Categories: NewsTV Shows

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Advertisement
Published by
Advertisement

Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’ Karthika Deepam 2 సీరియల్ రోజురోజుకూ సరికొత్త మలుపులతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఒకప్పటి కార్తీక దీపం సీరియల్ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేస్తూ, ఈ సెకండ్ సీజన్ కూడా బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తోంది. ముఖ్యంగా దీప, కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం పాత్రల చుట్టూ తిరుగుతున్న కథలో ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. మార్చి 31వ తేదీ ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యే సీన్స్ ఉన్నాయి. ఒకవైపు ఎప్పుడూ దీపను ద్వేషించే పారిజాతంలో అమాంతం మార్పు రావడం, మరోవైపు జ్యోత్స్న తన క్రూరత్వాన్ని పరాకాష్టకు చేరుస్తూ దీపను అంతం చేయడానికి ప్లాన్ చేయడం ఈరోజు ఎపిసోడ్‌లో హైలైట్. మరి ఈ ఎపిసోడ్‌లో తలకిందులైన సమీకరణాలు ఏంటి? పారిజాతం ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? జ్యోత్స్న ప్లాన్ ఏంటి? అన్న విషయాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Karthika Deepam 2 March 31st 2026 Episode : దీపను చంపేందుకు జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. మనవరాలిపై పారిజాతం ఎనలేని ప్రేమ!

Karthika Deepam 2 March 31st 2026 Episode దీపపై పారిజాతం ఎనలేని ప్రేమ.. షాక్‌లో కుటుంబ సభ్యులు

అర్ధరాత్రి సమయంలో పారిజాతం కాంచన వాళ్ల ఇంటికి వస్తుంది. నేరుగా ఇంట్లోకి రాగానే దీపను చూసి ‘నా మనవరాలా’ అంటూ ఎంతో భావోద్వేగంగా హత్తుకుంటుంది. ఎప్పుడూ దీపను నానా మాటలు అనే పారిజాతం, ఒక్కసారిగా అర్ధరాత్రి వచ్చి ఇంత ప్రేమ చూపించడం చూసి అక్కడ ఉన్న కార్తీక్, దీప, కాంచన, అనసూయలు షాక్ అవుతారు. ఉదయం అంతలా తిట్టి, ఇప్పుడు ఎందుకు ఇంత ప్రేమ ఒలకబోస్తున్నావు? అని కార్తీక్ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు. దానికి పారిజాతం ఎంతో వినయంగా సమాధానం చెబుతుంది. “ఉదయం నేను తప్పు చేసినట్లు అనిపించింది. అద్దం ముందు నిలబడి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నా అంతరాత్మ నన్ను నిలదీసింది. దీప నీకు మనవరాలు లాంటిది, ఆమెను ఎందుకు ఆడిపోసుకుంటావని తిట్టింది. అందుకే నా తప్పు తెలుసుకుని వెంటనే దీపకి సారీ చెబుదామని ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను” అని పారిజాతం చెబుతుంది.

Advertisement

ఇంతలో అక్కడికి చిన్నారి శౌర్య రాగానే, పారిజాతం ఆ పాపను కూడా ఎంతో గట్టిగా ప్రేమగా హత్తుకుంటుంది. పారిజాతం ప్రేమను తట్టుకోలేక శౌర్య వదలమని గింజుకుంటుంది. “ఇన్నాళ్లు నిజం తెలియక మిమ్మల్ని ఎంత దూరం పెట్టానురా నా బంగారు తల్లీ” అంటూ పారిజాతం కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడే ఉన్న కుబేర ఫోటో వైపు చూస్తూ పారిజాతం ఎమోషనల్ అవుతుంది. “కుబేర గారి మనసు ఇడ్లీ లాంటి తెల్లని మనసు. ఆయన చాలా గొప్పవాడు” అని పొగుడుతుంది. దానికి కార్తీక్ కల్పించుకుని, “ఆయన నువ్వు అనుకున్నంత గొప్పోడు కాదులే.. ఓ చిన్న కాకా హోటల్ నడుపుకునేవాడు” అని అంటాడు. అప్పుడు పారిజాతం, “ఎక్కడో బస్టాండ్‌లో దొరికిన పాపను తన సొంత కన్నకూతురిలా పెంచుకున్నాడంటే ఆయనది ఎలాంటి గొప్ప గుండెరా. పొరపాటున బస్టాండ్ పాలైన నా మనవరాలు..” అని నోరు జారబోయి, వెంటనే తేరుకుని “ఎవరో బిడ్డను కుబేర పెంచాడు. అతనికి చిన్న గుడి కడతాను. నాలో ఇప్పుడు కొత్త పారిజాతం ఉదయించింది” అని ఎంతో ఫీల్ అవుతూ చెబుతుంది. అప్పుడు పారిజాతం వరసలు కలుపుతూ.. “నువ్వు నా కూతురివి కాంచన. కార్తీక్ నా మనవడు. దీప నా మనవరాలు. శౌర్య నా మునిమనవరాలు. అనసూయ దీపకి మేనత్త కాబట్టి నాకు కూడా కూతురే” అని అంటుంది. ఇదంతా వింటున్న వాళ్లకి అసలు పారిజాతానికి ఏమైందో అర్థం కాదు.

Karthika Deepam 2 March 31st 2026 Episode అసలు నిజం దీపకు చెప్పిన కార్తీక్

పారిజాతం ప్రవర్తన శృతి మించుతుండటంతో కార్తీక్ ఆమెను హెచ్చరిస్తాడు. “నువ్వు వెంటనే ఇక్కడి నుంచి మీ ఇంటికి వెళ్లు, లేదంటే పెద్ద సారుకు (శివన్నారాయణ) ఫోన్ చేస్తాను” అని కార్తీక్ బెదిరించడంతో పారిజాతం కాస్త కంగారు పడుతుంది. “సరే, రేపు మా ఇంటికి వచ్చినప్పుడు తనివితీరా మాట్లాడుకుందాం నా బంగారు తల్లి” అని దీపతో చెప్పి పారిజాతం అక్కడినుంచి వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే, “ఒరేయ్, అసలు ఈ పిన్నికి ఏమైందిరా? అంత హుషారుగా ఉందేంటి?” అని కాంచన అడుగుతుంది. దీప కూడా “ఆవిడకి ఏమైంది బాబు గారు? నన్ను మనవరాలు అంటోంది?” అని కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. అప్పుడు కార్తీక్ అసలు విషయం బయటపెడతాడు. “ఉదయం పారు నిన్ను, మా అమ్మను తిట్టింది కదా? అందుకే నేను ఆమెకు ఓ చిన్న షాక్ ఇచ్చాను. కార్తీక్ ప్లాన్ ప్రకారమే, దీపనే నీ సొంత మనవరాలు అని దాసు మావయ్యతో పారిజాతానికి అబద్ధం చెప్పించాను. అందుకే ఆమె దీపను తన సొంత మనవరాలు అనుకుని మురిసిపోతోంది” అని చెబుతాడు. దానికి దీప, “పాపం కదా బావ అలా అబద్ధం చెప్పించడం” అనగా, “పాపాలు చేసేవాళ్లని పాపం అనడం మహాపాపం దీప” అని కార్తీక్ అంటాడు.

దీపను చంపేందుకు జ్యోత్స్న భయంకరమైన స్కెచ్

మరోవైపు శివన్నారాయణ ఇంట్లో జ్యోత్స్న తన తదుపరి వ్యూహాన్ని అమలు చేస్తుంది. భోజనాలు ముగిసిన తర్వాత శివన్నారాయణ, దశరథ, సుమిత్రలతో జ్యోత్స్న సీరియస్‌గా మాట్లాడుతుంది. “ఉదయం జరిగిన గొడవ వల్ల మీరంతా నాపై కోపంగా ఉన్నారు కదా, ఆ గొడవను అందరి సమక్షంలో సరిదిద్దుకుంటానని సారీ చెబుతున్నాను” అని నటిస్తుంది. “ఇంటికి వచ్చిన ఆడపడుచును అవమానించి పంపించావు, ఇప్పుడు మాకు సారీ చెప్తే సరిపోతుందా?” అని సుమిత్ర గట్టిగా నిలదీస్తుంది. దానికి జ్యోత్స్న సమాధానం ఇస్తూ, “అందుకే మమ్మీ రేపు మన ఇంట్లో ఒక పెద్ద గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నాను. నీ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగి నువ్వు క్షేమంగా తిరిగి వచ్చిన సందర్భంగా మన రెండు ఫ్యామిలీలు, కొంతమంది క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్‌కు పార్టీ ఇద్దాం. దీంతో చిన్న చిన్న మనస్పర్ధలు, సమస్యలు తొలగిపోతాయి. పెళ్లి గురించి కూడా రేపే అధికారికంగా చెబుతాను. అంతేకాదు మమ్మీ, నీకొక స్పెషల్ సర్ ప్రైజ్ కూడా ఇస్తాను” అని అంటుంది. ఆ సర్ ప్రైజ్ ఏంటని సుమిత్ర అడగ్గా… “నీ కూతురు (దీప) చావే ఆ సర్ ప్రైజ్” అని జ్యోత్స్న తన మనసులో క్రూరంగా అనుకుంటుంది. జ్యోత్స్న మాటలు విన్న శివన్నారాయణ.. “నువ్వు చాలా మంచిదానివి కానీ అప్పుడప్పుడు తేడాగా బిహేవ్ చేస్తావు” అని మండిపడతాడు. కానీ దశరథ మాత్రం, “మన జ్యోత్స్నలో మంచి మార్పు మొదలైంది. వీలునామా మార్చి రాయించడం వల్ల చాలా మంచి జరిగింది” అని గుడ్డిగా నమ్ముతాడు.

దొరికిపోయిన పారిజాతం.. కార్తీక్ ఎంట్రీ

ఇక అర్ధరాత్రి దాటుతున్నా పారిజాతం ఇంటికి రాకపోవడంతో జ్యోత్స్న, శివన్నారాయణలు కంగారుగా ఎదురుచూస్తుంటారు. అప్పుడే గాల్లో డ్యాన్స్ చేసుకుంటూ, ఎంతో సంతోషంగా పాడుకుంటూ ఇంట్లోకి వస్తుంది పారిజాతం. ఆమెను ఆ స్థితిలో చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. “ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావు? నీ ముఖంలో ఈ వెర్రీ ఆనందం ఏంటీ?” అని కఠినంగా అడుగుతాడు. దానికి పారిజాతం తడబడుతూ.. “ఏం లేదు, వాకింగ్‌కి వెళ్లాను. ఆరోగ్యమే మహాభాగ్యమని మీరే చెప్పారు కదా? మీ మాటే వేదవాక్కు, ఆ మాటను నేను ఎప్పటికీ దాటను” అని అబద్ధం చెబుతుంది. వెంటనే శివన్నారాయణ తన ఫోన్ తీసి, పారిజాతం దీపను, శౌర్యను హత్తుకుని ఎమోషనల్ అవుతున్న వీడియోను చూపించి షాక్ ఇస్తాడు. “ఈ వీడియోను కార్తీక్ గాడు పంపించాడు. వాడు కూడా వస్తున్నాడు” అని చెప్పగానే, కరెక్ట్‌గా కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు.

“నువ్వు కాంచన అత్త ఇంటికి, ఆ దీప దగ్గరకు ఎందుకు వెళ్లావని” జ్యోత్స్న నిలదీస్తుంది. “నేను అడగాల్సిన ప్రశ్నను తను అడిగింది.. ముందు సమాధానం చెప్పు” అని శివన్నారాయణ అరుస్తాడు. అప్పుడు పారిజాతం కవర్ చేస్తూ.. “ఉదయం జ్యోత్స్న నానామాటలతో అందరినీ బాధపెట్టింది కదా, కాంచనను అవమానించింది. అందుకే వాళ్లను ఓదారుద్దామని వెళ్లాను” అని అంటుంది. కానీ శివన్నారాయణ నమ్మడు. “నిజం చెప్పు” అని గట్టిగా అడుగుతాడు. “నాకు అక్కడికి వెళ్లే హక్కు ఉంది కాబట్టి వెళ్లాను” అని ఎదురు సమాధానం చెప్పి పారిజాతం లోపలికి వెళ్లిపోతుంది. “నువ్వు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావని” కార్తీక్‌ని అడుగుతుంది జ్యోత్స్న. “పారు ఇంత రాత్రివేళ మా ఇంటికి వచ్చిందంటే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను” అని అంటాడు కార్తీక్.

జ్యోత్స్న ప్లాన్ ను అనుమానించిన కార్తీక్

“నువ్వు వచ్చి మంచి పనిచేశావు కార్తీక్. రేపు మా ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. మీ ఫ్యామిలీ అంతా సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తున్నా” అని జ్యోత్స్న చెబుతుంది. “ఇప్పుడు ఎందుకు పార్టీ?” అని కార్తీక్ అడగ్గా, “మమ్మీ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని ఇస్తున్నా. ముఖ్యంగా పార్టీకి దీప కూడా ఖచ్చితంగా రావాలి” అని జ్యోత్స్న కండిషన్ పెడుతుంది. “దీప ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటుంది” అని కార్తీక్ చెప్పగా.. “లేదు, దీప నా స్పెషల్ గెస్ట్, దీప రాకపోతే పార్టీ ఆగిపోతుంది బావ” అని జ్యోత్స్న పట్టుబడుతుంది. దాంతో కార్తీక్‌కు అనుమానం వస్తుంది. ‘జ్యోత్స్న ఏదో పెద్ద ప్లాన్ చేసిందని, దీప లేకుండా తాము వస్తే ఆమె ప్లాన్ వర్కౌట్ అవ్వదనే ఇలా చేస్తోందని’ కార్తీక్ తన మనసులో అనుకుంటాడు.

పారిజాతం వర్సెస్ జ్యోత్స్న.. భయంలో కాంచన

గదిలోకి వెళ్లిన పారిజాతం వెనకాలే జ్యోత్స్న వెళ్లి ఆమెపై ఫైర్ అవుతుంది. “అసలు నువ్వు దీప దగ్గరికి ఎందుకు వెళ్లావు?” అని నిలదీస్తుంది. “అది నా మనవరాలు” అని చెప్పబోయి పారిజాతం ఆగిపోతుంది. “దీప దగ్గరకు ఎందుకు వెళ్లానంటే.. అది నా ఇష్టం. అసలు పారిజాతం అంటే ఏమనుకుంటున్నారు? అందరూ నన్ను భయపెట్టేవాళ్లే. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారాయి. నాకు మంచి రోజులు వచ్చాయి. ఇక నేను ఎవరి కోసం ఏడవాల్సిన అవసరం లేదు. నా ఆశలు ఫలించాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి. నేను ఎవరికి భయపడను. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. ఎన్ని సార్లయినా దీప దగ్గరకు వెళ్తాను. నాకు కావాల్సిన వాళ్ల దగ్గరకు వెళ్తాను” అని పారిజాతం జ్యోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అసలు గ్రానీకి ఏమైందని జ్యోత్స్న తీవ్రంగా ఆలోచిస్తుంది. కానీ ఏది ఏమైనా రేపు దీప పార్టీకి రావాలని, అక్కడే ఆమె కథ ముగించాలని జ్యోత్స్న ఫిక్స్ అవుతుంది.

ఇటువైపు కాంచన వాళ్ల ఇంట్లో.. గెట్ టుగెదర్ పార్టీ అనగానే కాంచన, అనసూయలు కంగారు పడుతుంటారు. “ఇప్పుడు మళ్లీ ఏ గొడవ చేయడానికి ఈ పార్టీకి పిలుస్తున్నారో? జ్యోత్స్న ఒక రాకాసిలాగా మారింది. రేపు ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్లాలి? ప్రతిదానికీ మాట పడాల్సి వస్తోంది” అని కాంచన బాధపడుతుంది. దానికి అనసూయ.. “మీ నాన్నగారు స్వయంగా పిలిచాక వెళ్లకపోతే బాగుండదు. బహుశా వీలునామా గురించి మళ్లీ ఏదో పంచాయతీ పెట్టడానికే జ్యోత్స్న ఇలా ప్లాన్ చేసి ఉంటుందని” అనసూయ అంటుంది. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగనుంది?

రేపటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగనుంది. దీపను పార్టీకి రప్పించి, అందరి ముందు అవమానించడమే కాకుండా, ఆమెను శాశ్వతంగా అంతమొందించాలని జ్యోత్స్న వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? జ్యోత్స్న కుట్రలను కార్తీక్ ఎలా తిప్పికొడతాడు? పారిజాతం నిజంగానే దీపకు సపోర్ట్ చేస్తుందా లేక తన స్వార్థం చూసుకుంటుందా? అన్నది తదుపరి ఎపిసోడ్‌లో తెలియనుంది.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

13 hours ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

2 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

2 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

2 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

2 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

2 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

2 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

2 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

2 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

3 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

3 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

3 days ago