంటి దగ్గర దీపను తిట్టాల్సిన తిట్లు ఇంకా ఏమైనా మిగిలిపోయాయా?” అని కాంచన సెటైర్ వేస్తుంది. దానికి పారిజాతం ఏడుస్తూ.. “నేనొచ్చింది తిట్టడానికి కాదు, నా తప్పులు ప్రక్షాళన చేసుకోవడానికి” అని అనడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు.

అంతలో దీప కనిపించగానే, పారిజాతం పరుగున వెళ్లి “మనవరాలా…” అంటూ దీపను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అవుతూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. పారిజాతం ప్రవర్తన చూసి దీపతో పాటు అక్కడున్న కాంచన, అనసూయ, కార్తీక్‌లు షాక్ అయ్యి విస్తుపోతారు. ఇంతటితో ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement

తరువాయి భాగంలో ఏం జరగబోతోంది?

దీపనే తన మనవరాలని పారిజాతం అందరి ముందు ఒప్పేసుకుంటుందా? దాస్ చెప్పినట్లు శివన్నారాయణకు భయపడి నాటకం ఆడుతోందా? మరోవైపు సుమిత్ర కన్నకూతురు దీపనే అని తెలుసుకున్న జ్యోత్స్న, దీపను అంతం చేయడానికి ఎలాంటి కుట్రలు పన్నబోతోంది? కార్తీక్, దీపను ఎలా రక్షించుకోబోతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే తదుపరి ఎపిసోడ్స్ చూడాల్సిందే!

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి